BigTV English

Preity Zinta : ప్రీతి జింటాతో డుప్లెసిస్ మూవీ.. ఫోటో వైరల్

Preity Zinta : ప్రీతి జింటాతో డుప్లెసిస్ మూవీ.. ఫోటో వైరల్

Preity Zinta : పంజాబ్ కింగ్స్(pbks) సహా ఓనర్ ప్రీతి జింటా(Preity Zinta) ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ఆ మధ్య రాజస్థాన్ యంగ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ కి హగ్ ఇచ్చిందని.. సోషల్ మీడియాలో రెండు, మూడు రోజులు వైరల్ అయిన విషయం విధితమే. అయితే తాను సూర్యవంశీ కి హగ్ ఇవ్వలేదని.. క్లారిటీ ఇచ్చారు ప్రీతి జింటా. మరోవైపు నిన్న పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో థర్డ్ అంపైర్ నిర్ణయం పై పంజాబ్ కో ఓనర్ ప్రీతి జింటా ట్విట్టర్ వేదిక గా ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ లో బ్యాటర్ శశాంక్ సింగ్ షాట్ ఆడగా బౌండరీ లైన్ వద్ద కరుణ్ నాయర్ పట్టుకొని లోపలికి విసిరాడు. తన కాలు రోప్ ను తగిలిందంటూ సిక్సర్ సిగ్నల్ ఇవ్వగా.. థర్డ్ అంఫైర్ సిక్స్ కాదన్నాడు. దీనిపై ప్రీతి జింటా స్పందిస్తూ.. ఎంతో టెక్నాలజీ ఉన్న హై ఫ్రొఫైల్ టోర్నమెంట్ లో తప్పులు సరికాదని పేర్కొన్నారు.


Also Read :  Virat Kohli : భార్యతో కలిసి అయోధ్య హనుమాన్ గర్హి ఆలయంలో విరాట్ కోహ్లీ పూజలు

మరోవైపు తాజాగా మరో వార్త వైరల్ అవుతోంది. ప్రీతి జింటాతో డూప్లెసిస్(Du plessis) మూవీ తీస్తున్నాడని.. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ప్రీతి జింటా 1998లోనే సినిమాల్లో నటించింది. దిల్ సే మూవీలో సహా నటిగా తన సినీ కెరీర్ ని ప్రారంభించింది. టాలీవుడ్ విక్టరీ వెంకటేష్ నటించిన ప్రేమంటే ఇదేరా సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది. మహేష్ బాబు హీరోగా నటించిన ఫస్ట్ మూవీ రాజకుమారుడు మూవీలో కూడా నటించింది. ఇక ఆ తరువాత బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించింది. కొన్ని ఇంగ్లీషు సినిమాల్లో కూడా నటించింది ప్రీతి జింటా. మరోవైపు సినిమాల్లో నటిస్తూ.. నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె సినీ కెరీర్ కి గుడ్ బై చెప్పింది. కొన్ని అతిథి పాత్రల్లో అప్పుడప్పుడు మెరుస్తుంది. లాహోర్ 1947 మూవీలో నటిస్తోంది. కానీ ఆ సినిమా ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు. పంజాబ్ కింగ్స్ జట్టు కి సహా ఓనర్ గా వ్యవహరిస్తున్నారు.


మరోవైపు డూప్లెసిస్ ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడుతున్నాడు. గత కొద్ది మ్యాచ్ లకు దూరంగా ఉన్న డూప్లెసిస్ ఆ తరువాత అతను వచ్చాక జట్టును గాడిలో పెట్టడంలో కాస్త తడబడాడనే చెప్పాలి. డూప్లిసిస్ కంటే అక్షర్ పటేల్ కెప్టెన్ గా ఉన్న సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన విజయాలను సాధించింది. ఒకానొక సమయంలో మొదటి స్థానంలో కొనసాగింది. ఇటీవల ముంబై జరిగిన మ్యాచ్ లో విజయం సాధిస్తే.. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆప్స్ కి చేరుకునేది. కీలక మ్యాచ్ లో చేతులెత్తేయడంతో ఢిల్లీ ప్లే ఆప్స్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు నిన్న పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం ఘన విజయం సాధించింది. తాజాగా సోషల్ మీడియాలో మాత్రం ప్రీతి జింటాతో డూప్లెసిస్ మూవీ తీస్తున్నాడని ఫొటోలు వైరల్ కావడం విశేషం.

Related News

Kranti Goud: మ‌గాడిలా ఉందంటూ ట్రోలింగ్‌..కానీ పాకిస్థాన్ పై బుమ్రాలా రెచ్చిపోయింది

Harmanpreet Kaur: దొంగ చూపుల‌తో బెదిరింపులు..బండ బూతులు తిట్టిన‌ హ‌ర్మ‌న్ ప్రీత్‌

Muneeba Run-Out: మునీబా రనౌట్ పై వివాదం..అంపైర్ తో పాక్ కెప్టెన్‌ గొడ‌వ‌, అస‌లు రూల్స్ ఏం చెబుతున్నాయి

Shoaib Akhtar: మా పురుషుల జ‌ట్టును పాకిస్థాన్ మ‌హిళలే చిత్తుగా ఓడిస్తారు..అంత ద‌రిద్రంలో ఉన్నాం

IND VS PAK Women: వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాక్ మ‌రో ఘోర ఓట‌మి.. టీమిండియా గ్రాండ్ విక్ట‌రీ

Sahibzada Farhan Bat: వీడికి ఇంకా బుద్ధి రాలేదు.. AK 47 బ్యాట్స్ తో ఇండియన్ గెలుకుతున్న పాక్ క్రికెటర్ !

IND VS PAK Women: అర్ధాంతరంగా ఆగిపోయిన పాకిస్తాన్ మ్యాచ్..స్ప్రే కొట్టిన కెప్టెన్ స‌నా

Liam Livingstone: పెళ్లి చేసుకున్న ఆర్సీబీ డేంజ‌ర్ ప్లేయ‌ర్ లివింగ్‌స్టన్..ఫోటోలు వైర‌ల్

Big Stories

×