BigTV English

ZIM vs IND: వచ్చేదెవరు? వెళ్లేదెవరు..? జట్టులో చేరిన సంజూ, యశస్వి, దూబె

ZIM vs IND: వచ్చేదెవరు? వెళ్లేదెవరు..? జట్టులో చేరిన సంజూ, యశస్వి, దూబె

Zimbabwe vs India T20I Series: టీ 20 ప్రపంచకప్ విజేతగా టీమ్ ఇండియా నిలిచింది. ఆ సంబరాలు ఘనంగా ముగిశాయి. దీంతో జింబాబ్వే వెళ్లాల్సిన ముగ్గురు ఆటగాళ్లు సంజూశాంసన్, యశస్వి, శివమ్ దూబె ఇండియాలో ఆగిపోయారు. సంబరాల అనంతరం జింబాబ్వే వెళ్లి జట్టులో కలిశారు. దీంతో మళ్లీ జట్టులో ఇబ్బందికర పరిస్థితి వచ్చింది. ఎవరిని ఉంచాలి? ఎవరిని తీయాలి? అనేది కెప్టెన్ గిల్, కోచ్ లక్ష్మణ్ కు పెద్ద సంకటంగా మారిందని అంటున్నారు.


ఎందుకంటే తొలి టీ 20లో డకౌట్ అయిన అభిషేక్ శర్మ, రెండో మ్యాచ్ లో సెంచరీ చేసి ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తనని తీయడానికి లేదు. ఇకపోతే ధ్రువ్ జురెల్ నిరాశపరచడంతో అతని స్థానంలో సంజూకి అవకాశం వచ్చేలా కనిపిస్తోంది. ఇదొక్కటి కొంచెం పాజిటివ్ గా ఉంది. ఇక సాయి సుదర్శన్ ప్లేస్ లో శివమ్ దుబె వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇకపోతే యశస్వి జైశ్వాల్ కి అవకాశం లేకపోవచ్చునని, అతను డగౌట్ కే పరిమితం అయ్యేలా ఉన్నాడని అంటున్నారు.

ఎందుకంటే యశస్వి ఓపెనింగ్ చేస్తాడు. ఇప్పటికే ఆల్రడీ గిల్, అభిషేక్ శర్మ ఉన్నారు. వారి తర్వాత ఫస్ట్ డౌన్ లో వెళ్లే రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. వారి తర్వాత రింకూ సింగ్ వస్తున్నాడు. ఇక్కడి వరకు ఎవరికీ డౌట్స్ లేవు. మరి సంజూ శాంసన్ వస్తే తను ఫస్ట్ డౌన్ వచ్చి, రుతురాజ్ సెకండ్ డౌన్ వచ్చి, థర్డ్ డౌన్ రింకూ సింగ్ వస్తే లెక్క సరిపోతుంది. ఆ తర్వాత శివమ్ దూబె వస్తాడు.


Also Read: బౌలర్ కుల్‌దీప్ క్లారిటీ.. నటితో డేటింగ్‌.. ఆపై పెళ్లి గురించి..

మరిక్కడ యశస్వికి చోటేది? అంటున్నారు. రియాన్ పరాగ్ ని పక్కన పెట్టినా యశస్వి ఓపెనింగ్ చేస్తాడు. లేదా ఫస్ట్ డౌన్ వస్తాడు. అదే ఇప్పుడు కోచ్ లక్ష్మణ్, కెప్టెన్ గిల్ కి తలనొప్పిగా మారింది. ఇకపోతే రెండో వన్డే 100 పరుగుల తేడాతో గెలిచిన తర్వాత విన్నింగ్ టీమ్ ని మార్చకూడదని కొందరంటున్నారు. రెండు వన్డేలు ఆడటం వల్ల పిచ్ పై అవగాహన వచ్చిందని చెబుతున్నారు. మిగిలిన మూడు వన్డేలు కూడా ఇదే పిచ్ హరారేలోనే జరగనున్నాయి. అందువల్ల వీరినే కొనసాగించే అవకాశాలున్నాయని కొందరంటున్నారు. లేదంటే అంత కష్టపడి వీరిని పంపించిన తర్వాత తప్పనిసరిగా అవకాశం ఇవ్వల్సిందేనని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×