BigTV English

Dunki Twitter Review : బాద్షా ఖాతాలో ముచ్చటగా మూడో హ్యాట్రిక్ .. డంకీ ట్విట్టర్ రివ్యూ..

Dunki Twitter Review : బాద్షా ఖాతాలో ముచ్చటగా మూడో హ్యాట్రిక్ .. డంకీ ట్విట్టర్ రివ్యూ..
Dunki Movie Twitter Review

Dunki Movie Twitter Review(Bollywood movie news) :

ఐదు సంవత్సరాల గ్యాప్ తీసుకొని వరుసగా రెండు సినిమాలతో కలెక్షన్స్ అదరగొట్టాడు షారుక్. బాలీవుడ్ లో తనని బాద్షా అని ఎందుకు పిలుస్తారో మరొకసారి తన మూవీ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ వద్ద చాటి అందరికీ నిరూపించాడు. ఈ సంవత్సరం అతను నటించిన జవాన్, పఠాన్ చిత్రాలు అప్పటివరకు కలెక్షన్స్ విషయంలో ఆదమరచి ఉన్న బాలీవుడ్ ని ఒక్కసారి నిద్ర లేపాయి. ఈ సంవత్సరం ముచ్చటగా మూడో సినిమా కూడా వేయి కోట్ల కలెక్షన్ దాటించాలి అనే పట్టుదలతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుక్. ఇంతకీ మూవీ ఎలా ఉందో తెలుసా..


ట్విట్టర్ వేదికగా ఎందరో మూవీ గురించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డంకీ జోరు చూస్తుంటే కచ్చితంగా ఇది కూడా 1000 కోట్ల క్లబ్లో చేరిపోతుంది అని అనిపిస్తుంది. ట్విట్టర్ జనాలు ఈ చిత్రాన్ని ఒక అద్భుతం అని వర్ణిస్తున్నారు. ఎప్పటిలాగా హిరానీ టేకింగ్ కి ఎదురు లేదు అని పొగుడుతున్నారు. సినిమాను ఎంతో అద్భుతంగా ముందుకు తీసుకువెళ్లడమే కాకుండా యాక్టర్స్ దగ్గర తనకు కావలసిన పర్ఫెక్ట్ పర్ఫామెన్స్ ని అందిపుచ్చుకోవడం రాజ్ కుమార్ హిరానీకి చాలా బాగా తెలుసు అని పొగుడుతున్నారు.

డంకీ మూవీ ఆడియన్స్ కి సరికొత్త అనుభూతిని అందించడంతోపాటు పక్కా కామెడీతో కడుపుబ్బ నవ్విస్తుంది.. మరోపక్క తీవ్రమైన ఎమోషన్స్ తో మనసు తలుపు తడుతుంది.. అని మరికొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పక్కా బ్లాక్బస్టర్ అవుతుంది అని నెటిజెన్లు నమ్మకంగా చెబుతున్నారు. ఇక ఈ మూవీలో షారుక్ నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరొక నెటిజన్ అయితే ఈ సినిమా పొరపాటున ఫ్లాప్ అయితే నేను నా ట్విట్టర్ అకౌంట్ డిలీట్ చేస్తాను అని నమ్మకంగా చెబుతున్నాడు.


సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఆద్యంతం అద్భుతంగా ఉంది అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో షారుక్ తో పాటు విక్కీ కౌశల్ ,తాప్సి తమ అద్భుతమైన నటన కనబరిచారు. ముఖ్యంగా ఈ మూవీలో ఉన్న ఎమోషన్స్ కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే అని అంటున్నారు. మూవీ లవర్స్ అయితే పొరపాటున కూడా ఈ మూవీని మిస్ చేసుకోవద్దు అని సలహా ఇస్తున్నారు నెటిజన్స్ . ఇప్పటివరకు ట్విట్టర్లో సినిమాకి సంబంధించి అన్ని పాజిటివ్ ట్వీట్స్ వస్తున్నాయి. నెగిటివ్ ట్వీట్స్ ఎక్కడా లేవు.. దీంతో మూవీ క్లీన్ సక్సెస్ సాధించి షారుఖ్ హ్యాట్రిక్ హిట్ గా మిగులుతుంది అని అందరూ అనుకుంటున్నారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×