Warner in RCB: ఐపీఎల్ 2025 టోర్నమెంటు మెగా వేలంలో… అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిన డేవిడ్ వార్నర్ కు ( David Warner ) అదిరిపోయే ఆఫర్ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. డేవిడ్ వార్నర్ కు ( David Warner ) రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు… బంపర్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్ లో డేవిడ్ వార్నర్ ను తమ జట్టులో ఆడించేందుకు… నిర్ణయం తీసుకుందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ). చెన్నై వదిలేసిన అజింక్య రహానేను… బేస్ ప్రైజ్ కు కేకేఆర్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Mohammed Siraj – Babar Azam: బెయిల్స్ టెక్నిక్.. సిరాజ్‌ను Copy కొట్టిన పాక్ ?
ఇక డేవిడ్ వార్నర్ విషయంలో కూడా అచ్చం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు అలాగే చేసేందుకు నిర్ణయం తీసుకుందట. మొన్న జరిగిన మెగా వేలంలో డేవిడ్ వార్నర్ను ఏ జట్టు కొనుగోలు చేయలేదు. గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు డేవిడ్ వార్నర్. హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా అలాగే ఢిల్లీకి కూడా కెప్టెన్ గా ఉన్నాడు.
రిషబ్ పంత్ కు యాక్సిడెంట్ అయిన సమయంలో… ఢిల్లీకి కెప్టెన్సీ చేసే అవకాశం డేవిడ్ వార్నర్ కు వచ్చింది. అయితే అంతటి బ్రహ్మాండమైన అవకాశం వచ్చినప్పటికీ డేవిడ్ వార్నర్ దాన్ని సద్వినియోగం చేసుకోలేదు. జట్టును గెలిపించకపోవడమే కాకుండా కెప్టెన్సీ పరంగా కూడా డేవిడ్ వార్నర్ దారుణంగా విఫలమయ్యారు. ఈ లెక్కలన్నీ గమనించిన పది ఫ్రాంచైజీలు… మొన్న జరిగిన మెగా వేలంలో డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేయలేదు.
బేస్ ప్రైజ్ కు కూడా కొనుగోలు చేసేందుకు ఏ జట్టు… ముందుకు రాలేదు. దీంతో un సోల్డ్ ప్లేయర్ లిస్టు లోకి డేవిడ్ వార్నర్ చేరిపోయారు. అయితే… మెగా వేలంలో షాక్ తిన్న డేవిడ్ వార్నర్ ప్రస్తుతం విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబానికి ఎక్కువ సమయం ఇస్తూ… రిలాక్స్ అవుతున్నాడు డేవిడ్ వార్నర్. అయితే మార్చి నెలలో ప్రారంభం కానున్న ఐపిఎల్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… డేవిడ్ వార్నర్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ( Royal Challengers Bangalore ).
ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ కు ( Josh Hazlewood ) మొన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటులో గాయం అయింది. అతని 12 కోట్లకు పైగా కొనుగోలు చేసింది ఆర్సిబి. అయితే గాయం కారణంగా ఆర్సిబికి అతను దూరం అవుతే… బేస్ ప్రైజ్ కు డేవిడ్ వార్నర్ ను కొనుగోలు చేసేందుకు సిద్ధమైందట రాయల్ చాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం. ఇక ఆఫర్కు డేవిడ్ వార్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్ వుడ్ ( Josh Hazlewood ) స్థానంలో డేవిడ్ వార్నర్ వస్తాడని ఫ్యాన్స్ కూడా అంటున్నారు.
Also Read: Virat Kohli: BGT లో కోహ్లీ చెత్త బ్యాటింగ్.. అన్ని కీపర్ క్యాచ్ లు, స్లిప్పులే ?