Shreyas Iyer : భారత్-ఇంగ్లాండ్ మధ్య 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇవాళ మూడో టెస్టు ముగిసిపోయింది. ఇక రెండు టెస్టు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. తొలి టెస్టుల్లో ఇంగ్లాండ్, రెండో టెస్టులో ఇండియా విజయం సాధించాయి. మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది. అయినప్పటికీ టీమిండియా బ్యాటర్ కరణ్ నాయర్(Karun Nayar) బ్యాటింగ్ లో తన ఆటను ఆడలేకపోతున్నాడు. గతంలో త్రిబుల్ సెంచరీ చేసిన ఈ ఆటగాడు బ్యాటింగ్ లో విఫలం చెందుతున్నాడు. కెప్టెన్ శుబ్ మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, జడేజా అద్భుతంగా రాణిస్తున్నారు. అడపదడపా జైస్వాల్ కూడా సెంచరీలు చేస్తున్నాడు. కానీ ఎక్కువ మ్యాచ్ ల్లో తక్కువ స్కోర్ కే ఔట్ అవుతున్నాడు జైస్వాల్.
Also Read : Siraj – Gill : ICC భారీ తప్పిదం.. సిరాజ్ కు అన్యాయం… గిల్ చేసింది తప్పు కాదా.. కండ్లు మూసుకుపోయాయా !
విఫలం చెందిన కరుణ్ నాయర్..
కరుణ్ నాయర్ అంతగా ఫామ్ లో లేడు. ఏదో మ్యాచ్ లో తన ప్రతిభ చూపిస్తాడంటే ఏ మ్యాచ్ లో ఆశించిన మేర రాణించడం లేదు. దీంతో కరుణ్ నాయర్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ ని తీసుకుంటే బాగుంటుందని క్రికెట్ అభిమానులు సూచిస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ (England) సిరీస్ నుంచి కరుణ్ నాయర్ ఇంటికి వెళ్తాడని.. అతని స్థానంలో స్పెషల్ ఫ్లైట్ లో శ్రేయస్ అయ్యర్ నాలుగో టెస్టు కి రానున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కొందరూ అయితే అస్సలు శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer) ని ఈ టెస్ట్ సిరీస్ కి ఎందుకు ఎంపిక చేయలేదని మండిపడుతున్నారు. కరుణ్ నాయర్ నుంచి ఇండియా కి పంపించి శ్రేయస్ అయ్యర్ కి అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక నాలుగో టెస్టు కి శ్రేయస్ అయ్యర్ వస్తాడని.. బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కరుణ్ నాయర్ బ్యాటింగ్ లో దారుణంగా విఫలం చెందడంతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
శ్రేయాస్ వచ్చేనా..?
ఇక శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇటీవల ఐపీఎల్ (IPL) లో పలు కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అతని కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ కి చేర్చాడు. ఫైనల్ లో 06 రన్స్ తేడాతో ఆర్సీబీ పై ఓటమి చెందింది. లేదంటే పంజాబ్ ఈ సీజన్ విజయం సాధించేదే. శ్రేయస్ అయ్యర్ కరుణ్ నాయర్ స్థానంలో మాత్రం రానట్టే తెలుస్తోంది. వస్తున్నాడని సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేయడం విశేషం. ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ లో భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ గడ్డ పై టెస్టుల్లో వరుసగా 4 హాఫ్ సెంచరీలు చేసిన మూడో భారత క్రికెటర్ గా నిలిచాడు. తాజాగా టెస్టులో 2వ ఇన్నింగ్స్ లోనూ హాఫ్ సెంచరీ చేశాడు. అయితే రిషబ్ పంత్ టాప్ లో ఉన్నాడు. 5 హాప్ సెంచరీలు చేసి.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ 4 హాఫ్ సెంచరీలు చేసి 2వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ మ్యాచ్ లో టాప్ ఆర్డర్ బ్యాటర్లు అంతా చేతులెత్తేయడంతో జడేజా ఒంటరి పోరు చేస్తున్నాడు. ఇకఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడో టెస్ట్ లో అనూహ్యంగా ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించింది.
BCCI , In Place of Karun Nair give a chance to Shreyas Iyer
🙏#INDvsENG pic.twitter.com/RIhU7z7sf0— Ankit Sharma (@AnkitsharmaINC) July 13, 2025