BigTV English

Realme GT 7 Pro Launch Date: అయ్యబాబోయ్.. రియల్‌మి జిటి 7ప్రోలో ఇన్ని ఫీచర్లా.. దీన్ని వదలొద్దు బాబాయ్..!

Realme GT 7 Pro Launch Date: అయ్యబాబోయ్.. రియల్‌మి జిటి 7ప్రోలో ఇన్ని ఫీచర్లా.. దీన్ని వదలొద్దు బాబాయ్..!

Realme GT 7 Pro Launch with Snapdragon 8 Gen 4 SoC:  ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ రియల్ మి తరచూ కొత్త కొత్త ఫోన్లను లాంచ్‌ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఫీచర్ల విషయంలో కూడా ఎక్కడా తగ్గకుండా ఫోన్ ప్రియులకు మంచి అనుభూతిని, సేఫ్టీని అందించేందుకు అప్‌గ్రేడెడ్ ఫీచర్లను ఫోన్లలో అందిస్తుంది. ఇప్పటికే చాలా రకాల మోడళ్లను మార్కెట్‌లో పరిచయం చేసిన రియల్ మి ఇప్పుడు మరొక మోడల్‌తో తన హవా కొనసాగించాలని చూస్తోంది. కంపెనీ రియల్‌మి జిటి 7 ప్రోను ఎట్టకేలకు భారతదేశంలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది.


అయితే రాబోయే రియల్‌మి స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌ల గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల కాలేదు. కాగా గత కొన్ని లీక్‌లు మాత్రం బయటకొచ్చాయి. ఇటీవల ఒక చైనీస్ టిప్‌స్టర్ Realme GT 7 pro స్మార్ట్‌ఫోన్ డిస్ప్లే, ప్రాసెసర్, బ్యాటరీకి సంబంధించి కొన్ని వివరాలకు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..

Realme GT 7 Pro స్మార్ట్‌ఫోన్ 6,000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగి ఉంటుందని.. ఇది 100W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుందని తెలుస్తోంది. Realme GT 7 Proలో పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ, రాబోయే రియల్‌మి స్మార్ట్‌ఫోన్ 8.5 మిమీ మందంతో ఉంటుందని సమాచారం. ఇది కాకుండా ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండవచ్చని తెలుస్తోంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉండనున్నట్లు తెలుస్తోంది.


Also Read: తక్కువ ధరకే రియల్‌మీ GT 7 Pro స్మార్ట్‌ఫోన్.. అసలైన కిల్లర్ ఇది..!

రాబోయే ఫోన్‌లో కర్వ్డ్ డిస్‌ప్లే ఉంటుందని, ఇది 1.5K రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని సమాచారం. ఇది కాకుండా Realme స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ గురించి సమాచారం కూడా టిప్‌స్టర్ తెలిపాడు. ఈ ఫోన్‌లో Qualcomm Snapdragon8 Gen 4 SoCపై నడుస్తుందని క్లెయిమ్ చేయబడింది. ఇది ఈ సంవత్సరం అక్టోబర్‌లో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు. ఈ ఇటీవలి లీక్ ప్రకారం.. GT 7 ప్రో స్మార్ట్‌ఫోన్ స్క్వేర్ కెమెరా మాడ్యూల్‌ను పొందుతుంది.

ఇందులో ట్రిపుల్ కెమెరా సిస్టమ్ ఉంటుంది. కెమెరా సెటప్‌లో 50-మెగాపిక్సెల్ మల్టీ-ఫోకల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్‌తో కూడిన సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో సెన్సార్ ఉన్నట్లు నివేదించబడింది. ఇది IP68, IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్‌లతో అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించే ఛాన్స్ ఉందని కొందరు అంటున్నారు.

Tags

Related News

Most Secure Smartphones: ప్రపంచంలోని అత్యంత సురక్షిత స్మార్ట్‌ఫోన్‌లు.. వీటిని హ్యాక్ చేయడం అసాధ్యమే?

Samsung W26 Foldable: ఫోల్డెబుల్ ఫోన్‌లో 200MP కెమెరా, శాటిలైట్ కనెక్టివిటీ… శామ్‌సంగ్ W26 ఫోల్డ్ లాంచ్

Storing Paswords: బ్రౌజర్‌లో పాస్‌వర్డ్‌లు సేవ్ చేస్తున్నారా? ఈ ప్రమాదాల గురించి తెలుసుకోండి

Amazon Alexa Offers: అలెక్సా డివైజ్‌లపై 50 శాతం తగ్గింపు.. లిమిటెడ్ ఆఫర్ త్వరపడండి

Motorola Moto G85 5G: ఒక్క ఫోన్‌లో అన్ని ఫీచర్లు.. 7800mAh బ్యాటరీతో మోటోరోలా G85 5G పోన్ లాంచ్

Smartphone Comparison: మోటో G06 పవర్ vs గెలాక్సీ M07.. ₹8,000 కంటే తక్కువ ధరలో ఏది బెస్ట్?

Samsung Galaxy Ultra Neo: ఓ మై గాడ్! 9వేలకే శామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా నీవో..! ఇంత చీప్ ధరలో 5జి ఫోన్!

Mappls Google Maps: గూగుల్ మ్యాప్స్‌కు మించిపోయే ఇండియన్ యాప్.. 3D నావిగేషన్‌తో కొత్త మ్యాప్‌ల్స్

Big Stories

×