Nithish Kumar Reddy : టీమిండియా యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ఆడిన విషయం తెలిసిందే. గాయం కారణంగా అతను కొన్ని మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఆ తరువాత లీగల్ చిక్కుల్లో పడ్డాడు. తన పాత స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ ఏజెన్సీ స్క్వేర్ ది వనన్ నుంచి రూ.5కోట్ల బకాయిలు చెల్లించలేదని అతనికీ లీగల్ నోటీస్ అందింది. ఈ వివాదం నితీశ్ రెడ్డి 2021 నుంచి 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరకు తనను ప్రాతినిధ్యం వహించిన ఏజెన్సీతో సంబంధాలు తెంచుకోవాలని హఠాత్తుగా నిర్ణయించుకోవడం నుంచి మొదలైంది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో వార్త నితీశ్ రెడ్డి గురించి వైరల్ అవుతోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నితీశ్ కుమార్ రెడ్డి కొత్త టాటూలు వేసుకున్నాడు.
Also Read : Rashid Khan : సరికొత్త షాట్ కనిపెట్టిన రషీద్ ఖాన్… చరిత్రలో నిలిచి పోవడం గ్యారెంటీ
నితీశ్ టాటూ.. సోషల్ మీడియాలో వైరల్
నితీశ్ కుమార్ రెడ్డి కొత్త టాటూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆగస్టు 09న మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా అతను మూవీ రీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో నితీశ్ కుమార్ రెడ్డి మహేష్ బాబు అభిమాని అని.. అందుకే ఈ టాటూ లు వేయించుకొని అతడు సినిమా వీక్షించినట్టు సమాచారం. మరోవైపు తన అభిమాన నటుడి కోసం త్యాగం చేసాడని రకరకాల కామెంట్స్ వినిపించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఇటీవలే ఇంగ్లాండ్ తో జరిగిన 5 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ముగిసింది. ఈ సిరీస్ కొనసాగుతున్న సమయంలోనే నితీశ్ రెడ్డి మూడో టెస్ట్ తరువాత గాయపడ్డాడు. నాలుగో టెస్టు ముందు జిమ్ లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో అతని మోకాలు కి గాయం అయింది. ఈ గాయం కారణంగా అతను సిరీస్ లోని నాలుగో టెస్ట్ మ్యాచ్ కి దూరం అయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం ఈ గాయం చిన్నది కాదని.. నిర్ధారించడంతో చికిత్స అవసరం అయింది. నితీశ్ కుమార్ రెడ్డి జిమ్ లో డ్యూయట్ శిక్షణలో పాల్గొంటున్న సమయంలో తన మోకాలుకు గాయం అయింది.
నితీశ్ కి సర్జరీ అవసరం
మెరుగైన వైద్యం కోసం వైద్య నిపుణులు ఆయనకు సర్జరీ అవసరం అని సూచించారు. ఇది జట్టు యాజమాన్యానికి పెద్ద దెబ్బగా మారింది. ఈ తరుణంలోనే అతను ఆసుపత్రిలో చేరాడు. మరోవైపు గాయం తరువాత నీతిశ్ కుమార్ రెడ్డి ఫిజియోథెరపీ చికిత్స తీసుకుంటున్న ఫొటోను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. “speed Recovery” అనే క్యాప్షన్ తో ఆయన చిత్రాన్ని షేర్ చేశారు. ఈ ఫోటో ఆ సమయంలో వైరల్ గా మారింది. ఇక నితీశ్ కుమార్ రెడ్డి పోస్ట్ చూసిన అభిమానులు పెద్ద ఎత్తున త్వరగా కోలుకోవాలి అంటూ కామెంట్స్ చేశారు. ఇక మోకాలు గాయంలతో నితీశ్ కుమార్ రెడ్డి ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ కి దూరమయ్యాడు. ఆ తరువాత కూడా అతను పూర్తిగా కోలుకోవడంతో ఈ సిరీస్ లో చివరి టెస్టులో కూడా ఆడలేదు. యంగ్ ప్లేయర్ నితీశ్ కుమార్ రెడ్డి త్వరలోనే కోలుకుని.. తిరిగి జట్టులోకి బలంగా వస్తారని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ ను భారత్ 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే.