E-Paper
Advertisement

బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం

బోర్డు ఒకరిది.. ప్రచారం ఇంకొకరిది.. సిల్వర్ జూబ్లీ పేరుతో త్రి విద్య కళాశాల మాయాజాలం
Advertisement

Illegal Admissions: స్వేచ్ఛ బ్యూరో: మేడ్చల్ త్రి విద్య ముసుగు తీయరా అన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్బోర్డు అధికారుల పట్టింపు లేని వైఖరితో త్రి విద్య యాజమాన్యం రెచ్చిపోతుంది. విస్తృత ప్రచారంతో ప్రవేశాలను సాగిస్తుంది. అనైతికంగా వ్యవహరిస్తున్న యాజమాన్యంపై స్థానికులు, విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మేడ్చల్ డివిజన్ పరిధిలో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన త్రి విద్య యజమాన్యం తీరు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ప్రవేశాలు పొందిన వారు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తుండగా, కొత్తగా కళాశాలను ఎంచుకునే వారు వెనుకడుగు వేసే పరిస్థితి ఏర్పడింది. అనుమతిలేని కళాశాల ఎలా ప్రవేశాలు తీసుకుంటుందని ప్రశ్నిస్తున్నారు.

భయపడేదే లేదు

త్రి విద్య కళాశాలకు అనుమతి లేని విషయం బట్టబయలు అయినా నాకేంటి భయం, మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు అన్న రీతిలో వ్యవహరిస్తుంది. జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసుకున్న కళాశాలకు త్రి విద్య కళాశాల పేరుతో భారీ ఫ్లెక్సిలను ఏర్పాటు చేసింది. విద్యార్థి సంఘాల ఆందోళన చేసినా, పలు పత్రికల్లో కళాశాలకు అనుమతి లేదని కథనాలు ప్రచురించినా యాజమాన్యం ఏమాత్రం స్పందించడం లేదు. తాము సిల్వర్ జూబ్లీ కళాశాల రిజిస్ట్రేషన్ను కొనుగోలు చేశామని చెపుతున్నా ఆ పేరును ఎక్కడా వాడటం లేదు. దానిమీద కూడా అనేక సందేహాలు ఉన్నాయి. ఒకవేళ అధికారికంగా వారు రిజిస్ట్రేషన్ ను సొంతం చేసుకున్నారని అనుకున్నప్పటికీ దానికి త్రి విద్య ముసుగు వేసే ప్రచారం సాగిస్తున్నారు.

Advertisement

Also Read: స్టేట్ టాపర్.. అవినీతిలో నంబర్ 1.. ఆరు నెలలకే ఏసీబీకి దొరికిపోయిన యువ అధికారిణి!

అనుమతి లేకుండా..

మేడ్చల్ పరిసర ప్రాంతాల్లో త్రి విద్య కళాశాలకు అనుమతి లేని పత్రికల్లో వచ్చిన కథనాలతో ప్రచారం జరిగినా తగ్గేది లేదంటూ యాజమాన్యం మాత్రం తన పని తాను కానిచ్చేస్తుంది. కళాశాలకు ఉన్న బోర్డులను తొలగించడం లేదు. అక్రమంగా పొందిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్లకు ఫోన్ చేస్తూ ప్రవేశాలు తీసుకోవాలని ప్రచారం నిర్వహిస్తుంది. కళాశాలకు అనుమతి లేదని తెలియడంతో ఇప్పటికే కళాశాలలో ప్రవేశం తీసుకున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితి ఏమిటిని వాకలు చేస్తున్నట్టు సమాచారం. తమ కళాశాల పేరు మీద అనుమతి రాకుంటే సిల్వర్ జూబ్లీ కళాశాల పేరుతో అనుమతి ఉంటుందని నచ్చచెపుతుంది. కానీ మనుగడ లేని కళాశాల కొనుగోలు చేసి, దానికి త్రి విద్య ముసుగు వేయడం అనైతికమే కదా కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి పనులు చేస్తున్న యాజమాన్యం భవిష్యత్లోవిద్యార్థులకు ఏం నేర్పుతుందని అంటున్నారు.

చర్యలు మృగ్యం

Advertisement

మేడ్చల్ డివిజన్లో లో జాతీయ రహదారి పక్కన ఏర్పాటు చేసిన త్రి విద్య జూనియర్ కళాశాలకు అనుమతులు లేకున్నా, కళాశాల భవన నిర్మాణం ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నా ఇంటర్ బోర్డు అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కళాశాలను నిర్వహించడానికి భవనానికి కావాల్సిన అనుమతులు కూడా ఇంకా రాలేదు. పూర్తి స్థాయిలో భవనం పూర్తయిన తర్వాతనే అగ్నిమాపక, ట్రాఫిక్, స్థానిక సంస్థలు అనుమతులు జారీ చేస్తాయి. కానీ ఇవేమి లేకుండానే యాజమాన్యం విస్తృతంగా ప్రచారం చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. ఇకనైనా కళాశాల తీరుపై విచారణ జరిపి, అక్రమాలపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Also read: అసలే ఆలస్యం, ఆపై నో ఏసీ.. ప్రయాణీకులకు చుక్కలు చూపించిన ఇండిగో!

Related News

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×