Mary Kom Divorce: భారత బాక్సింగ్ లెజెండ్ మేరీ కోమ్ డివోర్స్ రూమర్స్ తో వార్తల్లో నిలిచింది. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన మేరీ కోమ్.. త్వరలోనే భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారని, వీరి నలుగురు పిల్లలు కూడా ప్రస్తుతం మేరీకోమ్ వద్దే ఉంటున్నట్లు సమాచారం. అయితే వీరి విడాకులకు గల కారణాల గురించి అనేక ఊహగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: Glenn Maxwell: మ్యాక్స్‌వెల్‌కు ఎదురుదెబ్బ.. పాపం ఇంకా ఇంటికి పోవాల్సిందే
మేరీ కోమ్ తన భర్త కరుంగ్ ఓంక్లర్ తో విడిపోవాలని డిసైడ్ అయ్యిందట. 20 ఏళ్లు కలిసి ఉన్న ఈ జంట విడిపోవడం వెనుక ఒక్కొక్కటిగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తన భర్త ఓంక్లర్ వద్దని చెప్పినప్పటికీ అనవసరంగా డబ్బు ఖర్చు చేసిన మేరీ కోమ్.. ఈ వ్యవహారాన్ని విడాకుల వరకు తీసుకువచ్చిందని కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఓ జాతీయ మీడియా సంస్థ ఈ కథనాన్ని ప్రచురించింది. మేరీ కోమ్ సొంత రాష్ట్రమైన మణిపూర్ లో 2022లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగాయి.
అందులో పోటీపడిన మేరీ భర్త ఓంక్లర్ ఓడిపోయాడు. ఆ ఎన్నికల క్యాంపెయిన్ కోసం ఈ దంపతులు రూ. రెండు నుండి మూడు కోట్ల వరకు ఖర్చు చేశారట. కానీ ఆ ఎన్నికలలో అనుహ్య ఓటమి ఎదురవడంతో మేరీ కోమ్ తట్టుకోలేక పోయిందట. ఓవైపు భర్త ఓడిపోవడం, మరోవైపు డబ్బులు కూడా పోవడంతో తీవ్ర నిరాశకు గురైందట. దీంతో కొన్నాళ్ల తర్వాత తన నలుగురు పిల్లలను తీసుకుని ఫారియాబాద్ కి వచ్చేసిందని, అప్పటినుండి ఆమె భర్త ఓంక్లర్ కొంతమంది కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీలో ఉంటున్నారట.
ఇలా మేరీ కోమ్ దంపతులు విడిపోవడానికి మణిపూర్ ఎన్నికల కారణమని రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేయడం మేరీకోమ్ భర్తకు ముందు నుండే ఇష్టం లేదని.. కానీ ఆమెనే బలవంత పెట్టి ఆయనతో పోటీ చేయించిందని తెలుస్తోంది. బలవంతంగా ఎన్నికల రంగంలోకి దింపి, ఓడిపోయిన తర్వాత భర్తతో గొడవ పడిందని జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
Also Read: Sachin Tendulkar: 28 సార్లు సెంచరీ మిస్ చేసుకున్న ఏకైక ప్లేయర్.. అన్ని 99, 98, 93,91 దగ్గరే
అయితే మేరీ కోమ్ కోసం ఆమె భర్త ఎంతో చేశారని, అతడు తన పిల్లల కోసం ఫుట్బాల్ కెరీర్ ని కూడా వదులుకున్నట్లు రాసుకు వస్తున్నాయి. మరోవైపు మేరీ కోమ్ కి మరో మహిళా బాక్సర్ భర్తతో స్నేహం ఉందని.. ఆ కారణంగానే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి. ఇందులో ఏది నిజమో.. ఏది అబద్ధమో తెలియక పోయినప్పటికీ.. వీరి విడాకులు మాత్రం ఖాయం అంటున్నారు. ఈ రూమర్స్ పై మేరీకోమ్, లేక ఆమె భర్త స్పందిస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాలి.