BigTV English
Mallikarjun Kharge : బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య బంధం.. కాంగ్రెస్ నే గెలిపించాలని ఖర్గే పిలుపు..
Gaddam Prasad Kumar : నేనే ఎమ్మెల్యే.. వికారాబాద్ లో భారీ మెజార్టీతో గెలుస్తా..
Azharuddin : నేనే ఎమ్మెల్యే.. జూబ్లీహిల్స్ లో గెలుపుపై అజారుద్దీన్ నమ్మకాన్ని జనం నిలబెడతారా?
Vijayashanthi : కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి.. కీలక పదవి దక్కే ఛాన్స్..!
Revanth Reddy : కొడంగల్ కు ఇచ్చిన హామీల సంగతేంటి? కేసీఆర్ కు రేవంత్ ప్రశ్నలు..
Rahul Gandhi News:  తెలంగాణలో సుడిగాలి ప్రచారం.. కాంగ్రెస్ కు అధికారం ఖాయం.. రాహుల్ గాంధీ ధీమా..
Congress Manifesto : అభయహస్తం.. 42 పేజీలు.. 67 అంశాలు..  కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల..
Satyavathi Rathod : ప్రలోభాల పర్వం.. హారతి పళ్లెంలో డబ్బులు.. మంత్రిపై కేసు..
KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | కేసీఆర్‌కు భారీ నామినేషన్ల టెన్షన్.. రెండు చోట్ల బాధితుల సెగ!

KCR Poll Competition | ఇక్కడ కాకపోతే ఇందూరులో గెలుస్తాను అన్నారట.. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి నాయకుడు ఒకరు.. అవును ఇప్పుడు ఆయనకి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. గజ్వేల్‌ కాకపోతే కామారెడ్డి అంటూ పోటీ చేస్తుండగా.. ఆ కాక మామూలుగా తగలడం లేదు. రెండు చోట్ల నామినేషన్ల రూపంలో సెగపెట్టారు. గజ్వేల్‌, కామారెడ్డిలో రికార్డు స్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఆయన బాధితులు.. మాటిచ్చి మర్చిపోయారని గుర్తు చేస్తున్న వాళ్లు బరిలో నిలిచారు. చివరకు… ఇక్కడ గెలిస్తే అక్కడ.. అక్కడ గెలిస్తే ఇక్కడ.. ఎక్కడ కొనసాగుతారో తెలియక… చివరకు కేసీఆర్ తీరు రెంటికి చెడిన రేవడిలా మారుతుందేమోనని గులాబీ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : బీఆర్ఎస్ పాలనని ఎండగడుతున్న యూత్ కాంగ్రెస్‌

Telangana Unemployment : తెలంగాణ ఉద్యమంలో అందరికంటే ముందున్నది యువకులు. అందులోనూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులది కీలక పాత్ర. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేవంటూ కదం తొక్కారు. స్వరాష్ట్రం వస్తేనే నియామకాలు జరుగుతాయని బలంగా విశ్వసించారు. వందలాది మంది రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేశారు. మరి వాళ్ల ఆశయాలు, ఆకాంక్షలు నెరవేరాయా? తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా యువతకి ఒరిగిందేంటి? పదేళ్ల గులాబీ పాలనలో ఉద్యోగాల ఊసేఎత్తకుండా.. ఎన్నికల ఏడాది చివర్లో చేసిన హడావుడి TSPSC లీకేజీ వ్యవహారంతో అభాసు పాలైంది. నిరుద్యోగ యువకుల ఆశలు అడియాసలయ్యాయి. కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా మరికొందరు కోచింగ్‌ సెంటర్లలో అప్పులు చేసి చేరి.. ఇప్పుడు కూలీలుగా మారుతున్నారు. ఈ వ్యవహారాలన్నింటిని ప్రశ్నిస్తూ తెలంగాణ యూత్‌ కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది.

Naveen Kumar Yadav | అజారుద్దీన్‌కి మద్దతుగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే!

Naveen Kumar Yadav | అజారుద్దీన్‌కి మద్దతుగా నవీన్‌ కుమార్‌ యాదవ్‌.. కాంగ్రెస్‌కు అన్నీ మంచి శకునములే!

Naveen Kumar Yadav | కాంగ్రెస్‌ పార్టీకి పరిస్థితులు అన్నీ అనుకూలంగా కనిపిస్తున్నాయి. చినుకు చినుకు ఏకమై వరదలా.. నేతలు ఒక్కొక్కరూ కాంగ్రెస్‌ గూటికి చేరుతున్నారు. మజ్లిస్‌-బీఆర్ఎస్‌ కుట్రల వ్యూహాలు గమనిస్తున్న నాయకులు హస్తం కండువా వేసుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో ముఖ్య నేత నవీన్‌ కుమార్‌ యాదవ్‌ అజారుద్దీన్‌కి మద్దతు పలికారు. ఆయన రాకతో హైదరాబాద్‌ పరిధిలోని దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ప్రభావం ఉంటుందని పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవీన్‌ యాదవ్‌కి మంచి రాజకీయ భవిష్యత్‌ కల్పిస్తామన్నారు. ఆయన రాక జూబ్లీహిల్స్‌లో గేమ్‌ చేంజర్‌గా మారనుందని హస్తం నేతలు అంచనా వేస్తున్నారు.

KCR Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రచారంలో జోష్.. కేసీఆర్ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్!

KCR Revanth Reddy | రేవంత్‌రెడ్డి ప్రచారంలో జోష్.. కేసీఆర్ ప్రచారంలో ఫ్రస్ట్రేషన్!

KCR Revanth Reddy | తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్‌ అధినేత కేసీఆర్‌ని అందరూ మోనార్క్‌ అంటారు. ఆయనని ఎవరైనా ప్రశ్నిస్తే అసలు సహించరనే టాక్‌ ఉంది. అది ప్రెస్‌మీట్‌లో రిపోర్టర్లు అయినా… లేదంటే అసెంబ్లీలో విపక్షాలైనా.. క్వశ్చన్‌ చేస్తే అంతెత్తున ఎగిరిపడతారు. అధికార బలాన్ని ప్రయోగిస్తారు. బీఆర్ఎస్‌లో చేరే ముందు ఒకమాట.. చేరిన తర్వాత మరోలా పరిస్థితి ఉంటుందని కేసీఆర్‌ని నమ్మి మోసపోయిన వాళ్లు చెబుతుంటారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎన్నికల ప్రచారంలో మరో ఎత్తుగా కేసీఆర్‌ తీరు ఉంటోంది. ఓటేయాల్సిన ప్రజలని.. నిలబడిన అభ్యర్థులను ఏకి పారేస్తున్నారు. కేసీఆర్‌ ఊగిపోతుండటం చూసిన జనం ఓటమి ఫ్రస్ట్రేషన్‌ కనిపిస్తోందని అంటున్నారు. మరోవైపు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ప్రజలని ఉత్సాహపరుస్తున్నారు. తనతో పాటు మాట కలపాలంటూ జోష్‌ నింపుతున్నారు.

Revuri Prakash Reddy : నేనే ఎమ్మెల్యే.. పరకాలలో విజయంపై రేవూరి విశ్వాసం..
Raja Singh | అలా చేస్తే చంపడానికైనా సిద్ధమే.. బీజేపీ నేతలకే రాజా సింగ్ హెచ్చరిక!

Big Stories

×