BigTV English

Medvedev Beat Sinner: వింబుల్డన్‌లో సంచలనాలు కంటిన్యూ, నెంబర్ వన్ ఆటగాడికి షాకిచ్చిన మెద్వెదేవ్

Medvedev Beat Sinner: వింబుల్డన్‌లో సంచలనాలు కంటిన్యూ,  నెంబర్ వన్ ఆటగాడికి షాకిచ్చిన మెద్వెదేవ్

Medvedev Beat Sinner: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్‌లో సంచలనాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇప్పటికే మహిళల సింగిల్స్ విభాగంలో స్వైటెక్ ఇంటిదారి పట్టింది. ఇప్పుడు పురుషుల సింగిల్స్ వంతైంది. ఇందులో డేనియల్ మెద్వెదేవ్.. నెంబర్ వన్ సీడ్ ఆటగాడు జానెక్ సినన్ ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో అల్కరాస్ తన ప్రత్యర్థిపై గెలిచి సెమీస్‌కు చేరాడు.


వింబుల్డన్ టోర్నీలో క్వార్టర్‌ ఫైనల్ మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం జరిగిన పురుషుల సింగిల్స్ విభాగంలో ఇటలీకి చెందిన ప్రపంచ నెంబర్ వన్ సీడ్ ఆటగాడు జానెక్ సినర్- రష్యా స్టార్ ఆటగాడు డేనియల్ మెద్వెదేవ్ తలపడ్డారు. ఆది నుంచి ఇరువురు ఆటగాళ్లు మధ్య హోరాహోరీ పోరు సాగింది. దాదాపు మూడు గంటలు పైగానే నువ్వానేనా అన్నరీతిలో తలపడ్డారు.

తొలి సెట్‌లో టైబ్రేక్‌లో ఓడిపోయిన మెద్వెదేవ్, సెకండ్ సెట్‌లో మాత్రం ప్రతర్థికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వలేదు. చివరకు థర్డ్ సెట్‌ను బలమైన సర్వీసులతో టై బ్రేక్‌లో గెలుచుకున్నాడు. మ్యాచ్ చూస్తున్న ప్రేక్షకులు ఐదు సెట్లు మ్యాచ్ జరుగుతుందని ఓ అంచనాకు వచ్చేశారు. నాలుగో సెట్‌లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలయ్యాడు మెద్వెదేవ్. దీంతో చివరి సెట్ ఇరువురు ఆటగాళ్లు కీలకంగా మారింది. ఇందులో గెలిచినవాళ్లు సెమీస్‌కు, ఓడిపోయినవాళ్లు ఇంటికి వెళ్లడం ఖాయమైంది.


ఐదో సెట్‌లో మెద్వెదేవ్-సినన్ కొదమసింహాల మాదిరిగా తలపడ్డారు. ఎవరి సర్వీసులో వాళ్లు పాయింట్లు సాధించారు. మెద్వెదేవ్ దూకుడుకు చివరకు సినన్ తలవంచక తప్పలేదు. కేవలం మూడు పాయింట్లు మాత్రమే ఇచ్చింది విజయం సాధించాడు మెద్వెదేవ్. ఐదు సెట్లను 6-7, 6-4, 7-6, 2-6, 6-3 తేడాతో ఓడించాడు. సినన్‌తో కంపేర్ చేస్తే మెద్వెదేవ్ కేవలం 15 ఏస్‌లు మాత్రమే సంధించాడు. 56 విన్నర్లు కొట్టాడు.

ALSO READ: టీమిండియా- జింబాబ్వే మధ్య మూడో టీ 20 మ్యాచ్, జైస్వాల్, శాంసన్ ఇన్..

మరో మ్యాచ్‌లో స్పెయిన్ ఆటగాడు అల్కరాస్ సెమీస్‌కు చేరాడు. క్వార్టర్స్‌లో అమెరికాకు చెందిన టామీ పాల్‌ను 5-7, 6-4, 6-2, 6-2 తేడాతో ఓడించాడు. సెమీస్‌లో అల్కరాస్.. మెద్వెదేవ్‌ను ఢీ కొట్టనున్నాడు.

 

Tags

Related News

Smaran Ravichandran : SRH జట్టులో మరో మరో ఆణిముత్యం.. కావ్య పాపకు లక్ కలిసి వచ్చింది.. ఆ ప్లేయర్ ఎవరంటే

Varun-Shruti : టీమిండియా క్రికెటర్ కు దగ్గర అవుతున్న టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్?

Dream11: టీమిండియాకు షాక్..తప్పుకున్న డ్రీమ్ 11.. కొత్త స్పాన్సర్ ఎవరంటే ?

Aus Vs SA : ఆస్ట్రేలియా విధ్వంసం.. 50 ఓవర్లలో 431 పరుగులు.. హెడ్ తో పాటు మొత్తం ముగ్గురు సెంచరీలు

Sanju Samson : సంజూ శాంసన్ ది ఎంత గొప్ప మనసో… చిన్నారి అడిగిందని ఏకంగా అభిమానుల మధ్యలోకి వెళ్లి మరి

Ipl 2026: కావ్య పాప బిగ్ స్కెచ్… ఏకంగా ఆ 4 గురు ప్లేయర్లపై వేటు.. లిస్టులో షమీ కూడా!

Big Stories

×