Darren Sammy Warns Team India: టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ ఎల్లుండి నుంచే ప్రారంభం కానుంది. ఇలాంటి తరుణంలో టీమిండియాకు వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సమీ (Daren Sammy ) వార్నింగ్ బెల్స్ పంపారు. 24 ఏళ్ల తర్వాత సిరీస్ దక్కించుకుంటామని…టీమిండియా పీడ కల మిగుల్చుతామంటూ సవాల్ విసిరారు. 24 ఏళ్ల కింద భారత్ వేదికగా సిరీస్ గెలిచామని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయం కోసం పోరాడుతూనే ఉన్నామన్నారు. కానీ ఈ సారి మాత్రం కథ మరోలా ఉంటుందని హెచ్చరించారు. వరల్డ్ నెంబర్ 1 గా కొనసాగుతున్న టీమిండియాను నెల మట్టం చేసి, వెళతామని సవాల్ విసిరారు. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కంటే ముందే టీమిండియా భరతం పడతామని సినిమా రేంజ్ లో డారెన్ సమీ డైలాగులు వదిలారు. గతంలో కంటే వెస్టిండీస్ టీమ్, చాలా బలంగా ఉందని తెలిపారు. ఐపీఎల్ లోనూ విండీస్ ప్లేయర్లు దుమ్ములేపారని గుర్తు చేశారు. అందుకే ఈ సారి సిరీస్ గెలుస్తామన్నారు. ఈ క్రమంలో డారెన్ సమీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి.
భారత పర్యటనకు 2002లో వచ్చిన వెస్టిండీస్ చాలా బలంగా ఉండేది. ఈ క్రమంలో టీమిండియాతో జరిగిన వన్డే సిరీస్ కైవసం చేసుకుంది విండీస్. ఆ సమయంలో వెస్టిండీస్ జట్టుకు కెప్టెన్ గా కార్ల్ హూపర్ ఉండగా, టీమిండియా సారధిగా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అయితే, ఈ రెండు జట్ల మధ్య మొత్తం 7 వన్డేలు జరుగగా, 4-3 తేడాతో టీమిండియాను విండీస్ చిత్తు చేసింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సిరీస్ కూడా టీమిండియా విండీస్ గెలవలేదు.
టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య సిరీస్ ఎల్లుండి నుంచే ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 27వ తేదీన మూడు వన్డేల సిరీస్ షురూ కానుంది. తొలి వన్డే తిర్వనంతపురం వేదికగా జరుగనుండగా, రెండో మ్యాచ్ గౌహతి వేదికగా సెప్టెంబర్ 30న ఉంటుంది. అక్టోబర్ 3వ తేదీన న్యూ ఛండీఘర్ వేదికగా చివరి మ్యాచ్ జరుగుంది. ఈ వన్డే సిరీస్ నేపథ్యంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ బరిలోకి దిగనున్నారు. శుభమాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. అక్టోబర్ 6వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ మధ్య 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ షురూ కానుంది. దీనికి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ ఉండనున్నాడు. ఈ తరుణంలోనే విండీస్ కోచ్ డారెన్ సమీ (Daren Sammy ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.