
Nayanthara: తొలి పోస్ట్‌తోనే ఇన్‌స్టాగ్రామ్‌ను షేక్ చేస్తోంది నయనతార. ఇన్‌స్టాలో అకౌంట్ ఓపెన్ చేసిన నయన్.. తన కవల పిల్లల్ని తొలిసారి చూపించారు. పిల్లలిద్దర్నీ ఎత్తుకుని గది నుంచి బయటికి వచ్చి.. జైలర్ సినిమాలోని పాటను హమ్ చేస్తూ.. రీల్‌లో కనిపించారు.
నయన్ ఇలా ఇన్‌స్టా అకౌంట్ ప్రారంభించిందో లేదో.. అప్పుడే లక్షల సంఖ్యలో అభిమానులు ఆమెను ఫాలో అవుతున్నారు. నయన్ పెట్టిన రీల్‌కు ఇప్పటికే లక్షల సంఖ్యలో వ్యూస్, లైక్స్ వచ్చేశాయి.
ఇన్‌స్టాలో నయన్‌ను లక్షల మంది ఫాలో అవుతుంటే.. ఆమె మాత్రం కేవలం ఐదు అకౌంట్లను మాత్రమే ఫాలో అవుతున్నారు. తన భర్త విఘ్నేష్ శివన్, హీరో షారుఖ్‌ఖాన్, సంగీత దర్శకుడు అనిరుధ్, మిషెల్లి ఒబామా, ది రౌడీ పిక్చర్స్ సంస్థ అకౌంట్లను మాత్రమే నయనతార ఫాలో అవుతోంది.
ఆమె నటించిన జవాన్ సినిమా ట్రైలర్‌ను కూడా ఇన్‌స్టాలో పంచుకున్న నయన్.. అభిమానులు సినిమాను ఆదరిస్తారని ఆశిస్తున్నట్లు రాసుకొచ్చారు.