BigTV English

IND vs SA Test Series : స్వదేశానికి కోహ్లి.. గాయంతో వైదొలగిన రుతురాజ్..

IND vs SA Test Series : స్వదేశానికి కోహ్లి.. గాయంతో వైదొలగిన రుతురాజ్..

IND vs SA Test Series : ఇటీవలే టెస్టు సిరీస్ కోసం దక్షిణాఫ్రికా వెళ్లిన కోహ్లి.. ఫ్యామిలీ ఎమర్జెన్సీ కారణంగా భారత్‌కు తిరిగి వచ్చాడు. ఎమర్జెన్సీకి సంబంధించిన ఖచ్చితమైన వివరాలు తెలియాల్సి ఉంది. అయితే డిసెంబర్ 26న సెంచూరియన్‌లో ప్రారంభమయ్యే మొదటి టెస్టు కోసం అతను జోహన్నెస్‌బర్గ్‌కు తిరిగి వస్తాడనిభారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) వర్గాలు చెబుతున్నాయి.


దక్షిణాఫ్రికాతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు రుతురాజ్ గైక్వాడ్ దూరమయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ వేలి గాయం నుంచి ఇంకా కోలుకోలేదని BCCI తెలిపింది. భారత జట్టు మేనేజ్‌మెంట్ అతడిని విడుదల చేసింది.

డిసెంబర్ 19న పోర్ట్ ఎలిజబెత్‌లో ఆతిథ్య జట్టుతో జరిగిన రెండో వన్డేలో 26 ఏళ్ల గైక్వాడ్ వేలికి గాయమైంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో గాయపడ్డాడు. ఆ గాయం నుంచి అతను పూర్తిగా కోలుకోలేదని.. బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడని అని గురువారం చివరి వన్డే ప్రారంభానికి ముందు BCCI పేర్కొంది.


వన్డే సిరీస్ గురువారం ముగిసింది.. శుక్రవారంతో మూడు రోజుల ఇంట్రా-స్క్వాడ్ గేమ్‌ ముగుస్తుంది. ఈ నెల 26న సెంచూరియన్‌‌లో దక్షిణాఫ్రికాతో భారత్ తొలి టెస్ట్ ఆడనుంది. డిసెంబర్ 30న ముగిసే బాక్సింగ్ డే టెస్ట్ తర్వాత, కేప్ టౌన్‌‌లో జనవరి 3న చివరి టెస్టు ప్రారంభం కానుంది.

Related News

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

Big Stories

×