WI VS AUS: ప్రస్తుతం ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్ జరుగుతోంది. అయితే ఇప్పటికే రెండు టెస్టు మ్యాచ్ ల్లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించింది. తాజాగా మూడో టెస్టులో కూడా ఆస్ట్రేలియా జట్టు ఘన విజయం సాధించింది. కానీ ఈ సారి రికార్డు క్రియేట్ చేసింది. కింగ్ స్టన్ వేదిక గా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో వెస్టిండీస్ జట్టు కేవలం 27 పరుగులకే కుప్ప కూలింది. దీంతోో టెస్టుల్లో తమ దేశ క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ అయ్యారు. ఇందులో గ్రీవ్స్ 11 టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఇక ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ స్టార్క్ ఒక్కడే 6 వికెట్లు తీశాడు. కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చాడు స్టార్క్. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు బోల్యాండ్ హ్యాట్రిక్ తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 27 పరుగులు రెండో అత్యల్ప స్కోర్. అంతకు ముందు 1955లో ఇంగ్లాండ్ బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ జట్టు కేవలం 26 పరుగులకే ఆలౌట్ అయింది.
Also Read : Shreyas Iyer : ఇంగ్లాండ్ సిరీస్ నుంచి కరుణ్ నాయర్ ఔట్… స్పెషల్ ఫ్లైట్ లో శ్రేయస్ అయ్యర్ ?
బోలాండ్ హ్యాట్రిక్..
వెస్టిండీస్ 27 పరుగుల ఇన్నింగ్స్ లో ఎక్స్ ట్రా పరుగులే రెండో అత్యధిక స్కోర్. ఆస్ట్రేలియా బౌలర్లు 6 ఎక్స్ ట్రా లు ఇచ్చారు. ఎక్స్ ట్రా లు ఇవ్వకుంటే వెస్టిండీస్ కేవలం 21 పరుగుల వద్దనే కుప్పకూలేది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ నిప్పులు చెరిగే బంతులు విసిరాడు. 7.3 ఓవర్లు వేసి కేవలం 9 పరుగులు ఇచ్చి 6 వికెట్లు తీసి.. వెస్టిండీస్ ఓటమిని శాసించాడు. అతను వేసిన వాటిలో 4 ఓవర్లు మెయిడిన్ ఓవర్లు వేశాడు. అదేవిధంగా స్కాట్ బొలాండ్ 2 ఓవర్లలో 3 వికెట్లు తీశాడు. జోస్ హెజల్ వుడ్ ఒక వికెట్ తీసుకున్నాడు. బోల్యాండ్ హ్యాట్రిక్ వికెట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 225 పరుగులు చేసింది. కవాజా 14, గ్రీన్ 42, స్టీవ్ స్మిత్ 5, హెడ్ 16, వెబ్ స్టర్ 13, కమిన్స్ 5, మిచెల్ స్టార్క్ 11, బోలాండ్ 01, హజిల్ వుడ్ 04 పరుగులు చేశాడు.
స్టార్క్ బౌలింగ్ అదుర్స్..
వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్ 143 పరుగులకే ఆలౌట్ అయింది. జాన్ కాంబెల్ 36 పరుగులు.. షై హోప్ 23 రన్స్ చేసారు. ఆ తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 121 పరుగులకే కుప్ప కూలింది. గ్రీన్స్ 42 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. వెస్టిండీస్ బౌలర్లలో షమర్ జోసెఫ్ 4, అల్జారీ జోసెఫ్ 5 వికెట్లతో అదురగొట్టారు. దీంతో వెస్టిండీస్ విజయం పై ఆశలు పెట్టుకుంది. కానీ పిచ్ నుంచి మంచి స్వింగ్ లభించడంతో ఆసీస్ బౌలర్లు చెలరేగిపోయారు. ముఖ్యంగా స్టార్క్ అయితే వెస్టిండీస్ ను ఏ దశలోనూ కోలుకోనివ్వలేదు. దీంతో వెస్టిండీస్ జట్టుని కోలుకోలేని దెబ్బ తీశాడు. స్టార్క్ దెబ్బకి వెస్టీండిస్ తక్కువ స్కోర్ కే కుప్ప కూలిపోయింది.
Boland’s Hat-trick Lights Up Sabina 🔥
Scott Boland rips through West Indies with a searing hat-trick as they collapse for 27 all out — their lowest Test score ever 😧#WIvAUS pic.twitter.com/uc8iPj3dS6
— FanCode (@FanCode) July 14, 2025
🚨 MITCHELL STARC: 7.3-4-9-6 🥶🔥
– WEST INDIES BOWLED OUT FOR JUST 27 RUNS IN THE SECOND INNINGS….!!!! pic.twitter.com/Z3tFsjJalT
— Johns. (@CricCrazyJohns) July 15, 2025