E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

కొంప‌ముంచిన‌ రాధ యాద‌వ్..రెండు క్యాచ్ లు మిస్‌, టీమిండియా ఎలిమినేట్ ?

కొంప‌ముంచిన‌ రాధ యాద‌వ్..రెండు క్యాచ్ లు మిస్‌, టీమిండియా ఎలిమినేట్ ?
Advertisement

Radha Yadav Dropped Catches:  మహిళల టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( Women’s T20 World Cup 2026 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ లో వరుసగా రెండు విజయాలను నమోదు చేసుకున్న టీమిండియాకు ( India Women) ఊహించని షాక్ తగిలింది. పాకిస్తాన్ అలాగే మొన్న నెదర్లాండ్స్ జట్టుపై విక్టరీ అందుకున్న టీమిండియా… నిన్న దక్షిణాఫ్రికా (South Africa Women) చేతిలో చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓడిపోయింది. అయితే ఇందులో టీమిండియా ఓడిపోవడానికి ముఖ్య కారణం రాధ యాదవ్ అంటూ పోస్టులు వైర‌ల్ అయ్యాయి. ఆమె మిస్ చేసిన రెండు క్యాచ్ ల ( Radha Yadav Dropped Catches) కారణంగా టీమిండియా ఓడిపోయింది. ఇదే విషయాన్ని మాజీ క్రికెటర్లు కూడా స్పష్టం చేస్తున్నారు. ఆ రెండు క్యాచ్ లు పట్టి ఉంటే టీమిండియా గెలిచేది. దీంతో రాధ యాద‌వ్ ను ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు క్రికెట్ ఫ్యాన్స్‌.

Also Read: Ravichandran Ashwin weighs in on Ishan Kishan: అఫ్ఘాన్ పై సెంచ‌రీ చేశాడ‌ని ఎగిరి ప‌డొద్దు..వ‌ర‌ల్డ్ క‌ప్ కు ఇషాన్ అస‌లు ప‌నికే రాడు

కొంప‌ముంచిన‌ రాధ యాద‌వ్..రెండు క్యాచ్ లు మిస్‌

Advertisement

మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ లో (ICC Women’s T20 World Cup 2026 ) భాగంగా నిన్న దక్షిణాఫ్రికా వర్సెస్ మహిళల టీమ్ ఇండియా మధ్య బిగ్ ఫైట్ జరిగింది. మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ (Emirates Old Trafford, Manchester) వేదికగా ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 158 పరుగులు సాధించింది. ఇక ఈ లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో పోరాడి మరి గెలిచింది దక్షిణాఫ్రికా. వాస్తవానికి ఈ మ్యాచ్ లో టీమిండియా సులభంగా గెలిచేది. కానీ రాధా యాదవ్ చేసిన మిస్టేక్ వల్ల టీమిండియా ఓడిపోవాల్సి వచ్చింది. వచ్చిన రెండు క్యాచులను రాదా యాదవ్ వదిలేసి టీమ్ ఇండియా కొంప ముగిసింది.

నిన్నటి మ్యాచ్ సందర్భంగా అదరగొట్టిన దక్షిణాఫ్రికా ప్లేయర్ మారిజాన్ కాప్ ( Marizanne Kapp) 81 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చింది. చివరలో సిక్సర్ కూడా కొట్టింది. అయితే ఈమె 27 పరుగుల వద్ద క్యాచ్ ఇవ్వగా రాధా యాదవ్ మిస్ చేసింది. ఆ తర్వాత 66 పరుగుల వద్ద మరో క్యాచ్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు కూడా రాధా యాదవ్ మిస్ చేసి టీమిండియా ఓటమికి కారణమైంది. మారిజాన్ కాప్ ను అక్కడే అవుట్ చేసి ఉంటే.. ఇవాళ టీమ్ ఇండియా విజయం సాధించేది. అందుకే రాధా యాదవ్ పై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ ఓట‌మితో వ‌ర‌ల్డ్ క‌ప్ నుంచి టీమిండియా ఎలిమినేట్ అయ్యే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని అంటున్నారు.

Advertisement

Also Read:  Tanveer Ahmed On ICC Womens World Cup 2026 Womens Pakistan Team: నీకు చేత కాక‌పోతే త‌ప్పుకో..కోచ్ వహాబ్ రియాజ్ కు వార్నింగ్

 

 

Related News

పాకిస్తాన్ మ‌హిళ‌లకు క్రికెట్ చేత‌కాదు కానీ, వంట‌లు మాత్రం బాగా చేస్తారు

Pollard Vs Milind: పొలార్డ్ కే సినిమా చూపించిన మిలింద్..బిత్త‌ర‌పోయిన అంపైర్లు

వరల్డ్ కప్ లో 33 యాడ్స్.. కానీ చేసింది 32 పరుగులే, జెమిమాను తీసేయండి అంటూ ట్రోల్స్‌

మ‌ళ్లీ వైభ‌వ్ కాల‌ర్లు ప‌ట్టుకుంటాడ‌ని భ‌యంతో శ్రీలంక బౌల‌ర్లు స్లోగా బంతులు వేశారు !

15 ఏళ్ల వ‌య‌స్సులో నాకు బ్యాట్ స‌రిగ్గా పట్టుకోలేకపోయేవాడిని..కానీ వైభ‌వ్ మాత్రం !

Sanjay Manjrekar: వైభ‌వ్ ను చూస్తే వ‌ణుకుపుడుతోంది..లంక ప్లేయ‌ర్లకు న‌ర‌కం చూపించాడు

వైభ‌వ్ మాములోడు కాదు, 8వ‌ వండ‌ర్..ఆ బ్యాటింగ్ చూసి పిచ్చోడిని అయిపోయా

Big Stories

×