Gundeninda GudiGantalu Today episode july 15th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే అని అంటుంది. వయసు పెరిగితే సరిపోదు బుద్ధి కూడా పెరగాలి. వాడి వైపు తగ్గట్లు వాడి చేశాడా అని బాలు ఇంకా రెచ్చిపోయి మాట్లాడుతాడు. నన్నే అంటున్నారని ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక కొడుకు ఇది ఒక కొడుకు అది అంటూ నువ్వు తేడాలు చూపించడం వల్లే వాళ్ల మధ్య ప్రేమలు లేకుండా పోయాయని క్లాస్ పీకుతాడు.. అందర్నీ సమానంగా చూస్తే ఇలాంటి బాధలు వచ్చేవి కాదు కదా వీళ్ళ మధ్యలో వీళ్ళకే గొడవలు జరిగేవి కాదు కదా అని సత్యం అంటాడు. ఏ రోజైనా కన్నతల్లిగా వాడి మీద ప్రేమ చూపించావా..? ఎంతసేపు వాడిని అక్కడికి రాకూడదు ఇక్కడికి రాకూడదు అని కండిషన్స్ పెడతావే.. కానీ వాడు నీ కొడుకు అన్న సంగతి నువ్వు ఎందుకు మర్చిపోయావు అని సత్యం అంటాడు.. రాత్రి మీనా బాలు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. నాన్న భోజనం చేశారా మీనా అని బాలు అడుగుతాడు.. ఏదో చేశాడంటే చేశాడండి ఇంట్లో అందరూ అరకొరగానే భోజనం చేశారని మీనా అంటుంది. మీనా శృతి తో మాట్లాడి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తుంది. అలాగే బాలు కూడా రవితో మాట్లాడతాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో ఈ గొడవలు ఎలా ఉన్నా సరే రవి నీ భర్త. ఆ విషయం గురించిన ఆలోచించు శృతి అని మీనా చెప్పి వెళ్తుంది. బాలు రవి దగ్గరికి వెళ్తాడు. రెస్టారెంట్ కి వచ్చి ఎక్కడ కొడతాడు అని రవి లోపలికి వెళ్తాడు. బాలు మాత్రం రవి వెనకాల వెళ్లి రవితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తాడు.. అయితే రవి ఫ్రెండ్ రవి ఇక్కడే ఉంటున్నాడు అన్న విషయాన్ని చెప్తాడు. నీ భార్యను తెలివిగా అక్కడ లాక్ చేశారు నువ్వు కూడా అక్కడే ఉండిపోతావు అని వాళ్ళు అనుకుంటున్నారు ఇల్లరికం అల్లుడు లాగా అక్కడే ఉంటావా నువ్వు అని బాలు రవికి క్లాస్ పీకుతాడు.
శృతికి భోజనం వచ్చిందని మేనేజర్ చెప్పడంతో బయటకు వచ్చి భోజనం తినడానికి కూర్చుంటుంది. అదేంటి నువ్వు తీసుకొచ్చావు నేను ఆర్డర్ చేసింది హోటల్ కి కదా అని శృతి రవిని చూసి అంటుంది. నువ్వు ఆర్డర్ చేసింది నాకోసమే అని నాకు తెలుసు అందుకే నేనే స్వయంగా చేసి మరి తీసుకుని వచ్చాను అని అంటాడు. హోటల్లో ఫుడ్ ఆర్డర్ చేస్తే డైరెక్ట్ గా చెఫ్ తీసుకొని వచ్చి వడ్డిస్తాడా అని వెటకారంగా మాట్లాడుతుంది.. అయితే రవి ఇలాంటి నేను వెళ్ళిపోతాను అంటాడు. ఏ వద్దు నువ్వు వస్తావని నేను ఆర్డర్ చేశాను అని శృతి.
డబ్బింగ్ అయిపోయిన తర్వాత మనం మన ఇంటికి వెళ్దాం అని శృతి తో రవి అంటాడు. ఎక్కడుంది అని రవితో అంటుంది. బాలు ఉన్న ఇంటికి నేను రాను అని శృతి అనగానే రవి మన కోసం మా అమ్మ నాన్న బాలు అన్నయ్య చాలా బాధపడుతున్నారు అని అంటాడు. ఏంటి ఆ బాలు బాధపడుతున్నాడా అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు అని శృతి అంటుంది. లేదు బాలు అన్నయ్య ఇందాక నా దగ్గరికి వచ్చి అమ్మ నాన్న బాధపడుతున్న విషయాన్ని నాకు చెప్పాడు. నా దగ్గరికి మీనా వచ్చింది. బాలు తరఫున క్షమాపణలు కోరింది. సరే చూద్దాం అని శృతి ఇద్దరికీ భోజనం వడ్డించు తిందామని అంటుంది.
