BigTV English

SA 20 league 2025: నేటినుంచే SA-20 లీగ్.. బరిలో SRH.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

SA 20 league 2025: నేటినుంచే SA-20 లీగ్.. బరిలో SRH.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?

SA 20 league 2025: సౌత్ ఆఫ్రికా టి-20 ఫ్రాంచైజీ లీగ్ (SA T-20) ఎడిషన్ కి సంబంధించి 2024 అక్టోబర్ 1న వేలం ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఈ సీజన్ 2025 జనవరి 9 గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న సౌత్ ఆఫ్రికా t-20 లీగ్.. ఇప్పుడు మూడవ సీజన్ కి ముస్తాబైంది. ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఐన సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ కి చెందిన జట్లు ఈ లీగ్ లో పోటీ పడబోతున్నాయి.


Also Read: Konstas on Virat Kohli: విరాట్ కోహ్లీ నా దేవుడు.. ఆస్ట్రేలియా వివాదాస్పద ప్లేయర్ సంచలనం

డిఫెండింగ్ ఛాంపియన్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ – ఎమ్ఐ కేప్ టౌన్ జట్ల మధ్య కేప్ టౌన్ వేదికగా నేడు తొలి మ్యాచ్ జరగబోతోంది. ఈ లీగ్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 8 వరకు 6 జట్ల మధ్య 30 లీగ్ మ్యాచ్ లు జరగబోతున్నాయి. ఇక జోహాన్నెస్ బర్గ్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కావ్య మారన్ కి చెందిన సన్ రైజర్స్ ఈస్టర్న్ కేప్ వరుసగా రెండు సీజన్లలో విజేతగా నిలిచి.. మూడోసారి కప్ గెలిచి హైట్రిక్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. ఇక ఐపీఎల్ కి రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ ఆటగాడు దినేష్ కార్తీక్ ఈ లీగ్ లో బరిలోకి దిగుతున్నాడు.


పార్ల్ రాయల్స్ జట్టుకు దినేష్ కార్తీక్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ లీగ్ లో ఆడుతున్న తొలి భారత ఆటగాడిగా దినేష్ కార్తీక్ గుర్తింపు పొందనున్నాడు. ఈ లీగ్ లో జరగబోయే మ్యాచ్ లు సాయంత్రం 4:30 గంటలకు, రాత్రి 7 గంటలకు, రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఒకరోజు ఒక మ్యాచ్ మాత్రమే ఉంటే రాత్రి 7 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఇక డబుల్ హేడర్ ఉన్నప్పుడు మొదటి మ్యాచ్ 4:30 గంటలకు ప్రారంభమైతే.. రెండవ మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లని స్టార్ స్పోర్ట్స్ – 2, స్పోర్ట్స్ 18 – 2 చానల్స్ లో చూడవచ్చు. అలాగే ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రత్యక్ష ప్రసారంలో చూడవచ్చు.

ఈ లీగ్ లోని జట్లు మరియు ఆటగాళ్ల వివరాలు:

డర్బన్స్ సూపర్ జెయింట్స్:

బ్రాండన్ కింగ్ (వెస్టిండీస్), క్వింటన్ డి కాక్, నవీన్-ఉల్-హక్ (ఆఫ్ఘనిస్తాన్), కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), క్రిస్ వోక్స్ (ఇంగ్లండ్), ప్రేనెలన్ సుబ్రాయెన్, డ్వైన్ ప్రిటోరియస్, కేశవ్ మహరాజ్ (కెప్టెన్), నూర్ అహ్మద్ (ఆఫ్ఘనిస్తాన్), హెన్రిచ్ క్లాసేన్ , జోన్-జోన్ స్మట్స్, వియాన్ ముల్డర్, జూనియర్ డాలా, బ్రైస్ పార్సన్స్, మాథ్యూ బ్రీట్జ్కే, జాసన్ స్మిత్, మార్కస్ స్టోయినిస్ (ఆస్ట్రేలియా), షమర్ జోసెఫ్ (వెస్టిండీస్), సీజే. కింగ్ (రూకీ).

జోబర్గ్ సూపర్ కింగ్స్:

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), మొయిన్ అలీ (ఇంగ్లండ్), జానీ బెయిర్‌స్టో (ఇంగ్లండ్), మహేశ్ తీక్షణ (శ్రీలంక), డెవాన్ కాన్వే (న్యూజిలాండ్), గెరాల్డ్ కోయెట్జీ, డేవిడ్ వైస్ (నమీబియా), ల్యూస్ డు ప్లూయ్ (ఇంగ్లండ్), లిజాద్ విలియమ్స్, నాండ్రే బర్గర్, డోనోవన్ ఫెరీరా, ఇమ్రాన్ తాహిర్, సిబోనెలో మఖాన్యా, తబ్రైజ్ షమ్సీ, విహాన్ లుబ్బే, ఇవాన్ జోన్స్, డగ్ బ్రేస్‌వెల్ (న్యూజిలాండ్), జేపీ కింగ్ (రూకీ).

