Virat Kohli: భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ గత కొంతకాలంగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. భారత జట్టును తన భుజస్కంధాలపై నడిపించిన కోహ్లీ ఆటతీరు ఇటీవల ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ లో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ప్రదర్శన చూస్తే అది నిజమే అనిపిస్తుంది.
Also Read: Captain’s Field Setup: కమిన్స్ ఓవరాక్షన్…10 మంది ప్లేయర్లతో అటాక్ ?
గత 17 ఇన్నింగ్స్ లలో కేవలం ఒకే ఒక్క సెంచరీ, మరో హఫ్ సెంచరీ నమోదు చేశాడు. తన బ్యాటింగ్ శైలికి సెట్ అయ్యే టెస్ట్ ఫార్మాట్ లో కోహ్లీ తడబడుతున్నాడు. ముఖ్యంగా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్ ని ఎదుర్కోలేక తడబడుతున్నాడు. చాలాకాలంగా కోహ్లీ ఈ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. దీంతో కోహ్లీ పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో సెంచరీ తో కొంత ఫామ్ లోకి వచ్చినట్లే కనిపించాడు. కానీ ఆ తర్వాత అదే జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు.
ఈ సిరీస్ లో ఇప్పటివరకు నాలుగు టెస్టులు జరగగా.. మొదటి టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఆ తర్వాత రెండవ ఇన్నింగ్స్ లో 143 బంతులలో సెంచరీ నమోదు చేసి కాస్త పరవాలేదనిపించాడు. ఇక రెండవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో (7), రెండవ టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో (11), మూడవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో (3) పరుగులు మాత్రమే చేశాడు. అయితే వర్షం కారణంగా ఈ మ్యాచ్ డ్రా గా ముగిసింది. ఇక నాలుగోవ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్ లో (36), నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ లో (5) పరుగులు మాత్రమే చేశాడు.
నాలుగోవ టెస్ట్ జరిగిన మెల్ బోర్న్ స్టేడియంలో కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కానీ ఈసారి అతడు ఆ స్థాయిలో రాణించలేకపోయాడు. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్ లో అత్యంత దారుణంగా స్టార్క్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. అయితే కోహ్లీ ఎక్కువగా ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వెంటాడి మరీ వికెట్ సమర్పించుకుంటున్నాడు.
ఈ సిరీస్ లో కోహ్లీ ఇలా నాలుగు సార్లు వికెట్ సమర్పించుకున్నాడు. అలాంటి బంతులను ఆడాల్సిన అవసరం ఏముందని మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా ఓ సందర్భంలో చివాట్లు పెట్టాడు. శరీరానికి దగ్గరగా వచ్చిన బంతులను మాత్రమే ఆడాలనే సచిన్ సలహాని కోహ్లీ పాటించాలని గుర్తు చేశాడు. ఈ సిరీస్ లో కోహ్లీ తన చెత్త బ్యాటింగ్ తో ఎక్కువసార్లు కీపర్ క్యాచ్ లు, స్లిప్ క్యాచ్ లు ఇచ్చి అవుట్ అయ్యాడని సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు నెటిజెన్లు.
Also Read: Yashasvi Jaiswal: అంపైర్లు ఛీటింగ్.. వివాదంగా మారిన జైశ్వాల్ వికెట్ !
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో కోహ్లీ ర్యాంక్ చాలా దిగజారింది. ఈ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వదిలేయాలని విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్లు సైతం సూచిస్తున్నారు. ఈ విషయంలో సచిన్ ని ఆదర్శంగా తీసుకోవాలని కోహ్లీకి ఆసిస్ మాజీ క్రికెటర్ మ్యాథ్యూ హెడెన్ కూడా సూచించాడు. ఈ విషయంలో కోహ్లీ జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నాడు.
Virat Kohli’s dismissals in the Border Gavaskar Trophy. 🏆 pic.twitter.com/lSSENhrKLb
— Johns. (@CricCrazyJohns) December 30, 2024