Medak News: మెదక్ జిల్లాలో ఘోరం జరిగింది. ఓ ఫ్యామిలీ కోర్టు భవనంపై నుంచి దూకి కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో భార్య స్పాట్ లో మృతి చెందగా, భర్త, ఇద్దరు పిల్లలకు తీవ్రగాయాలు అయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగింది.
అసలేం జరిగింది?
మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్‌కు చెందిన రాజమణి-బాలరాజు గౌడ్ పెళ్లయ్యింది. ఈ దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు రమ్యను సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ గ్రామానికి చెందిన నవీన్ గౌడ్‌తో వివాహం జరిగింది. ఏడేళ్ల కిందట వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నవీన్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.
వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అయితే ఏం జరిగిందో తెలీదుగానీ కొన్నేళ్లుగా భార్యభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు తారాస్థాయికి చేరాయి. భార్యను కాపురానికి పంపకపోవడంతో ఆగ్రహించాడు. ఆ తర్వాత తాగుడుకు బానిసయ్యాడు భర్త. చివరకు లక్ష్మాపూర్ వెళ్లి అత్తింటిపై బాంబులు వేశాడు.
వెంటనే రమ్య పేరెంట్స్ రామాయంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, కేసు కావడం జరిగిపోయింది. ఈ కేసులో నవీన్ జైలుకు వెళ్లాడు. అయితే శనివారం ఫ్యామిలీ కేసు విచారణలో భాగంగా మెదక్ కోర్టుకు నవీన్-రమ్య దంపతులతోపాటు ఇద్దరు కూతుళ్లు వచ్చారు. ఈ క్రమంలో కోర్టు పరిసరాల్లో భార్యభర్తలు గొడవపడ్డారు.
ALSO READ: మొబైల్ పట్టుకోడట, అందుకే రికార్డు బద్దలు కొట్టాడు
రాత్రి తొమ్మిది గంటల సమయంలో న్యాయస్థానం భవనంపై నుంచి భార్యభర్తలు, ఇద్దరు పిల్లలు దూకేశారు. ఈ ఘటనలో రమ్య స్పాట్‌లో మృతి చెందింది. నవీన్, ఇద్దరు కూతుళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి. ఘటన గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. బాధితులకు చికిత్స అందించిన మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. భార్య, ఇద్దరు పిల్లలను కోర్టు బిల్డింగ్ పై నుంచి భర్త నెట్టేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితులు కోలుకున్న తర్వాత గానీ అసలు విషయం బయటపడదని అంటున్నారు.