ఎమ్.ఐ కేప్ టౌన్:

రషీద్ ఖాన్ (కెప్టెన్) (ఆఫ్ఘనిస్థాన్), బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్), కగిసో రబడ, ట్రెంట్ బౌల్ట్ (న్యూజిలాండ్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘనిస్థాన్), డెవాల్డ్ బ్రెవిస్, ర్యాన్ రికెల్టన్, జార్జ్ లిండే, నువాన్ తుషార (శ్రీలంక), కానర్ ఎస్టర్‌హుజెన్, డెలానో పోట్గీ రాస్సీ వాన్ డెర్ డస్సెన్, థామస్ కాబెర్, క్రిస్ బెంజమిన్ (ఇంగ్లండ్), కార్బిన్ బాష్, కోలిన్ ఇంగ్రామ్, రీజా హెండ్రిక్స్, డేన్ పీడ్ట్, ట్రిస్టన్ లూస్ (రూకీ).

ప్రిటోరియా క్యాపిటల్స్:

అన్రిచ్ నోర్ట్జే, జిమ్మీ నీషమ్ (న్యూజిలాండ్), విల్ జాక్స్ (ఇంగ్లండ్), రహ్మానుల్లా గుర్బాజ్ (ఆఫ్ఘనిస్తాన్), లియామ్ లివింగ్‌స్టోన్ (ఇంగ్లండ్), విల్ స్మీడ్ (ఇంగ్లండ్), మిగెల్ ప్రిటోరియస్, రిలీ రోసోవ్, ఈతాన్ బాష్, వేన్ పర్నెల్ (కెప్టెన్), సెనురాన్ పార్నెల్, వెర్రేన్నే, డారిన్ డుపావిల్లాన్, స్టీవ్ స్టోక్, టియాన్ వాన్ వురెన్, మార్క్వెస్ అకెర్‌మాన్, ఎవిన్ లూయిస్ (వెస్టిండీస్), కైల్ సిమండ్స్, కీగన్ లయన్-కాచెట్ (రూకీ).

పార్ల్ రాయల్స్:

డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (ఆఫ్ఘనిస్థాన్), సామ్ హైన్ (ఇంగ్లండ్), జో రూట్ (ఇంగ్లండ్), దినేష్ కార్తీక్ (భారత్), క్వేనా మఫాకా, లువాన్-డ్రే ప్రిటోరియస్, జోర్న్ ఫోర్టుయిన్, లుంగి ఎన్‌గిడి, మిచెల్ వాన్ బ్యూరెన్, కీత్ డుడ్జియన్, న్కాబా పీటర్, ఆండిలే ఫెహ్లుక్వాయో, కోడి యూసుఫ్, జాన్ టర్నర్ (ఇంగ్లండ్), దయాన్ గాలీమ్, జాకబ్ బెథెల్ (ఇంగ్లండ్), రూబిన్ హెర్మాన్, దేవాన్ మరైస్ (రూకీ).

Also Read: Dhanashree Verma: విడాకుల రూమర్స్ పై స్పందించిన చాహల్ భార్య ధనశ్రీ.. పోస్ట్ వైరల్!

సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్:

ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), జాక్ క్రాలే (ఇంగ్లండ్), రోలోఫ్ వాన్ డెర్ మెర్వే (నెదర్లాండ్స్), లియామ్ డాసన్ (ఇంగ్లండ్), ఒట్నీల్ బార్ట్‌మన్, మార్కో జాన్సెన్, బేయర్స్ స్వాన్‌పోయెల్, కాలేబ్ సెలెకా, ట్రిస్టన్ స్టబ్స్, జోర్డాన్ హెర్మాన్, ప్యాట్రిక్ క్రుగర్, (ఇ క్రెగ్‌ల్యాండ్ ఓవర్‌టన్), టామ్ అబెల్ (ఇంగ్లండ్), సైమన్ హార్మర్, ఆండిలే సిమెలన్, డేవిడ్ బెడింగ్‌హామ్, ఒకుహ్లే సెలే, రిచర్డ్ గ్లీసన్ (ఇంగ్లండ్), డేనియల్ స్మిత్ (రూకీ).

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×