Aman Sehrawat in paris olympics 2024(Live sports news): పారిస్ ఒలింపిక్స్ లో భారత దేశానికి అయిదో కాంస్య పతకం లభించింది. 57 కేజీల పురుషుల కుస్తీ పోటీల్లో భారత్ రెజ్లర్ అమన్ సెహ్రావత్.. ప్యూర్టో రీకో కు చెందిన డేరియన్ టోయి క్రుజ్ ని 13-5 తో చిత్తుగా ఓడించాడు. పారిస్ ఒలింపిక్స్ కుస్తీ పోటీల్లో భారత్ తరపున పురుషుల రెజ్లర్ లో కేవలం అమన్ సెహ్రావత్ ఒక్కడు మాత్రమే అర్హత సాధించాడు. పైగా ఇదే అతని తొలి ఒలింపిక్స్ కూడా. దీంతో అమన్ సెహ్రావత్ తన తొలి ఒలింపిక్స్ లోనే మెడల్ సాధించిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
సెమీ ఫైనల్ లో ఓటమి తరువాత కాంస్య పతకం కోసం జరిగిన రెజ్లింగ్ మ్యాచ్ లో అమన్ సెహ్రావత్ డేరియన్ తో శుక్రవారం రాత్రి (భారత సమయం) తలపడ్డాడు. ఆట ప్రారంభంలోనే డేరియన్ పై చేయి సాధించడంతో అతని తొలి పాయింట్ లభించింది. అయితే అమన్ ఆ తరువాత డేరియన్ పై పట్టుసాధించి.. రెండు పాయింట్లు స్కోర్ చేశాడు. దీంతో తొలి బౌట్ లో అమన్ 2-1 తో లీడ్ సాధించాడు.
Also Read: తినడానికి తిండి లేదు.. తండ్రి కూలీ.. కట్ చేస్తే ఇప్పుడు ఒలింపిక్ హీరో
ఆ తరువాత అమన్ డిఫెన్స్ మాత్రమే చేస్తూ.. అదను చూసి డేరియన్ ను గట్టిగా పడగొట్టాడు. మ్యాచ్ ఫస్ట హాఫ్ ముగిసే సరికి అమన్ 6-3తో మరింత ఆధిక్యంతో దూసుకెళ్లాడు. రెండో రౌండ్ లో కూడా డేరియన్.. అమన్ సెహ్రావత్ పడగొట్టాలని చూసి విఫలమయ్యాడు. డేరియన్ మ్యాచ్ లో అద్యంతం భారత రెజ్లర్ ని పడగొట్టాలని ఎంత ప్రయత్నించినా అతనికి నిరాశే మిగిలింది. దీంతో డేరియన్ విసుగుతో మ్యాచ్ లో తరుచూ బ్రేక్ లు తీసుకున్నాడు. డేరియన్ పదే పదే అదే తప్పు చేయడం గమనించిన సెహ్రావత్ అతడిపై టెక్నికల్ గా ఆధిక్యం సాధించి స్కోర్ ని 10-5 వరకు తీసుకెళ్లాడు.
ఇక మ్యాచ్ చివరి నిమిషంలో డేరియన్ ఎలాగైనా గెలవాలని.. డిఫెన్స్ పక్కన బెట్టి దాడి చేయడం ప్రారంభించాడు. ఇది గమనించిన అమన్ డేరియన్ అత్యుత్సాహాన్ని తన ఆయుధంగా మార్చుకొని అతడిపై రివర్స్ అటాక్ చేసి 13-5 స్కోర్ లీడ్ సాధించిన వెంటనే హూటర్ మోగిపోయింది. దీంతో అమన్ సెహ్రావత్ ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన అతిపిన్న వయస్కుడిగా రికార్డ్ సాధించాడు.
Also Read: భారత అథ్లెట్ నీరజ్ చోప్రాపై పాక్ ఆటగాడు సంచలన వ్యాఖ్యలు