E-Paper

ఇండియాతో మ్యాచ్ అంటే, అర్థ‌రాత్రి కూడా పాక్ ప్లేయ‌ర్లు ఉలిక్కిప‌డేలా చేయాలి

ఇండియాతో మ్యాచ్ అంటే, అర్థ‌రాత్రి కూడా పాక్ ప్లేయ‌ర్లు ఉలిక్కిప‌డేలా చేయాలి
Advertisement

Harbhajan Singh:  టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 Tournament) భాగంగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మహిళల ( Team India Women vs Pakistan Women) జట్ల మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఆదివారం ఎడ్జ్ బస్టన్ (Edgbaston, Birmingham) వేదికగా ఈ మ్యాచ్ జరగగా.. 64 పరుగుల తేడాతో టీమిండియా విజయాన్ని నమోదు చేసుకుంది. బ్యాటింగ్ అలాగే బౌలింగ్ రెండు విభాగాలలో అద్భుతంగా రాణించిన టీమిండియా.. బంపర్ విక్టరీ నమోదు చేసుకుంది. అయితే పాకిస్తాన్ పై టీమిండియా గెలిచిన నేపథ్యంలో మన మాజీ క్రికెటర్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. టీమిండియా పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. లేటెస్ట్ గా టీమిండియా విజయం పై హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కూడా స్పందించారు. టీమిండియా అద్భుతమైన విజయం సాధించిందని పొగిడిన హర్భజన్ సింగ్… ఇకపై ఇండియాతో మ్యాచ్ అంటేనే పాకిస్తాన్ వణికి పోవాల్సిందేనని వెల్లడించారు. ఇండియాతో మ్యాచ్ అంటే ముందుగానే ఓటమిని అంగీకరించాల్సిందేనంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో హర్భజన్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

ఇండియాతో మ్యాచ్ అంటే,ముందే ఓట‌మిని పాక్ ఒప్పుకునేలా చేయాలి

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో మొదటి మ్యాచ్ లోనే పాకిస్తాన్ జట్టును చిత్తు చేసిన టీమ్ ఇండియాను ప్రశంసిస్తూ… హర్భజన్ సింగ్ (Harbhajan Singh) కీలక వ్యాఖ్యలు చేశారు. చాలా రోజులుగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ లు జరుగుతున్నాయని.. వీటిల్లో ఇండియా ప్రతి మ్యాచ్ లోను గెలుస్తూ వస్తుందని గుర్తు చేశారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ పైన మన మహిళల టీమిండియా అద్భుతంగా రాణించి వాళ్లకు పీడ కల మిగిల్చిందని బాంబు పేల్చారు. భవిష్యత్తులో టీమిండియాతో ఆడాలంటే పాకిస్తాన్ క్రికెటర్లు భయపడి పోవాల్సిందేనని హెచ్చరించారు. పాకిస్తాన్ పురుషుల జట్టు అయిన… లేదా మహిళల అయినా సరే… టీమిండియాతో మ్యాచ్ అంటే అర్ధరాత్రి ఉలిక్కిపడాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇండియాతో పాకిస్తాన్ మ్యాచ్ అని ఐసీసీ ప్రకటించిన వెంటనే… ఆ వెధవలు ఓడిపోయామని ముందుగానే ప్రకటించే పరిస్థితి తీసుకురావాలని దిశా నిర్దేశం చేశారు హర్భజన్ సింగ్. అప్పుడే పాకిస్తాన్ వెధవలకు సిగ్గు వస్తుందని చురకలు అంటించారు. మ్యాచ్ ప్రారంభం కంటే ముందే ఓడిపోయామని పాకిస్తాన్ ఒప్పుకునేలా చేయాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ పైన టీమిండియా ఎప్పుడు గెలిచినా… ఫిక్సింగ్ చేశామని ఆరోపణలు చేస్తారని హర్భజన్ గుర్తు చేశారు. ఆడరాని కొంతమంది సన్యాసులే… దొంగ సాకులు చెప్పుకుంటూ బతుకుతారని ఇంజమామ్, షాహిద్ అఫ్రిది, తన్వీర్ అహ్మద్ లాంటి వాళ్లకు కౌంటర్ కూడా ఇచ్చారు. దీంతో హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

Advertisement

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

Related News

Virender Sehwag: రాసి పెట్టుకోండి..మా ఆడాళ్ల‌తో పాకిస్తాన్ పురుషుల జట్టును ఓడిస్తాం

పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

Irfan Pathan: ఎయిర్ బేస్ ల లాగానే పాకిస్తాన్‌ వికెట్లు కూప్ప‌కూలాయి

Shahid Afridi: స్మృతి, రీచా ఘోష్ బ్యాట్ల‌ల్లో చిప్స్..అందుకే పాక్ ఓడిపోయింది

ఒక్క మ్యాచ్ కే సంబ‌రాలు చేసుకోకండి..ఫైన‌ల్స్ లో టీమిండియాను ఓడిస్తాం

Cooper Gifts Bike to Litton Das: కూపర్ గొప్ప మ‌న‌సు..లిట‌న్ దాస్ కు బైక్ గిఫ్ట్

Ashwin: పాకిస్తాన్ పై గెలిచినా, వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అవుతుంది !

×