BigTV English

Rudrastra Train: ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టిన ‘రుద్రాస్త్ర’, పొడవు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Rudrastra Train: ఇండియన్ రైల్వేలోకి అడుగు పెట్టిన ‘రుద్రాస్త్ర’, పొడవు ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే!

India Longest Train: భారతీయ రైల్వేలోకి మరో అద్భుతమైన రైలు ఎంట్రీ ఇచ్చింది. దేశంలో అతిపెద్ద అతిపెద్ద గూడ్స్ రైలు తన సేవలను ప్రారంభించింది. 7 ఇంజన్లు.. 354 వ్యాగన్లతో దేశ చరిత్రలోనే అత్యంత పొడవైన గూడ్స్‌ రైలుగా గుర్తింపు తెచ్చుకుంది. ‘రుద్రాస్త్ర’ అని పేరు పెట్టిన ఈ ఈ రైలును తూర్పు మధ్య రైల్వే పరిధిలోని గ్రాండ్‌ కోర్డ్‌ రైల్‌ సెక్షన్‌ లో సేవలు అందించనుంది. ఈ రైలు ఏకంగా 4.5 కిలో మీటర్ల పొడవు ఉంటుంది. ఈ రైలుకు ముందు ఒక లోకో మోటివ్, మధ్య మధ్యలో మరో ఆరు ఇంజన్లు ఏర్పాటు చేశారు.


5 గంటల్లో 200 కిలో మీటర్లు ప్రయాణం

ఈ రైలు ఉత్తరప్రదేశ్‌ లోని గంజ్‌ కవాజా రైల్వే స్టేషన్‌ నుంచి జార్ఖండ్‌ లోని గర్హ్వా రోడ్‌ స్టేషన్‌ మధ్య ఈ రైలు తొలిసారి పరుగులు తీసింది. గంటకు సగటున 40 కిలో మీటర్ల వేగంతో 200 కిలో మీటర్ల దూరాన్ని 5 గంటల్లో పూర్తి చేసింది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. “రుద్రాస్త్ర.. అతి పొడవైన భారతీయ గూడ్స్‌ రైలు” అని క్యాప్షన్ పెట్టారు.


‘రుద్రాస్త్ర’ రైలు ప్రత్యేకతలు

రుద్రాస్త్ర గూడ్స్‌ రైలు సరుకు రవాణాలో వేగంతో పాటు మరింత సామర్థ్యాన్ని పెంచుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇందులోని ఆరు ర్యాక్‌ లను వేర్వేరుగా నడపడం వలన వాటన్నింటికీ వేర్వేరు మార్గాలు, సిబ్బందిని, షెడ్యూల్‌ ను ఏర్పాటు చేయాల్సి ఉంటుందన్నారు. ఆ ఆరు ర్యాక్ లను కలిపి నడపడం వలన సమయం ఆదా అవుతుందని, సిబ్బంది అవసరం, నిర్వహణ వ్యయం తగ్గుతుందన్నారు. భారతీయ రవాణా రంగానికి రుద్రాస్త్ర ఎంతో మేలు కలిగిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Read Also:  పండుగ వేళ రైల్వే బంపర్‌ ఆఫర్‌, వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి!

సూపర్ వాసుకి రికార్డు బ్రేక్!

భారతీయ రైల్వేలో ఇప్పటి వరకు ‘సూపర్ వాసుకి’ దేశంలోనే అతి పొడవైన గూడ్స్ రైలు గా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో ఏకంగా 295 వ్యాగన్లు ఉన్నాయి. పొడవు 3.5 కిలో మీటర్లు ఉంటుంది. ఈ రైలుకు ఏకంగా 6 ఇంజిన్లు ఉంటాయి. ఈ రైలు వెళ్తుంటే వ్యాగన్లను లెక్కబెడితే కళ్లు తిరిగి పడిపోవడం ఖాయం.  గూడ్స్ రవాణాకు వినియోగించే ఈ రైలు రైల్వే క్రాసింగ్ దాటాలంటే చాలా సమయం పడుతుంది. ఈ రైలు ఎక్కువగా చత్తీస్ గఢ్ లోని కోర్బా నుంచి మహారాష్ట్రలోని రాజ్‌ నంద్‌ గావ్‌ నడుమ బొగ్గును రవాణా చేస్తుంది. ఇప్పుడు ఆ రైలు రికార్డును రుద్రాస్త్ర బ్రూక్ చేసింది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా అతి పొడవైన గూడ్స్ రైలు ఆస్ట్రేలియాలో ఉంది. బీహెచ్‌పీ కంపెనీకి చెందిన ఈ రైలు ఏకంగా 7.3 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అందులో 682 వ్యాగన్లు ఉంటాయి. ఆ రైలు తర్వాత అత్యంత పొడవైన రైలు ఇండియాలోనే ఉండడం విశేషం.

Read Also:  పండుగ వేళ రైల్వే బంపర్‌ ఆఫర్‌, వెంటనే టికెట్లు బుక్ చేసుకోండి!

Related News

Air India Express: స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్.. ప్రయాణికులకు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ బంపరాఫర్

IRCTC offer: IRCTC ప్యాకేజ్.. కేవలం రూ.1980కే టూర్.. ముందు టికెట్ బుక్ చేసేయండి!

Flight Travel: ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడే టూరిస్ట్ ప్లేసెస్ ఇవే, ఇంతకీ అవి ఎక్కడున్నాయంటే?

Travel Insurance: జస్ట్ 45 పైసలకే ట్రావెల్ ఇన్సూరెన్స్, 5 ఏళ్లలో ఎన్ని కోట్లు క్లెయిమ్ అయ్యిందంటే?

Zipline thrill ride: మీకు గాలిలో తేలాలని ఉందా? అయితే ఈ ప్లేస్ కు తప్పక వెళ్లండి!

Romantic Road Trip: సౌత్ లో మోస్ట్ రొమాంటిక్ రోడ్ ట్రిప్, ఒక్కసారైనా ట్రై చేయాల్సిందే!

Big Stories

×