Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో స్టేషన్‌లో ఓ ప్రయాణికుడు వద్ద.. 9 ఎంఎం బుల్లెట్లు లభ్యమయ్యాయి. దీంతో సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్‌కు చెందిన మహమ్మద్ అనే యువకుడు, ప్రస్తుతం ప్రగతినగర్–మూసాపేట్ ప్రాంతంలో ఫ్యాబ్రికేషన్ వర్కర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు ఓ బ్యాగ్‌తో మూసాపేట్ మెట్రో స్టేషన్‌కు వచ్చాడు. మెట్రోలో ఎక్కే ముందు భద్రతా తనిఖీలు జరుగుతుండగా, మెటల్ డిటెక్టర్ అలారం మోగడంతో సిబ్బంది అతని లగేజ్‌ను పరిశీలించారు.
ఈ క్రమంలో ఆ బ్యాగ్‌లో ఒక 9 మిల్లీమీటర్ బుల్లెట్ దొరికింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని అక్కడే ఆపి పోలీసులను సమాచారం ఇవ్వడంతో.. అక్కడికి చేరుకుని మహమ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు.
కూకట్‌పల్లి పోలీసులు ఆ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మహమ్మద్ పనిచేస్తున్న ఫ్యాబ్రికేషన్ యూనిట్, అతడు నివసిస్తున్న ప్రదేశం, అతడి సహచరులను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
Also Read: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం మంత్రి లోకేష్ విజ్ఞప్తి
ఈ ఘటనపై హైదరాబాద్ మెట్రో రైల్వే అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా.. ఉండేందుకు మెట్రోలో భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయించారు. అలాగే ప్రయాణికులు బ్యాగులు లేదా వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో ధృవీకరించుకోవాలని హెచ్చరించారు. ప్రస్తుతం కూకట్‌పల్లి పోలీసులు మహమ్మద్‌ను విచారిస్తున్నారు. బుల్లెట్లు ఎక్కడినుంచి వచ్చాయి అన్నదానిపై ఆరా తీస్తున్నారు.