BigTV English

Korean SkinCare Routine: బెస్ట్ కొరియన్ ఫేసియల్స్ టిప్స్.. అంతులేని తెల్లటి స్కిన్ మీ సొంతం

Korean SkinCare Routine: బెస్ట్ కొరియన్ ఫేసియల్స్ టిప్స్.. అంతులేని తెల్లటి స్కిన్ మీ సొంతం

Korean Skin Care Routine: అందరిలాగా ముఖం తెల్లగా, కాంతివంతంగా ఉండాలని.. ఏ అమ్మాయి కోరుకోదు చెప్పండి. ఇంకా చాలామంది కొరియన్ లాంటి చర్మం కావాలని కోరుకుంటారు. ఇందుకోసం రకరకాల ఫేస్ క్రీములు ఉపయోగిస్తుంటారు. వాటివల్ల ఫలితం ఉంటుందో లేదో పక్కన పెడితే.. చర్మం డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అంతే కాదు ఇలా మార్కెట్లో లభించే ఫేస్ క్రీములు వాడటం వల్లన.. కొన్నాళ్లకే వయసులో పెద్దవారిలాగా కనిపిస్తారు. కాబట్టి వీలైనంత వరకు అవి వాడటం తగ్గించి.. ఇంట్లోనే నాచురల్ ఫేస్ ప్యాక్‌లు ఉపయోగించండి. మంచి ఫలితం ఉంటుంది. కొద్ది నిమిషాల్లోనే ముఖం తెల్లగా, కాంతివంతంగా మారుతుంది. మీ ముఖం కొరియన్స్‌లాగా మారుతుంది. ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.


స్టెప్ -1
ముందుగా రైస్ వాటర్‌లో దూది కానీ, కాటన్ క్లాత్ కానీ ముంచి ఫేస్‌పై అప్లై చేసి, పది నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై మృత కణాలు తొలగిపోయి.. కాంతి వంతంగా మెరుస్తుంది.

స్టెప్ -2
ముందుగా చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ బియ్యంపిండి, టీ స్పూన్ తేనె, చిటికెడు పసుపు కలిపి ముఖానికి పెట్టుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా చేయడం ద్వారా ముఖం కాంతివంతంగా, మిల మిల మెరుస్తుంది.


స్టెప్-3
చిన్న బౌల్ తీసుకుని అందులో.. రెండు టేబుల్ స్పూన్ బియ్యం పిండి, రెండు టేబుల్ స్పూన్ పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి.. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఈ ఫేస్ ప్యాక్ ముఖంపై మృత కణాలను తగ్గిస్తాయి. అలాగే మొటిమలు, మచ్చలు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి.

స్టెప్-4
చిన్న బౌల్ తీసుకుని అందులో పాలు, పసుపు, తేనె కలిపి ముఖానికి అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే.. ముఖంపై మచ్చలు, మొటిమలు తగ్గిపోయి కాంతివంతంగా మెరుస్తుంది.

పాలు, నిమ్మరసం, పసుపు ఫేస్ ప్యాక్
చిన్న బౌల్ తీసుకుని.. అందులో రెండు టేబుల్ స్పూన్ పాలు, టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి బాగా మిక్స్ చేయండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పెట్టుకుని అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే ముఖంపై మొటిమలు, మచ్చలు తొలగిపోయి.. యవ్వనంగా కనిపిస్తారు.

కాఫీ పౌడర్, టమాటో గుజ్జు, షుగర్ ఫేస్ ప్యాక్
చిన్న గిన్నె తీసుకుని అందులో కాఫీ పౌడర్ రెండు టీస్పూన్లు, షుగర్ కొంచెం, టమాటా గుజ్జు కలిపి ముఖానికి అప్లై చేయండి. అరగంట తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖంపై కాంతివంతంగా, తెల్లగా మారుతుంది.

Also Read: అందమైన చర్మం కోసం.. బొప్పాయి పేస్ ప్యాక్

గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.

Related News

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Skin Whitening Tips: ఛాలెంజ్, ఈ టిప్స్ పాటిస్తే.. 7 రోజుల్లోనే నిగనిగలాడే చర్మం

Steel Pans: స్టీల్ పాత్రల్లో.. వీటిని పొరపాటున కూడా వండకూడదు !

Big Stories

×