BigTV English

Vinesh Phogat: 100 గ్రాముల బరువు వెనుక ఏం జరిగింది?

Vinesh Phogat: 100 గ్రాముల బరువు వెనుక ఏం జరిగింది?

What Happened behind the Vinesh Phogat Weight of 100 Grams: వినేశ్ ఫోగట్.. భారత రెజ్లర్.. ఒలింపిక్స్ లో భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించి, ఒక్క క్షణంలో పతనావస్థలోకి జారిపోయింది. ఆ 100 గ్రాముల బరువు ఎందుకు తగ్గించుకోలేకపోయింది.? అనేది ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చగా మారింది. అయితే పొరపాటు మన దగ్గరే జరిగిందా? ఆ 100 గ్రాముల బరువు పెరగడం వెనుక ఏం జరిగిందంటే.


సెమీఫైనల్‌కు ముందు తను 49.9 కేజీలు మాత్రమే  ఉంది. అయితే మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో 300 గ్రాముల సమానమైన జ్యూస్ తాగిందంట. చివరికి అదే కొంప ముంచిందని అంటున్నారు. బరువు చూసుకుంటూ తాగినా బాగుండేది. అప్పుడు వెయిట్ చూసుకుని 100 గ్రామలు లేదా 150 గ్రాములు తాగితే సరిపోయేది.

కుస్తీ పోటీలు కదా.. తీవ్రమైన భావోద్వేగాలుంటాయి. అలసి పోకూడదు, పట్టు సడలిపోకూడదు. అందుకు మరింత శక్తి కావాలి. అందుకోసమే తీసుకుంది. కాకపోతే అక్కడే ఉన్న కోచ్ లు, సహాయ సిబ్బంది ఇవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. ఇందులో అందరి తప్పులున్నాయని అంటున్నారు.


ఒకే రోజు మూడు మ్యాచ్ లు ఉండటంతో ఎనర్జీ కోసం ముందు రోజు తీసుకున్న ఫ్లూయిడ్స్, పళ్ల రసం, స్నాక్స్ వల్ల తన బరువు 52.7 కేజీలకు చేరింది. తర్వాత ఫైనల్ మ్యాచ్ కి ముందు బరువు తగ్గించుకోవడానికి నానా పాట్లు పడింది. కోచ్‌లు కూడా తీవ్రంగా శ్రమించారు. ఒక్క చుక్క నీటిని తీసుకోకుండా ట్రెడ్‌మిల్‌పై దాదాపు 6 గంటలపాటు కఠినంగా శ్రమించినా.. సోనా బాత్ మూడు గంటలు చేసినా.. ఫలితం లేకపోయింది.

చివరకు దుస్తులకు ఉన్న ఎలాస్టిక్‌తో పాటు జుట్టును కూడా తీసేసినా.. అదనంగా 100 గ్రాములు ఉండటంతో ఇంతవరకు ఆడిన ఆటంతా పోయి డిస్ క్వాలిఫై అయ్యింది. ఇది అందరికి ఒక గుణపాఠమని అంటున్నారు.

Also Read: వినేశ్ ఫోగట్.. హార్ట్ బ్రేకింగ్ పోస్ట్

నిజానికి తను 53 కేజీల విభాగంలో ఉండేది. అలా ఉంటే తన ఆరోగ్యానికి ఇబ్బంది ఉండేది కాదు. తన డైట్ ఎంత తీసుకున్నా కంట్రోల్ ఉండేది. తన శరీరం హెచ్చు తగ్గుల్లేకుండా సహజంగా ఉండేది. ఇప్పుడు 50 కేజీల విభాగంలోకి రావడంతో ఆ శరీరం ఒక్కసారిగా  సహజత్వాన్ని కోల్పోలేక, ఆ బరువును మెయింటైన్ చేయలేక సతమతమైంది.

చివరికి ప్రతిష్టాత్మకమైన పతకం దూరమై పోయింది. ఫైనల్ మ్యాచ్ కి ఎక్కువ సమయం లేకపోవడం కూడా వినేశ్ కి నష్టం కలిగించిందని అంటున్నారు. ఏదేమైనా కర్ణుడి చావుకి కారణాలనేకం అన్నట్టు వినేశ్ ఫోగట్ దురదృష్టానికి అన్నే కారణాలున్నాయి.

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×