E-Paper
Advertisement

క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?

క్రెడిట్ కార్డ్ హోల్డర్ చనిపోతే ఆ అప్పు ఎవరు కట్టాలి? బ్యాంకులకు ఉండే రూల్స్ ఇవే?
Advertisement

Credit card: ప్రస్తుత కాలంలో క్రెడిట్ కార్డుల వాడకం విపరీతంగా పెరిగిపోయింది. అయితే.. ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ అకస్మాత్తుగా మరణిస్తే.. వారి పేరు మీద ఉన్న లోన్లను ఎవరు చెల్లించాలనే దానిపై చాలా మందిలో తీవ్రమైన ఆందోళన ఉంటుంది. ఈ విషయంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకుల నిబంధనలు స్పష్టమైన మార్గదర్శకాలను ఇస్తున్నాయి. ఇంతకీ చనిపోయిన వ్యక్తి క్రెడిట్ కార్డ్ అప్పులకు కుటుంబ సభ్యులు ఎప్పుడు బాధ్యులవుతారు? చట్టం ఏం చెబుతుందో ఇప్పుడు  తెలుసుకుందాం.

1. కుటుంబ సభ్యులు:

చట్టాల ప్రకారం.. ఏ వ్యక్తి అయినా చనిపోతే.. వారి క్రెడిట్ కార్డ్ అప్పులు లేదా బిల్లులను చెల్లించడానికి వారి భార్య, పిల్లలు లేదా తల్లిదండ్రులు ఎలాంటి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అంటే బ్యాంకులు కుటుంబ సభ్యుల సొంత ఆస్తులను లేదా వారి పర్సలన్ అకౌంట్ నుంచి ఆ అప్పులను కట్టాలని బలవంతం చేయడానికి వీలుపడదు. క్రెడిట్ కార్డ్ అనేది అన్‌సెక్యూర్డ్ లోన్ కింద వస్తుంది కాబట్టి, కార్డ్ హోల్డర్‌తోనే ఆ బాధ్యత ముగిసిపోతుంది.

2. ఆస్తుల వారసులు:

Advertisement

మరణించిన వ్యక్తికి స్వంత ఆస్తులు (ఇళ్లు, స్థలాలు, బ్యాంకు బ్యాలెన్స్ మొదలైనవి) ఉండి, వాటిని ఎవరైనా వారసులుగా ఉన్నట్లయితే, ఆ అప్పులను ఆ ఆస్తుల విలువ వరకు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఒక వేళ మరణించిన వ్యక్తికి ఎలాంటి ఆస్తులు లేక పోతే.. బ్యాంకులు ఆ అప్పులను ‘రైట్ ఆఫ్’అనగా నష్టంగా పరిగణించి రద్దు చేయాల్సిందే.

3. జాయింట్ కార్డ్ హోల్డర్ :

ఒకవేళ క్రెడిట్ కార్డ్ ప్రైమరీ హోల్డర్‌తో పాటు మరొకరు జాయింట్ హోల్డర్‌గా లేదా.. కో-అప్లికెంట్‌గా ఉండి ఉంటే మాత్రం నిబంధనలు మారతాయి. ప్రైమరీ హోల్డర్ మరణించిన తర్వాత.. ఆ కార్డుపై ఉన్న బాధ్యత పూర్తిగా ఆ జాయింట్ హోల్డర్‌పైకి మారుతుంది. ఆ బకాయిలను వారే చెల్లించాల్సి ఉంటుంది. అందుకే.. జాయింట్ అకౌంట్లు లేదా యాడ్-ఆన్ కార్డ్స్ వాడేటప్పుడు ఈ విషయం గుర్తుంచుకోవాలి.

4. యాడ్-ఆన్ కార్డ్ :

Advertisement

క్రెడిట్ కార్డ్ హోల్డర్ తమ కుటుంబ సభ్యుల కోసం యాడ్-ఆన్ కార్డులను తీసుకుంటూ ఉంటారు. ప్రైమరీ హోల్డర్ మరణిస్తే.. ఆ యాడ్-ఆన్ కార్డ్ ద్వారా జరిగిన ఖర్చులకు కూడా అకౌంట్ హోల్డర్ బాధ్యుడు. ప్రైమరీ హోల్డర్ మరణం తర్వాత యాడ్-ఆన్ కార్డులు ఆటోమేటిక్‌గా బ్లాక్ అవుతాయి. ఆ కార్డ్ ద్వారా జరిగిన ఖర్చులను కూడా ఎస్టేట్ (ఆస్తుల)నిధుల నుంచే సర్దుబాటు చేయాలి తప్ప, యాడ్-ఆన్ హోల్డర్ స్వయంగా కట్టాల్సిన రూల్ లేదు.

Also Read:  మీ పాన్ కార్డ్ మిస్సయిందా? డూప్లికేట్ పాన్ కార్డ్ ఆర్డర్ చేసేయండిలా!

బ్యాంక్‌కు వెంటనే సమాచారం ఇవ్వడం :

కుటుంబంలో ఎవరైనా క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణిస్తే.. వెంటనే ఆ విషయాన్ని సంబంధిత బ్యాంకుకు అధికారికంగా (డెత్ సర్టిఫికెట్‌తో సహా)తెలియజేయాలి. దీని వల్ల ఆ కార్డ్ పై ఎలాంటి ఫ్రాడ్స్ జరగకుండా ఆగిపోవడంతో.. పాటు, అనవసరమైన లేట్ ఫీజులు, వడ్డీలు పడకుండా బ్యాంక్ అకౌంట్‌ను క్లోజ్ చేయడానికి వీలవుతుంది.

క్రెడిట్ కార్డ్ హోల్డర్ మరణం తర్వాత అప్పుల విషయంలో.. కుటుంబ సభ్యులు ఎక్కడా భయ పడాల్సిన పని లేదు. చట్ట పరమైన నిబంధనలను తెలుసుకుని, బ్యాంకులతో సరైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు!

Related News

రూ.50 లక్షల పెట్టుబడితో రూ.50 కోట్ల రాబడి.. 21 ఏళ్ల యువతి జాక్‌పాట్

తక్కువ రేట్ అని బట్టలు కొంటున్నారా? ఈ మోసం గురించి తెలిస్తే అస్సలు షాపింగ్ చేయరు!

తల్లి, భార్య, కూతురు కోసం.. అదిరిపోయే పోస్టాఫీసు స్కీమ్‌లు.. జీరో రిస్క్, గ్యారెంటీ లాభం!

రూ.5వేల పెట్టుబడితో రూ.5 లక్షలు చేతికి ! సిప్ మ్యాజిక్ ఇదే

కారణం లేకుండా కంపెనీ మిమ్మల్ని తీసేయొచ్చా? లేబర్ లా ప్రకారం ఉద్యోగులకు ఉండే పవర్ ఫుల్ రైట్స్!

కేంద్రంపై వర్తకుల తిరుగుబాటు.. అక్టోబర్ 2న క్యూఆర్ కోడ్స్ పని చేయవు! No UPI Day

స్టాక్ మార్కెట్ భారీ పతనం.. చివరిలో విదేశీ మదుపరులు అమ్మకాలు, అసలు కారణాలు ఇవే

Big Stories

Advertisement
×