Neclear War: ఉక్రెయిన్ లో తమ లక్ష్యాలను సాధించి తీరతామని రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి స్పష్టం చేశారు. ఈ యుద్దంలో అతిగా జోక్యం చేసుకోవడం వంటి చర్యలు.. ప్రపంచ అణు సంఘర్షణ ముప్పుతో నిండి ఉన్నాయని పశ్చిమ దేశాలను హెచ్చరించారు. వచ్చే నెలలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆయన దేశ ప్రజలనుద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
మాస్కో తన భద్రతను, సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకుంటోందన్నారు. ఉక్రెయిన్ లోని తమ వారిని కాపాడుతోందని పేర్కొన్నారు. కీవ్ లోని నిస్సైనికీకరణ జరిగేలా చూసి, నాటో లో చేరకుండా చేయడం తన లక్ష్యమని పుతిన్ పలుమార్లు చెప్పిన సంగతి తెలిసిందే.
పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ కు బలగాలను తరలించాలనుకోవడం తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని పుతన్ అన్నారు. వారి భూభాగాల్లోని లక్ష్యాలను చేధించగల ఆయుధాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఆ దేశాల నాయకులు ఇప్పటి వరకు ఎటువంటి కఠినమైన సవాళ్లను ఎదుర్కోలేదన్నారు. యుద్దం అంటే ఏంటో వారు మర్చిపోయారని పుతిన్ విరుచుకపడ్డారు. భవిష్యత్తులో ఉక్రెయిన్ లో పాశ్చాత్య బలగాల మోహరింపు అంశాన్ని కొట్టి పారేయలేమని ప్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై పుతిన్ ఈ మేరకు స్పందించినట్లు తెలుస్తోంది. ఐరాపోలోని నాటో దేశాలకు రష్యా నుంచి ముప్పు పొంచి ఉందన్న ఆరోపణలు అసంబద్దమైనవిగా పేర్కొన్నారు.
Read More: కెనడాలో అదృశ్యమవుతోన్న పాకిస్థాన్ ఎయిర్ హోస్టెస్‌లు.. అసలేం జరుగుతోంది
అంతరిక్షంలో ఉపగ్రహ విధ్వంసకర ఆయుధాన్ని రష్యా అభివృద్ది చేస్తున్నట్లు అగ్రరాజ్యం చేసిన ఆరోపణలను పుతిన్ తోసిపుచ్చారు. యుద్దంలో తమ ఓటమి కోసం వాషింగ్టన్ తన ప్రయత్నాలు కొనాగిస్తోందన్నారు. తన నిబంధనల మేరకు రూపొందించిన అణ్వాయుధ నియంత్రణ ఒప్పందం పై మాస్కో ను చర్చలకు రపపించే కుట్రలో భాగమే ఇదంతా అని పుతిన్ మండిపడ్డారు. అధ్యక్ష ఎన్నికల వేళ.. ప్రపంచాన్ని తాము పాలిస్తున్నామని చాటి చెప్పేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. కానీ అది పని చేయదన్నారు పుతిన్.