BigTV English

Sarfaraz Khan:- ఖాన్ దాదా.. ఎవరికీ కనిపించడా?

Sarfaraz Khan:- ఖాన్ దాదా.. ఎవరికీ కనిపించడా?

Sarfaraz Khan :-ఫస్ల్‌క్లాస్‌ క్రికెట్లో సగటున 80 శాతం పరుగులు… గత 23 రంజీ ఇన్నింగ్స్‌ల్లో 10 సెంచరీలు… చివరి 5 ఇన్నింగ్స్‌ల్లోనూ 3 సెంచరీలు… ఇవన్నీ సాధించింది ఒకే ఒక్కడు. అతనే సర్ఫ్‌రాజ్‌ ఖాన్‌. డాన్‌ బ్రాడ్‌మన్‌ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రికార్డులు ఉన్న సర్ఫ్‌రాజ్‌… మరో దేశంలో అయితే ఈ పాటికే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి ఉండేవాడు. కానీ… దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేస్తున్నా… సర్ఫ్‌రాజ్‌ఖాన్‌ను సెలక్టర్లు కరుణించట్లేదు. త్వరలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్‌-గవాస్కర్‌ టెస్టు సిరీస్‌కూ అతణ్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.


25 ఏళ్ల ముంబయి బ్యాటర్‌ సర్ఫ్‌రాజ్‌ఖాన్‌… ఢిల్లీతో రంజీ మ్యాచ్‌లో తొలిరోజు సెంచరీ చేశాడు. శతకం బాదేశాక… చూశారా నా సత్తా అన్నట్లు అతను కసిగా చేసుకున్న సంబరాల వీడియో… ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సర్ఫ్‌రాజ్‌ 2021-22 రంజీ సీజన్లో ఏకంగా 122.75 సగటుతో 982 పరుగులు సాధించి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుత రంజీ సీజన్లో 107 సగటు, 70కి పైగా స్ట్రెక్‌రేట్‌తో ఇప్పటిదాకా 431 పరుగులు చేశాడు. సెంచరీల మీద సెంచరీలు బాదుతున్నా… సర్ఫ్‌రాజ్‌ఖాన్‌కు సెలెక్టర్లు ఎందుకు అవకాశం ఇవ్వడం లేదని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇంకెన్నాళ్లు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూడాలని ప్రశ్నిస్తున్నారు. కొందరు మాజీ ఆటగాళ్లు కూడా సర్ఫ్‌రాజ్‌కు అండగా నిలుస్తున్నారు.

భారత టెస్టు జట్టులో సర్ఫ్‌రాజ్‌ఖాన్‌కు స్థానం దొరకడం అంత ఈజీ కాదు. సీనియర్లు, కుర్రాళ్లతో ఇప్పటికే టెస్టు జట్టు కిటకిటలాడుతోంది. దీనికి తోడు మిడిలార్డర్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌కు చోటు దక్కడంతో… సర్ఫ్‌రాజ్‌కు అవకాశం లేకుండా పోయింది. ఫిట్‌నెస్‌ కూడా సర్ఫ్‌రాజ్‌కు ప్రతిబంధకంగా మారింది. అధిక బరువుతో ఉన్న అతను… మిగతా క్రికెటర్లతో పోలిస్తే ఫిట్‌నెస్‌లో వెనుకబడుతున్నాడు. ఇకపై అయినా జట్టులో స్థానంపై దక్కాలంటే… ఇదే ఫామ్‌ కొనసాగించడంతో పాటు బరువు తగ్గి ఫిట్‌గా మారడం కూడా సర్ఫ్‌రాజ్‌కు తప్పనిసరి అని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు సర్ఫ్‌రాజ్‌ ఫిట్‌గా మారాకైనా జాతీయ జట్టులో చోటు దక్కుతుందో లేదో చూడాలి.


Follow this link for more updates:-Bigtv

Related News

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Big Stories

×