Yusuf Pathan : టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (India vs Afghanistan, 3rd ODI) మధ్య చిట్ట చివరి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. చెన్నై (MA Chidambaram Stadium, Chennai) వేదికగా ఈ రెండు జట్లు మూడవ వన్డే ఆడుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న ఈ మూడవ వన్డేలో రోహిత్ శర్మ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. హ్యాట్రిక్ క్యాచ్ లు అందుకొని, సౌరవ్ గంగూలీ సరసన చేరాడు. అయితే రోహిత్ శర్మ వరుసగా మూడు క్యాచ్ లు అందుకున్న నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై యూసఫ్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ (Rohit Sharma ) 40 ఏళ్లు ఉన్నాడన్నావు కదా…? ఆ క్యాచ్ లను కళ్ళు తెరిచి చూడు అంటూ మండిపడ్డారు. ఆ మూడు క్యాచ్ లు చూసైనా, వన్డే వరల్డ్ కప్ కోసం రోహిత్ శర్మను ఫైనల్ చేయాలంటూ ఫైర్ అయ్యారు. దీంతో యూసఫ్ పఠాన్ (Yusuf Pathan ) చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (India vs Afghanistan, 3rd ODI) మధ్య లక్నో వేదికగా (MA Chidambaram Stadium, Chennai) జరిగిన చివరి వన్డే జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో మొదట ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్ చేసింది. ఈ సందర్భంగా ఆఫ్ఘనిస్తాన్ 218 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. అయితే మొదట్లో ప్రసిద్ధ్ కృష్ణ అదిరిపోయే బౌలింగ్ చేసి, కీలక వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ మ్యాచ్ లో 5 వికెట్లు ప్రసిద్ధ్ తీయగా..ఇందులో మూడు క్యాచ్ లు రోహిత్ శర్మ అందుకున్నాడు. ఈ క్రమంలో గంగూలీ సరసన చేరాడు. గతంలో కూడా వరుసగా మూడు క్యాచులు అందుకున్నాడు గంగూలీ. ఇప్పుడు రోహిత్ శర్మ కూడా రికార్డు సృష్టించాడు.
అయితే దాదాపు 40 సంవత్సరాలు ఉన్న రోహిత్ శర్మ… స్లిప్పులో అదిరిపోయే క్యాచులు పట్టడం పట్ల సోషల్ మీడియాలో ప్రసంచల వర్షం కురుస్తోంది. దీనిపై యూసఫ్ పఠాన్ కూడా స్పందించారు. 40 ఏండ్లు అయినా కూడా కుర్రాడిలా రోహిత్ శర్మ అదిరిపోయే క్యాచ్ లు అందుకుంటున్నాడని ఆయన వెల్లడించారు. ఈ క్రమంలో వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మను తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. వన్డే వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ ఉంటేనే టీమిండియా సులభంగా విజయం సాధిస్తుందని వ్యాఖ్యానించారు. లేకపోతే వరల్డ్ కప్ గెలవడం కష్టమేనన్నారు. రోహిత్ శర్మ ఫిట్నెస్ చూసి… గౌతమ్ గంభీర్ కండ్లు తెరవాలని మండిపడ్డారు.
They said age would slow him down. They questioned his reflexes. They questioned his hunger.
when the ODI World Cup arrives, watching Rohit at 40 will be an absolute treat for cricket fans around the world. pic.twitter.com/rhFbBcJ7zt
— CricInformer (@CricInformer) June 20, 2026