Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. గత కొంతకాలంగా విరాట్ కోహ్లీ ఫామ్ లో లేనప్పటికీ.. అతడి ఆట చూసేందుకు అభిమానులు భారీ స్థాయిలో స్టేడియానికి తరలి వస్తుంటారు. చివరికి అతని ప్రాక్టీస్ సెషన్ కి కూడా భారీ సంఖ్యలో అభిమానులు రావడం, ఇటీవల రంజీ ట్రోఫీలో పాల్గొన్న సందర్భంలో కూడా వేల సంఖ్యలో అభిమానులు స్టేడియానికి రావడం చూశాం.
Also Read: IPL 2025: ఐపీఎల్ 2025 నుంచి దూరం కానున్న 5 గురు ప్లేయర్లు వీళ్లే ?
రన్ మిషన్ బ్యాట్ పట్టి మైదానంలో అడుగుపెడితే మోత ముగిపోవాల్సిందే. ఇక విరాట్ కోహ్లీతో కలిసి ఫోటో దిగేందుకు, కనీసం షేక్ హ్యాండ్ అయినా ఇచ్చేందుకు ఎగబడుతూ ఉంటారు క్రీడాభిమానులు. తాజాగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ ఓ బాల్ బాయ్ కి షేక్ హ్యాండ్ ఇచ్చిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా విరాట్ కోహ్లీ స్వయంగా ఓ మహిళ దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చాడు.
దీంతో ఈ విషయం ప్రస్తుతం క్రికెట్ వర్గాలలో చర్చనియాంశంగా మారింది. కోహ్లీ స్వయంగా వెళ్లి హగ్ ఇవ్వడంతో ఆమె ఎవరో తెలుసుకునేందుకు క్రీడాభిమానులు తెగ ఆరాటపడుతున్నారు. అయితే ఇంగ్లాండ్ తో 3 వన్డేల సిరీస్ లో భాగంగా కటక్ లో రెండవ వన్డే ముగిసిన తర్వాత.. మూడవ వన్డే మ్యాచ్ కోసం భారత జట్టు అహ్మదాబాద్ కి వెళ్లేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్ పోర్ట్ చెకింగ్ ఏరియాకి ముందు తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు ఫ్యాన్స్ పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సమయంలో అటువైపుగా వచ్చిన విరాట్ కోహ్లీ.. ఆ గుంపులో నిలబడ్డ ఓ మహిళను చూసి నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. అనంతరం ఆ మహిళకు హగ్ ఇచ్చి ఆమెతో కాసేపు మాట్లాడాడు. దీంతో అక్కడే ఉన్న మిగతా అభిమానులు కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది.. విరాట్ కోహ్లీని అక్కడి నుండి పంపించేశారు. ఇలా విరాట్ కోహ్లీ హగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే భువనేశ్వర్ ఎయిర్ పోర్టులో విరాట్ కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ లక్కీ లేడీ.. కోహ్లీకి దగ్గరి బంధువు అని సమాచారం.
Also Read: Rajal Arora: టీమిండియాలో ఉన్న ఈ లేడీ ఎవరు? ఆమె బ్యాగ్రౌండ్ ఇదే !
ఈ క్రమంలోనే ఆమె వద్దకు వెళ్లి హగ్ ఇచ్చి కాసేపు మాట్లాడాడని తెలుస్తోంది. ఇక ఇంగ్లాండ్ భారత్ 3 వన్డేల సిరీస్ విషయానికి వస్తే.. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఈ సిరీస్ ని 2 -0 తో కైవసం చేసుకుంది భారత జట్టు. ఇక బుధవారం రోజు అహ్మదాబాద్ వేదికగా జరగబోయే మూడో వన్డేలో కూడా గెలుపు పొందాలని భావిస్తుంది భారత్. ఇక కనీసం మూడవ వన్డేలోనైనా గెలుపొంది ఆత్మవిశ్వాసంతో మరో వారం రోజుల్లో ప్రారంభం కాబోయే ఐసీసీ ఛాంపియర్ ట్రోఫీ 2025 లో అడుగుపెట్టాలని భావిస్తుంది ఇంగ్లాండ్ జట్టు.
Virat Kohli met a lady (close relative) at Bhubaneswar airport🥹❤️ pic.twitter.com/r71Du0Uccf
— 𝙒𝙧𝙤𝙜𝙣🥂 (@wrognxvirat) February 10, 2025