భోజనానికి అందరూ వచ్చి కూర్చుంటారు మనోజ్ ఆకలేస్తుంది మీనా ఇంకా వంట చేయలేదా అని సత్యం దగ్గరికి వచ్చి అడుగుతాడు. సత్యం నువ్వు భోజనానికి తప్ప ఎందుకు పనికొస్తావురా సంపాదన అనేది నీకు ఎప్పుడు మొదలవుతుంది అని క్లాసు పీకుతాడు. మీ నాన్నగారు అడుగుతున్నారు కదా సమాధానం చెప్పు నువ్వు జాబ్ ఎప్పుడు తెచ్చుకుంటావు ఎప్పుడు సంపాదిస్తావో అని అంటుంది. ఇక మీనా అత్తయ్య గారిని భోజనానికి పిలిచాను రాలేదు అని అంటుంది.
అమ్మకి ఆకలేస్తే అమ్మే వస్తుందిలే మనం వడ్డించుకుని తిందాం పట్టు రోహిణి అని మనోజ్ అంటాడు. అందరికీ భోజనం ప్లేట్ లోకి వడ్డించిన తర్వాత ప్రభావతి వస్తుంది. భోజనానికి రమ్మని పిలిస్తే రాలేదట అని సత్యం అడుగుతాడు. అమ్మ ప్రేమ నన్ను అడ్డుపడేలా చేస్తుంది. మీరు తినండి నాతో ఏం పని అని ప్రభావతి బెట్టు చేస్తుంది. సత్యం కూడా నువ్వు తింటేనే నేను తింటాను అని లేచి వెళ్ళిపోతాడు. బాలు కూడా నాన్న తింటే నేను తింటాను అని అంటాడు. ప్రభావతిని ఎంతగా నచ్చచెప్పినా సరే భోజనం చేయడానికి అస్సలు ఒప్పుకోదు.
మనసు మరోసారి వచ్చి భోజనం చేద్దాం అమ్మ మాకు ఆకలేస్తుంది అని ఎంత చెప్పినా కూడా ప్రభావతి లేవదు. బాలు బిర్యాని తీసుకొని వచ్చి అందరిని తినమని అంటాడు. ప్రభావతి మాత్రం రవి లేకుండా నేను అసలు తినను అని అంటుంది. అయితే బాలు మీకు ఒక నిజం చెప్పాలి ఇది అమ్మానాన్న తినలేదంటే రవిని స్వయంగా వంట వండి తీసుకొని వచ్చాడు. మిగతా హోటల్ ఎవరైనా బకెట్లో పెట్టిస్తారా వాడు కాబట్టి చేసి పంపించాడు అని అంటాడు. మాట వినగానే ప్రభావతి రవి పంపించాడా వాడే తీసుకురావచ్చు కదా అని అంటుంది. వాళ్ళ ఆవిడని తీసుకొని వస్తాడట నేను వెళ్లి మాట్లాడాను అని అంటాడు. అందరూ కలిసి బిర్యానిని ఓ పట్టు పడతారు.
Also Read:అక్షయ్ కోసం అవని త్యాగం.. భానుమతితో కమల్ సరసాలు.. పల్లవి అనుమానమే నిజం..?
బిర్యానీ చాలా బాగుంది రవి గాడి చేతిలో ఏదో మ్యాజిక్ ఉంది అని ప్రభావతి బిర్యానిని ఎప్పుడు తిననట్లు తినేస్తుంది. మనోజ్ కూడా బిర్యానీ చాలా బాగుంది అంటూ లొట్టలు వేసుకుంటూ తినేస్తాడు. మీనా నువ్వు కూడా తిను అనేసి అంటుంది ప్రభావతి. భోజనం చేసిన తర్వాత రోహిణి దగ్గరికి వెళ్లి మీ నాన్న ఎక్కడ అని అడుగుతుంది. రోహిణిని నాలుగు చెరువుల నీళ్లు తాగిస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో రోహిణి మరో నాటకం మొదలు పెడుతుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..