BigTV English

Saif Ali Khan: దేవర ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. సాయంత్రం 4 గంటలకు రెడీగా ఉండండి..

Saif Ali Khan: దేవర ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. సాయంత్రం 4 గంటలకు రెడీగా ఉండండి..

Saif Ali Khan Devara Movie Glimps(today’s entertainment news): టాలీవుడ్‌లో అత్యంత హైప్‌తో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా ‘దేవర’. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఇదే కావడంతో అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. దీంతో ఎన్టీఆర్ నటనను చూసేందుకు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులే కాదు.. యావత్ ప్రపంచ సినీ ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ యాక్టింగ్‌కి ఫిదా అయిన వారు ఇప్పుడు దేవర కోసం ఆతృతగా చూస్తున్నారు.


దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు. రెండు పార్టులుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందులో మొదటి పార్ట్‌ను సెప్టెంబర్ 27న రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే తెలిపారు. అందువల్లనే త్వరగా షూటింగ్ పూర్తి చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెంచేశాయి. ముఖ్యంగా గ్లింప్స్‌లో ఎన్టీఆర్ మాస్ యాక్షన్ సీన్లు అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.

Also Read: చుట్టమల్లే సాంగ్‌పై దేవర ప్రొడ్యూసర్ షాకింగ్ కామెంట్స్


ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్‌ను ఇప్పటి వరకు స్క్రీన్ పై చూసింది లేదు. అందువల్లనే దేవర నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయడంతో అందులో ఎన్టీఆర్ లుక్‌ చూసి అభిమానులు పరవసించిపోయారు. దీంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఆ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ ఊచకోతతో సినిమా ఎలా ఉంటుందో అందరికీ అర్థం అయిపోయింది. ఇక ఈ గ్లింప్స్ రెస్పాన్స్‌తో ఓ రేంజ్‌కు వెళ్లిన దేవర.. ఆ తర్వాత రిలీజ్ చేసిన సాంగ్స్‌తో మరింత బజ్ క్రియేట్ చేసుకుంది. మొదటిగా రిలీజ్ అయిన దేవర ఫియర్ సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. ఆ తర్వాత ఇటీవల రిలీజ్ అయిన రెండో సింగిల్ కూడా భారీ వ్యూస్, లైక్స్‌తో దుమ్ము దులిపేసింది.

ఈ సాంగ్‌లో ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ లుక్స్ సినీ ప్రియుల్ని కట్టిపడేశాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీంతో సినిమాపై హైప్ మరింత పెరిగింది. అయితే ఇవాళ సైఫ్ అలీ ఖాన్ బర్త్ డే కావడంతో దేవర మూవీ మేకర్స్ సర్‌ప్రైజ్ రెడీ చేశారు. సాయంత్రం 4.05 గంటలకు సైఫ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×