Vinesh Phogat | పారిస్ ఒలింపిక్స్ లో మహిళల కుస్తీ పోటీల్లో భారత రెజ్లర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు వినేశ్ ఫోగట్‌పై ఒలింపిక్స్ కమిటీ అనర్హత వేటు వేయడం వివాదాస్పదంగా మారింది. ఆయితే ఆమె అనర్హత వేటు నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్స్ (సిఎఎస్)లో భారత ఒలింపిక్ సంఘం అప్పీల్ చేసింది. ఈ అప్పీల్ పై శుక్రవారం విచారణ జరిపిన సిఎఎస్ కోర్టు ఒలింపిక్స్ ముగిసే లోపు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఈ విచారణ సంతృప్తికరంగా సాగిందని.. వినేశ్ ఫోగట్ కు న్యాయం జరుగుతుందని భారత ఒలింపిక్ సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తూ.. ఓ ప్రకటన విడుదల చేసింది.
వినేశ్ ఫోగట్ పై అనర్హత వేటు పడడంతో భారత దేశమంతా ఆమె పట్ల సానుభూతిగా ఉన్న తరుణంలో భారత ఒలింపిక్ సంఘం విడుదల చేసిన ప్రకటన కీలకంగా మారింది. అనర్హత వేటు తరువాత అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల ప్రకారం.. ఫోగట్ కు కుస్తీ పోటీల్లో పాల్గొన్న రెజ్లర్ లో చివరి ర్యాంకు కేటాయిస్తారు. ఆమెకు ఎటువంటి పతకాలు ఉండవు. అయితే విచారణ సంతృప్తికరంగా సాగిందని సిఎఎస్ కోర్టు న్యాయమూర్తి ఆర్బిట్రేటర్ డాక్టర్ అన్నెబెల్ బెన్నెట్ (ఆస్ట్రేలియా) ఈ విచారణను మూడు గంటలపాటు సుదీర్ఘంగా కొనసాగించారని.. విచారణలో పాల్గొన్న వినేశ్ ఫోగట్, అంతర్జాతీయ రెజ్లింగ్ ప్రతినిధులు, ఒలింపిక్స్ కమిటీ ప్రతినిధులు తమ వాదనలు వినిపించారని ప్రకటనలో ఇండియన్ ఒలింపిక్ సంఘం పేర్కొంది.
మరోవైపు ఇండియన్ ఒలింపిక్ సంఘం పిటి ఉష మాట్లాడుతూ.. ”విచారణ సంతృప్తికరంగా సాగింది. వినేశ్ ఫోగట్ కు సిల్వర్ మెడల్ ప్రదానం చేస్తారని నాకు నమ్మకం ఉంది, సాటి మహిళా క్రీడా కారిణిగా ఫోగట్ కు జరిగిన అన్యాయం నేను అర్థం చేసుకోగలను. మేము సిఎఎస్ కోర్టులో మా వాదనలు వినిపించాం.” అని అన్నారు.
Also Read: ఒలింపిక్స్ లో భారత్‌కు మరో కాంస్య పతకం.. 57 కేజి రెజ్లింగ్‌లో అమన్ సెహ్రావత్ విజయం!
ఒలింపిక్స్ లో మహిళల కుస్తీ 50 కేజీల కేటగిరిలో జరిగిన పోటీల్లో వినేశ్ ఫోగట్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. తొలి బౌట్ లోనే అయిదు సార్లు ప్రపంచ చాంపియన్ ఓటమి ఎరుగని జపాన్ రెజ్లర్ యుఇ సుసాకీని ఓడించి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ తరువాత క్వార్టర్ ఫైనల్లో యుక్రెయిన్ రెజ్లర్ ని, సెమీ ఫైనల్లో క్యూబా రెజ్లర్ల పై విజయం సాధించి ఫైనల్లో అమెరికా రెజ్లర్ తో పోటీకి అర్హత సాధించారు.
కానీ ఫైనల్ మ్యాచ్ కు ముందు ఆమె శరీర బరువు 100 గ్రాములు ఎక్కువ ఉండడంతో ఆమెపై అనర్హత వేటు వేశారు. ఈ కారణంగా ఆమె సిఎఎస్ కోర్టులో తన అనర్హతకు వ్యతిరేకంగా అప్పీల్ చేశారు.
Also Read: అందమే తనకు శాపం, క్రీడాకారులను ఇబ్బందులకు గురి చేసిందంటూ..