
Rakhi: ఆడపిల్లలకు తల్లి, తండ్రి తర్వాత అంతే బాధ్యతగా ఉండే వ్యక్తి సోదరుడు. అందుకే, ఎంత దూరంగా ఉన్నా సరే.. రాఖీ పండగ నాడు సోదరుడి దగ్గరకు వెళ్లి మరీ రాఖీ కడతారు. అన్నా చెల్లెల్లు, అక్కా తమ్ముళ్లు కలుసుకుని అప్యాయంగా ఉంటారు. బ్రదర్‌కు రాఖీ కట్టి తమకు రక్షగా ఉండాలని కోరుకుంటారు.
అయితే చాలా మంది వయసు పైబడ్డాక రాఖీ పండుగపై అంతగా ఆసక్తి చూపించరు. ఇంకా ఏం వెళ్తాంలే అనుకుంటారు. కానీ 80 ఏళ్ల వృద్ధురాలు మాత్రం.. వృద్ధాప్యాన్ని సైతం లెక్కచేయకుండా తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఏకంగా 8 కిలోమీటర్లు నడిచి వెళ్లింది.
కరీంనగర్ జిల్లా కొత్తపల్లికి చెందిన వృద్ధురాలు.. కొండయ్యపల్లి వరకు నడుచుకుంటూనే వెళ్లింది. మండుటెండలో కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేకుండా పయనమైంది. ఎంతో సంతోషంతో తన తమ్ముడికి రాఖీ కట్టాలనే ఆశతో.. నడుం ఒంగిపోయే స్థితిలో ఉన్నప్పటికీ చేతిలో ఓ సంచి పట్టుకుని బయల్దేరేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో.. నిజమైన ప్రేమకు నిదర్శనమంటున్నారు నెటిజన్లు.