BigTV English

Property tax: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..

Property tax: హైదరాబాదీలకు శుభవార్త.. ప్రాపర్టీ ట్యాక్స్ పై భారీ డిస్కౌంట్..
Advertisement

Property tax telangana


Property tax telangana(Hyderabad latest news): హైదరాబాద్ లో ప్రావర్టీ ఉన్నవారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పేరుకుపోయిన ఆస్తిపన్ను బకాయిలపై విధించే వడ్డీపై 90శాతం మాఫీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. జీహెచ్ఎంసీ పరిమితుల్లోని ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులకు అలాగే వన్ టైమ్ స్కీమ్ కింద ఇతర యూఎల్బీలకు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ ప్రయోజనాన్ని పొందేందుకు, పన్ను చెల్లింపుదారులు 2022-2023 ఆర్తిక సంవత్సరం వరకు ఆస్తి పన్ను బకాయిల ప్రధాన మొత్తాన్ని తప్పని సరిగ్గా క్లియర్ చేయాల్సి ఉంటుంది. అలాగే పేరుకుపోయిన బకాయిలపై వడ్డీపై 90 శాతం రాయితీపోగా మిగిలిన 10 శాతం వడ్డీని ఒకే సారి చెల్లించాలి. అయితే ఈ పథకం అమలుకు ముందు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 2023 వరకు వడ్డీ, పెనాల్టీలతో సహా మొత్తం ఆస్తి పన్ను బకాయిలను ఇప్పటికే సెటిల్ చేసిన పన్ను చెల్లింపుదారులకు కూడా పథకం ప్రయోజనాలు అందనున్నాయి.


రాష్ట్ర ప్రభుత్వం చెల్లించని లేదా తిరిగి అంచనా వేసిన పన్నులపై వడ్డీని 90 శాతం మినహాయిస్తూ వన్-టైమ్ సెటిల్ మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 1,000 చదరపు అడుగుల లోపు స్వీయ-ఆక్రమిత నాన్ ఆర్సీసీ నివాస ఆస్తుల ఎగవేసిన పన్నులో 25శాతం మాత్రమే పెనాల్టీగా చెల్లించవచ్చు. విచారణ జరిపి డిఫాల్టర్లను గుర్తించేందుకు ఐఏఎస్ అధికారులను బీబీఎంపీ రెవెన్యూ కమీషనర్లుగా నియమించారు.

Read More: అరుదైన గౌరవం.. ఆ జాబితాలో జగన్ కంటే సీఎం రేవంతే పవర్ ఫుల్..

తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లు కూడా వసూలు చేసేందుకు రాయితీ ప్రకటించింన సంగతి అందరికీ తెలిసిందే. టూ వీలర్స్, త్రీవీలర్స్ పై 80 శాతం రాయితీ విధించింది. కార్లతో పాటు ఇతర వాహనాలకు 60శాతం రాయితీ, ఆర్టీసీ బస్సులపై 90శాతం రాయితీని ప్రకటించింది. దీని ప్రభుత్వానికి రూ. 100 కోట్లకు పైగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది.

 

Related News

CM Revanth Reddy: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. బీఆర్ఎస్, బీజేపీలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

TG Wine Shops: తెలంగాణ మద్యం షాపుల టెండర్ల గడువు పెంపు.. ఏపీ మహిళ 150 దరఖాస్తులు!

BIG TV Free Medical Camp: ప్రజా సేవే లక్ష్యంగా.. బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపు

Worms In Mysore Bonda: షాకైన కస్టమర్.. మైసూర్ బోండాలో పురుగులు..

Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్ ప్లాన్ బి.. మరో నామినేషన్ వేయించిన గులాబీ పార్టీ

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద బుల్లెట్ కలకలం.. రంగంలోకి దిగిన పోలీసులు

Kavitha: భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాగృతి అధ్యక్షురాలు కవిత

Hyderabad: ఇదెక్కడి వింత రా బాబు.. చిల్లర కోసం బస్సు ముందు ధర్నా..

Big Stories

×