Mohammed Shami: టీమిండియా స్టార్ ఆటగాడు మహమ్మద్ షమీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. భార్యకు విడాకులు ఇచ్చిన మహమ్మద్ షమీ.. గత కొన్ని రోజులుగా ఒంటరి జీవితాన్ని గడుపుతున్న సంగతి తెలిసిందే. భార్యకు దూరంగా ఉన్నప్పటికీ… మహమ్మద్ షమీ పరువు తీసేలా.. ఆయన భార్య హసీన్ జహన్ చాలాసార్లు ప్రయత్నించింది. అయితే ఇలాంటి నేపథ్యంలో మహమ్మద్ షమీకి కలకత్తా హైకోర్టులో ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఆయన భార్యకు భరణం ఇవ్వాల్సిందేనని తాజాగా కోర్టు తీర్పునిచ్చింది.
నెలకు 4 లక్షల చొప్పున భరణం
మహమ్మద్ షమీ భార్య హసీన్ జహన్ కు ప్రతినెల 4 లక్షల రూపాయల చొప్పున భరణం చెల్లించాలని… తాజాగా కలకత్తా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇందులో.. 1.50 లక్షలు ఆయన భార్యకు ఇవ్వాలని పేర్కొంది. అలాగే షమీ కూతురు ఐరా మెయింటెనెన్స్ కోసం 2.50 లక్షలు ఇవ్వాలని కూడా మహమ్మద్ షమీకి స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది కలకత్తా హైకోర్టు. 2018 నుంచి.. మహమ్మద్ షమీ అలాగే హసీన్ జహాన్ విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి షమీ భార్యకు భరణం చెల్లించాల్సి ఉంటుందని కూడా కోర్టు వెల్లడించింది. అంటే పాత బకాయిలు కూడా మహమ్మద్ షమీ చెల్లించాల్సి ఉంటుంది. కలకత్తా కోర్టు ఇచ్చిన తాజా తీర్పు పట్ల టీం ఇండియా స్టార్ ఆటగాడు మహమ్మద్ షమీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
అద్భుతంగా రాణిస్తున్న మహమ్మద్ షమీ
2023 ప్రపంచ కప్ సమయంలో టీమిండియా ఫైనల్ దాకా వెళ్ళిందంటే దానికి కారణం మహమ్మద్ షమీ అని చెప్పవచ్చు. ఆ టోర్నమెంట్లో అద్భుతంగా రాణించి… 20 కి పైగా వికెట్లు పడగొట్టాడు మహమ్మద్ షమీ. అయితే ఫైనల్ సమయంలోనే గాయపడిన మహమ్మద్ షమీ సర్జరీ కూడా చేయించుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ టీమిండియాలోకి రీ ఎంట్రీ కూడా ఇచ్చాడు. రీయంట్రిలో కూడా… అదరగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు.
మెగా వేలంలో మహమ్మద్ షమీ పైన ఉన్న నమ్మకంతో కావ్య పాప పది కోట్లకు అతని కొనుగోలు చేసింది. కానీ మొన్నటి సీజన్ లో మహమ్మద్ షమతో పాటు హైదరాబాద్ జట్టు కూడా దారుణంగా విఫలమైంది. మళ్లీ వచ్చే సీజన్లో ఎలాగైనా రాణించాలని కష్టపడుతున్నాడు షమీ. ఇలాంటి నేపథ్యంలోనే కుటుంబ సమస్యలు కూడా మహమ్మద్ షమీని వేధిస్తున్నాయి. చాలామంది క్రికెటర్లు తమ భార్యలకు దూరమైన తర్వాత… వేరే అమ్మాయిల టచ్ లోకి వెళ్లడం చూస్తున్నాం. హార్దిక్ పాండ్యా అలాగే యుజ్వేంద్ర చాహల్ లాంటి వాళ్లు ఇప్పటికే సెకండ్ మ్యారేజ్ కి కూడా సిద్ధమయ్యారు. కానీ మహమ్మద్ షమీ మాత్రం తన కూతురి కోసం… ఇంకో పెళ్లి చేసుకోవడం లేదు. సింగిల్ గానే జీవితాన్ని గడుపుతున్నాడు.