BigTV English
Advertisement
Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్.. 82 రోజుల్లో ప్రభుత్వ పతనం ఖాయం..

Chandrababu : రాష్ట్రంలో ఏ వర్గమూ సంతోషంగా లేదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ మొదలైందని.. 82 రోజుల్లో పతనం తప్పదన్నారు. టీడీనీ ఆధ్వర్యంలో 'రా కదలి రా' బహిరంగ సభను తిరుపతి జిల్లా వెంకటగిరిలో నిర్వహించారు. ఈ సభలో వైసీపీ నేతల తీరుపై మండిపడ్డారు. సీఎం జగన్ ఎన్నికల సందర్భంలో వెంకటగిరి తలరాత మారుస్తామని పెద్ద పెద్ద వాగ్దానాలు చేశారన్నారు. మరి తలరాత మారిందా ? అని బాబు ప్రశ్నించారు. వైసీపీలో ఉండే ఆనం రాంనారాయణరెడ్డి.. జగన్‌ పాలన బాగోలేదని చెప్పారన్నారు. ఆనం.. ప్రజాహితం కోసం మాట్లాడితే దూరం పెట్టారన్నారు. సీనియర్లను కూడా లెక్కపెట్టని అహంకారం జగన్‌ది అని చంద్రబాబు దుయ్యబట్టారు.

SHARMILA SON ENGAGEMENT : షర్మిల కుమారుడి నిశ్చితార్థ వేడుక.. హాజరైన సీఎం జగన్..
ANGANWADI : ఎస్మాకు బెదరం.. పోరాటం వీడం.. నేటి నుంచి నిరవధిక దీక్షలు..
Sankranti Return Journey :  పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు,  బస్సులు రద్దీ..

Sankranti Return Journey : పట్నం బాట పట్టిన జనం.. రైళ్లు, బస్సులు రద్దీ..

SANKRANTI RETURN JOURNEY : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.

Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు.. షర్మిలకు పగ్గాలు ఇచ్చే ఛాన్స్..

Sharmila : ఎన్నికల వేళ ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో షర్మిల పాత్రపై ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతోంది. ఇటీవలే కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న ఆమె..పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపడుతారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. దేశంలో లోక్‌సభ ఎలక్షన్స్‌ కూడా జరగనున్న నేపథ్యంలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది హస్తం అధిష్టానం. కర్ణాటక, తెలంగాణలో మాదిరే ఏపీలోనూ విక్టరీ సాధించాలని వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పజెప్తే.. పదేళ్లనాటి పూర్వవైభవం నెలకొంటుందని.. జగన్‌ను ఎదుర్కొవడం సులువు అవుతుందన్న అంచనాల్లో ఉంది. ఈ మేరకు త్వరలో షర్మిలను పీసీసీ చీఫ్‌గా నియమిస్తారన్న టాక్‌ వినిపిస్తోంది.

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : నేడు శ్రీసత్యసాయి జిల్లాకు మోదీ.. జాతీయ అకాడమీ ప్రారంభించనున్న పీఎం..

PM Modi : శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్రమోదీ రానున్నారు. ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపు సాధిస్తూ రూ.541 కోట్ల అంచనాలతో జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, మాదక ద్రవ్యాల అకాడమీ ఇక్కడ ఏర్పాటవుతోంది. ఈ శిక్షణ కేంద్రాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర బలగాలు కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నాయి. ప్రధాని పర్యటనలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం జగన్‌, పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.

Supreme Court  :  చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ.. నేడే కీలక తీర్పు..
Sankranti Celebrations : నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబురాలు.. నారా, నందమూరి కుటుంబాల సందడి..
CM Jagan Mohan Reddy : తాడేపల్లిలో ఘనంగా సంక్రాంతి వేడుకలు.. సతీసమేతంగా పాల్గొన్న సీఎం జగన్..!
YCP Leaders Fires on CM Jagan : మాపై నమ్మకం పోయిందా?  సీఎం జగన్ తీరుపై ఎమ్మెల్యేల సీరియస్..

YCP Leaders Fires on CM Jagan : మాపై నమ్మకం పోయిందా? సీఎం జగన్ తీరుపై ఎమ్మెల్యేల సీరియస్..

YCP Leaders Fires on CM Jagan : ఉన్న చోట పనితీరు బాలేదనో? అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయనో? ప్రజా వ్యతిరేకత పెరిగిపోతుందనో? ఇలా రకరకాల కారణాలు చూపిస్తూ పలువురు సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టికెట్ లేకుండా చేస్తున్నారు వైసీపీ అధినేత జగన్. కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆఖరికి మంత్రుల నియోజకవర్గాలు మారుస్తున్నారు. అలా స్థాన చలనం కలిగిస్తుండటమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది. అధినేత నిర్ణయాలపై మింగలేక కక్కలేక పోతున్న ప్రజాప్రతినిధులు పలువురు లోలోపల మధన పడుతుంటే.. ఇప్పటికే కొందరు జగన్‌పై ధిక్కార స్వరం వినిపిస్తూ.. తమ దారి తాము చూసుకుంటున్నారు.

Kadapa : వైద్యుల నిర్లక్ష్యం..  మహిళ మృతి.. ఏం జరిగిందంటే ?
Nellore : ఘోర రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ డ్రైవర్ మృతి..
Nara Lokesh : అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. జగన్ పరాకాష్టకు  నిదర్శనం..
Nara Chandra babu : కనిగిరిలో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..

Nara Chandra babu : కనిగిరిలో చంద్రబాబు పర్యటన.. టీడీపీలో చేరిన వైసీపీ నేతలు..

Nara Chandra babu : ప్రకాశం జిల్లా కనిగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండోరోజు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కనిగిరి పార్టీ కార్యాలయం పక్కన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఏడాదిగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్‌ను ఆయన పరిశీలించారు. ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా పైలాన్‌ను ఆవిష్కరించారు. పేదలకు స్వయంగా భోజనాలు వడ్డించారు. కార్యకర్తలు, అభిమానులతో ఫొటోలు దిగారు. టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు రూపొందించిన పాటల సీడీని చంద్రబాబు ఆవిష్కరించారు. […]

ESMA Act : ఏపీలో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. 6 నెలలపాటు సమ్మెలు నిషేధం..

ESMA Act : ఏపీలో అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగం.. 6 నెలలపాటు సమ్మెలు నిషేధం..

ESMA Act : ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ఏపీలో అంగన్‌వాడీలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. సమ్మె చేస్తున్నా ప్రభుత్వంలో చలనం రాకపోడవంతో నిరసనలు తీవ్రం చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించింది. సమ్మెను నిషేధిస్తూ జీవో జారీ చేసింది. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు సేవలను అత్యవసర సర్వీసుల కిందకు ప్రభుత్వం తీసుకొచ్చింది. చిన్న పిల్లలు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడుతుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం […]

Big Stories

×