BigTV English

Chhattisgarh: ఈ నెల 22న బంద్ కు నక్సల్స్ పిలుపు ..ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో హైఅలెర్ట్..

Chhattisgarh: ఈ నెల 22న బంద్ కు నక్సల్స్ పిలుపు ..ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో హైఅలెర్ట్..

Chhattisgarh: ఛత్తీస్ గడ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నక్సలైట్లు నిత్యం హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. ఈ నెల 22న నక్సలైట్లు భారత్ బంద్ ప్రకటించారు. సుక్మా జిల్లా నాగారం, కొత్తపల్లి ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్లు పక్క సమాచారం అందడంతో అక్కడకు పోలీసులు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నక్సలైట్లకు మధ్య భీకర ఎదురకాల్పుల జరిగాయి. ఈ ఎదురు కాల్పులలో చాలామంది మావోయిస్టులు మృతి చెందారు.


మావోయిస్టులు బుధవారం రాత్రి 7.30 గంటలకు 30వ జాతీయ రహదారిపై ఒక బస్సు, రెండు వాహనాలకు నిప్పు అంటించారు. ఆ తర్వాత జాగర్ గుండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమర్ గూడలో పికప్ వాహనానికి నిప్పు అంటించారు. ఈ ఘటనలో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగలేదని అందరు క్షేమంగా ఉన్నట్టు రాష్ట్రప్రభుత్వం వెల్లడిచింది. ఈ ఘటనతో రహదారి మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది.స్పెషల్ పోలీసులు ఈ ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

భద్రతా సిబ్బంది మావోయిస్ట్‌లు కోసం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం బంద్ ప్రకటించినప్పుడు కూడా ఏడు వాహనాలకు నిప్పు పెట్టి దగ్ధం చేశారని స్థానిక ప్రజలు తెలిపారు. మావోయిస్టలు వారి ఉనికిని తెలుపేందుకే ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు. ఈ నెల 22న ప్రకటించిన బంద్‌ను విజయవంతం చేయాలని కరపత్రాలు , పోస్టర్లు అంటించి, భారత్ బంద్ కి ప్రతిఒక్కరు సహాకరించాలని , ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అడవిలోకి వెళ్లిపోయారని స్థానికులంటున్నారు. దీంతొ పోలీసులు ఛత్తీస్‌గడ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో హై అలర్ట్ ప్రకటించారు.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×