Vegetables Summer Storage| వేసవిలో ఎండల కారణంగా కూరగాయలు త్వరగా ఎండిపోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఆకుకూరలైతే ఒకరోజులోనే చెడిపోతాయి. ఇలాంటి సమయంలో ఇంట్లో ఎక్కువగా ఉపయోగించే పుదీన, కొత్తిమీర, కరివేపాకు లాంటివి నిల్వ చేయడం కష్టమైపోతుంది. వేసవిలో అయితే అందరూ శరీరానికి చల్లదనం కోసం వంటకాల్లో పుదీన ఎక్కువగా వినిగిస్తుంటారు. అలాగే పుదీన జ్యూస్ లలో కూడా ఉపయోగిస్తారు. పుదీన వేయడం వల్ల వంటకాల్లో రుచి కూడా మెరుగవుతుంది. పుదీన తరువాత కొత్తిమీర కూడా వంటకాల్లో ఎక్కువగా వాడుతారు. కొత్తిమీర వల్లే ఆహారం రుచి, వాసం మరో లెవెల్ లో ఉంటుంది. అంతేకాదు కొత్తిమీరతో చివర్లో గార్నిష్ చేస్తే చూడడానికి కూడా అందంగా ఉంటుంది.
అయితే కొత్తిమీర, పుదీన వేసవిలో త్వరగా చెడిపోయే అవకాశముంది. అందుకే కొత్తిమీర, పుదీన ఎక్కువ కాలం తాజాగా ఉండేందుకు నిల్వ చేసే సమయంలో జాగ్రత్త వహించాలి. కొత్తిమీర ఫ్రెష్ గా ఉండేలా నిల్వ చేసే విధానాలు ఇవే..
కొత్తిమీరను నిల్వ చేసే ముందు ఒక మంచి కంటెయినర్ ని ఎంచుకోండి. కొత్తిమీర ఆకుని నీటిలో నిల్వ చేస్తే నాలుగు నుంచి అయిదు రోజులు తాజాగా ఉంటుంది. అందుకే ఒక గ్లాసు నీటిలో కొత్తిమీర పెడితే రోజులు గడిచినా అది తాజాగా అలాగే ఉంటుంది.
అలాకాకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్ లో కొత్తిమీర నిల్వ చేయవచ్చు. అయితే అందుకోసం ముందుగా కొత్తిమీరని నీటితో బాగా కడిగేయండి, దాని వేర్లను కట్ చేసేయండి. దాన్ని బాగా ఆరబెట్టండి. తేమ ఉండకూడదు. ఆ తరువాత ఎయిర్ టైట్ బాక్స్ లో టిష్యూ పేపర్ పెట్టండి. ఇప్పుడు అందులో కొత్తిమీర ఆకులు పెట్టండి. ఆ తరువాత బాక్స్ ని గాలి పోకుండా టైట్ గా మూసేయండి. ఆ తరువాత బాక్స్ ని ఫ్రిజ్ లో పెట్టేయండి. బాక్స్ లేకపోతే కొత్తిమీరని ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లేదా కవర్ లో పెట్టవచ్చు.
పుదీనను ఎలా నిల్వ చేయాలి?
పుదీన ఎక్కువ కాలం నిల్వ చేయాలంటే ముందు మంచి క్వాలిటీ పుదీన ఉండాలి. అందు కోసం మార్కెట్ నుంచి తాజాగా ఉండే పుదీన ను కొనుగోలు చేయండి. ఇప్పుడు ఆ పుదీన ఆకులును నీటితో బాగా కడిగేయండి. ఆ తరువాత వాటిని ఆరబెట్టండి. అయితే ఎండలో పెట్టొద్దు. ఆ ఆకులులో తేమ లేకుండా ఆరబెట్టాలి. అందుకోసం ఒక పేపర్ టవల్ లేదా టిష్యూ పేపర్ లో రాప్ చేసి ఆరబెట్టండి. ఆ తరువాత మరో టిష్యూ పేపర్ లో పుదీన రాప్ చేసి ఫ్రీజ్ లో నిల్వ చేయండి. ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టి కూడా నిల్వ చేయవచ్చు. పుదీనపై తేమ అంతా ఎండిపోయిన తరువాత ఒక పేపర్ లో చుట్టేసి దాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో పెట్టేయండి. ఈ విధంగా పుదీన ఆకు ఎక్కువ కాలం ఫ్రెష్ గా నిల్వ ఉంటుంది.