E-Paper
Advertisement

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. ఎవరికి, ఎంతకి దక్కిందంటే?

బాలాపూర్ లడ్డూకు రికార్డు ధర.. ఎవరికి, ఎంతకి దక్కిందంటే?
Advertisement

Balapur Laddu Auction: హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశుడి లడ్డు మరోమారు రికార్డు ధర దక్కించుకొని అందరి దృష్టిని ఆకర్షించింది. వనస్థలిపురంలోని సాహెబ్ నగర్ కు చెందిన సామ ప్రణీత్ రెడ్డి రూ.39 లక్షలకు వేలంలో ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డు వేలంలో మెుత్తం 8 మంది పాల్గొనగా.. ఆసాంతం ఎవరికి దక్కుతుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది. చివరికి సామ ప్రణీత్ రెడ్డి అధిక ధరకు లడ్డూను పాడుకొని సొంతం చేసుకున్నారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.35 లక్షలు పలకింది. దీంతో ఇప్పటివరకూ వేలంలో బాలాపూర్ లడ్డూకు లభించిన అధిక ధర ఇదే కావడం విశేషం.

ఇదిలా ఉంటే బాలాపూర్ గణేశ్ లడ్డూకు ఎంతో విశిష్టత ఉంది. 9 రోజులు స్వామివారితో పాటు విశేష పూజలు అందుకున్న ఈ 21 కేజీల లడ్డూను పొందడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. సుఖ సంతోషాలతో పాటు ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతుంటారు. ఈ నేపథ్యంలో బాలాపూర్ గణనాథుడి లడ్డూకు ఎప్పుడు వేలం నిర్వహించిన రికార్డు స్థాయిలో ధర లభిస్తుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా గత రికార్డులను చెరిపిస్తూ సామ ప్రణీత్ రెడ్డి ఈ లడ్డూను దక్కించుకున్నారు.

Advertisement

బాలాపూర్ లడ్డూ హిస్టరీలోకి వెళ్తే.. దీనికి 45 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. 1994లో తొలిసారి బాలాపూర్ ఉత్సవ సమితి లడ్డూకు వేలం పాట నిర్వహించగా.. అప్పట్లో రూ.450కు కొలను మోహన్ రెడ్డి అనే రైతు దక్కించుకున్నారు. అయితే తొలి 15 ఏళ్ల పాటు స్థానికులకు మాత్రమే లడ్డూ వేలంలో అవకాశం కల్పించారు. అయితే ఈ లడ్డూ విశిష్టత ఆ నోట ఈ నోట పాకడంతో స్థానికేతరులు సైతం దీనిపై ఆసక్తి కనబరిచారు. దీంతో 15 ఏళ్ల తర్వాత స్థానికేతరులకు లడ్డూ వేలంలో అవకాశం కల్పించారు. అప్పటి నుంచి ప్రతీ ఏటా రికార్డు ధరను బాలాపూర్ లడ్డూ దక్కించుకుంటూ వస్తోంది.

Advertisement

Also Read: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర.. తరలివచ్చిన భక్త జనం!

Tags

Related News

అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర.. తరలివచ్చిన భక్త జనం!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనాలకు భారీ ఏర్పాట్లు.. 28 వేల మంది పోలీసులతో బందోబస్తు!

ఖైరతాబాద్ ఉపఎన్నిక.. రంగంలోకి కాంగ్రెస్ అధిష్టానం.. దానం ప్రభావంపై ఆరా!

ఖైరతాబాద్‌పై గులాబీ గురి.. కేటీఆర్‌కు మరో కీలక సవాల్‌.. ఈసారైనా కలిసివచ్చేనా?

దానం అవుట్.. నెక్స్ట్ టార్గెట్ ఎవరు? ఫిరాయింపు ఎమ్మెల్యేల్లో ఒకటే టెన్షన్!

తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలి: భట్టి విక్రమార్క

రోడ్డు భద్రతకు రేవంత్ సర్కార్ మాస్టర్ ప్లాన్.. టీజీ-మార్స్ ఏర్పాటు!

Big Stories

Advertisement
×