Big Stories

Ranveer Singh-Johnny Sins Ad: పోర్న్ స్టార్ జానీ సిన్స్‌ తో రణ్‌వీర్ సింగ్ బోల్డ్ కేర్ యాడ్.. క్షణాల్లో వైరల్

Ranveer Singh-Johnny Sins Ad on Sexual Health: సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు చాలా మంది రకరకాల వీడియోలు చేస్తూ.. వైరల్ అవుతుంటారు. ఈ మధ్య ఈ వ్యవహారం బాగా పెరిగిపోయింది. బాగా పాపులర్ అవ్వాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తుంటారు. అయితే మరికొందరెమో ఈ సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్‌ని ఉపయోగించి చాలా మందికి కొన్ని విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు.

- Advertisement -

ఈ మేరకు చాలా మందికి తెలియని విషయాలను సోషల్ మీడియా ద్వారా అవగాహన కల్పిస్తుంటారు. అయితే ఈ మధ్యనే ఇలాంటి ఘటన ఒకట సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది. బాలీవుడ్ నటి పూనమ్ పాండే సర్త్వెకల్ (గర్భాశయ) క్యాన్సర్‌తో మృతి చెందినట్లు ఆమె టీం ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. రెండ్రోజుల ముందు వరకు బాగానే ఉన్న పూనమ్ పాండే సడెన్‌గా చనిపోయిందని తెలిసి ఆశ్చర్యపోయారు.

- Advertisement -

దీంతో ఇంతకీ సర్త్వెకల్ క్యాన్సర్ అంటే ఏంటి?.. అది ఎలా సోకుతుంది. దాని వల్ల కలిగే నష్టాలేంటి? అంటూ నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. ఆ సమయంలోనే పూనమ్ సోషల్ మీడియా ద్వారా పోస్ట్ పెట్టింది. తాను బతికే ఉన్నానని.. తనకు ఎలాంటి గర్భాశయ క్యాన్సర్ సోకలేదని తెలిపింది. ఈ మేరకు ఈ క్యాన్సర్ గురించి అవగాహన కల్పించేందుకే ఇలా చేశానని తెలిపింది. ఈ సెన్సేషనల్ ఘటనతో ఈ క్యాన్సర్ గురించి అందరికీ అవగాహన వచ్చింది.

READ MORE: Most Valuable Celebrities : రణ్‌వీర్‌ టాప్.. కోహ్లీ డౌన్.. అల్లు అర్జున్, రష్మిక బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా..?

అయితే ఇప్పుడు అలాంటి పద్దతినే ఓ స్టార్ హీరో ప్రయత్నించాడు. బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తాజాగా అడల్ట్ స్టార్ జానీ సిన్స్‌తో కలిసి ఓ వీడియో చేశాడు. పురుషుల లైంగిక సమస్యలను సమాజం ఎలా చర్చిస్తుందో మార్చే లక్ష్యంతో బోల్డ్ కేర్ అనే బ్రాండ్ కోసం ఒక యాడ్ చేశాడు. ఈ యాడ్‌లో రణ్‌వీర్, జానీ సిన్స్ కలిసి నటించారు.

ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోను రణ్‌వీర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా ఈ వీడియో షేర్ చేసిన రణ్‌వీర్ క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చాడు. ‘‘అవగాహన పెంచడానికి.. వీటిపై సానుకూల ప్రభావం చూపడానికి నేను ఇలా ఆలోచించాను. ఈ విషయంలో నా ప్రభావాన్ని ఉపయోగించాలనే చిత్తశుద్ధితో ఉన్నాను.

ఇది బోల్డ్ కేర్ ప్రచారం కంటే ముఖ్యంగా అందరిలో అవగాహన కల్పించాలనే ఆసక్తితో ఇలా ట్రై చేశాను. దేశ వ్యాప్తంగా ప్రభావితమైన ప్రత్యక్ష పరిష్కారాలు, మిలియన్ల మంది జీవితాలను లక్ష్యంగా చేసుకున్నాను. దీని వల్ల పురుషుల లైంగిక ఆరోగ్యాన్ని మేము ఎలా పరిష్కరిస్తాము అనే దానిలో మార్పు తీసుకురావడం కోసం నేను ఇలా చేశాను’’ అంటూ రాసుకొచ్చాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News