Allu Aravind: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ టైమ్ లో థియేటర్లు బంద్ అంటూ వస్తున్న వార్తలపై ఏపీ డిప్యూటీ సీఎంవో కార్యాలయం మండిపడిన విషయం తెలిసిందే, ఓ నలుగురు నిర్మాతలు హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకుంటున్నారనే వార్తలు విస్తృతమయ్యాయి. అందులో భాగంగా మినిస్టర్ కందుల దుర్గేష్ సమగ్ర విచారణ చేయాలని అధికారులు ఆదేశించిన సంగతి తెలిసిందే, అయితే పవన్ సినిమాలు ఆపే ఆ నలుగురిలో అల్లు అరవింద్ కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై అల్లు అరవింద్ స్పందించారు.. అందులో భాగంగా ఆదివారం గీత ఆర్ట్స్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆ వివరాలు చూద్దాం..
పవన్ చెప్పింది వందకు వంద శాతం కరెక్ట్
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ చెప్పింది వందకు వందశాతం కరెక్ట్ ఆయన నిన్న మాట్లాడింది సమంజసం. ఫిలిమ్ చాంబర్ ప్రెస్ మీట్ మూడుసార్లు జరిగితే, నేను ఒక్కసారి కూడా వెళ్లలేదు. పవన్ సినిమా రిలీజ్ కు వస్తున్న సమయంలో థియేటర్ బంద్ అనేది తీసుకురావడం దుస్సాహసం. ఆయన డిప్యూటీ సీఎం అయిన తరువాత మేము వెళ్లి కలిసాము అయితే ఎవరికి వారు తమకు పవన్ కళ్యాణ్ తెలుసు అని అనుకున్నారు అంతేగాని ఛాంబర్ వాళ్ళు కలుద్దామని ఆలోచన ఇప్పటివరకు చేయలేదు. థియేటర్స్ కి సమస్యలు ఉన్నాయి అది అందరికీ తెలిసిందే వాళ్ళందరూ కలిసి ప్రభుత్వంతో చర్చిస్తే బాగుంటుంది. సమస్యల పరిష్కారానికి చాంబర్ ముందుకు రావాలి . బంద్ చేద్దాం అనే నన్ను మీటింగ్ కి రమ్మన్నారు. అందుకే నేను వెళ్లలేదు. ఆ నలుగురు లో నన్ను కలపొద్దు. ఆ నలుగురికి నాకు సంబంధం లేదు. ఆ నలుగురిలో నేను లేను వారితో ఉన్న సంబంధాలన్నీ ఎప్పుడో తెంచుకున్నాను. ఇక తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ మాత్రమే ఉంది. ఏపీలో 15 థియేటర్స్ ఉన్నాయి. గతంలో పవన్ కళ్యాణ్ ను తాము కలిసినప్పుడు సీఎం చంద్రబాబును కలవాలని, మాకు పవన్ చెప్పారు. చాంబర్ సమస్యలు సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని ఆయన తెలిపారు. సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కలిసి పరిష్కరించుకోవాలి. అని అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.
థియేటర్ల విషయంలో నా స్టాండ్ మారదు..
అల్లు అరవింద్ మాట్లాడుతూ ..థియేటర్ల విషయంలో నా స్టాండ్ మారదు. సింగిల్ స్క్రీన్ ఉన్న థియేటర్లు కష్టాల్లో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్లు మూసివేస్తామని ఏకపక్ష నిర్ణయం చేయడం నాకు నచ్చలేదు. ఏదైనా ఉంటే ఫిలిం ఛాంబర్ లేదా ప్రొడ్యూసర్ గిల్టుని వాళ్ళు సంప్రదించాలి. అలాంటిదేమీ లేకుండా వారంతటి వారే థియేటర్లు మూసివేస్తామని నిర్ణయించడం తో నేను ఏకీభవించట్లేదు అందుకే వాళ్ళు ఏర్పాట్లు చేసిన సమావేశాలకి నేను వెళ్లలేదు. ఇప్పటికే మూడు సమావేశాలు జరిగాయి వాటిలో దేనికి నేను వెళ్లలేదు. ఇక థియేటర్లో సినిమా రన్ చేయడం ఇదంతా ఒక వ్యాపారం. ఇది ప్రైవేటు వ్యాపారం దీనికి ప్రభుత్వానికి సంబంధం ఉండదు అని ఎవరో అన్నారు, మరి అలాంటప్పుడు గత ప్రభుత్వం లో అందరూ సినీ పెద్దలు వెళ్లి ముఖ్యమంత్రిని ఎందుకు కలిశారు. అంటే మనకి ప్రభుత్వం సహాయ సహకారాలు కావాలి అలాంటప్పుడు మనకు కష్టం వచ్చేదాకా కూర్చోడం ఎందుకు, మనమే వెళ్లి కలిస్తే సరిపోతుంది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సరియినవే,కష్టం వచ్చినప్పుడు కాకుండా,మనం వెళ్లి చాంబర్ సమస్యలు ప్రబుత్వం దృష్టికి తీసుకు వెళ్ళాలి. అని ఆయన తెలిపారు.