E-Paper
Advertisement

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!

ఉత్తరాఖండ్‌లో హస్తం షాక్.. పీఏ ఇంట ED దాడులు.. పదవులకు హరీశ్ రావత్ రాజీనామా!
Advertisement

Harish Rawat: ఉత్తరాఖండ్‌ రాజకీయాల్లో మునుపెన్నడూ లేని విధంగా కలకలం రేపిన పరిణామం ఇది. రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బగా మారింది. కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌ రావత్.. తన రాజకీయ పదవులకు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. UPCC ఎగ్జిక్యూటివ్‌ సభ్యత్వంతో పాటు, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ వర్కింగ్‌ కమిటీ శాశ్వత ఆహ్వానితుడి పదవిని కూడా ఆయన వదులుకుంటున్నట్లు ప్రకటించారు.

మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు ముమ్మరం

Advertisement

ఉత్తరాఖండ్‌లో గతంలో జరిగిన సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ కమిషన్, గ్రామ పంచాయతీ వికాస్ అధికారి రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలున్నాయ్. దీనికి సంబంధించిన మనీలాండరింగ్ కేసుపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా.. హరీశ్‌ రావత్ పీఏ చందన్‌ సింగ్‌ జీనా నివాసంలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో లెక్కచూపని 32 లక్షల నగదుతో పాటు, 200 గ్రాముల బంగారు ఆభరణాలు, బ్రాండెడ్ లగ్జరీ వాచ్‌లు బయటపడ్డాయ్. అంతేకాదు.. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాల్లోని 52 లక్షలను కూడా ఫ్రీజ్ చేశారు. తన పీఏ ఇంటిపై ఈడీ రైడ్స్ జరగడం, భారీగా నగదు లభించడంపై హరీశ్ రావత్ స్పందిస్తూ.. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన వల్ల పార్టీకి ఎలాంటి మచ్చ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

హరీశ్ రావత్ తీసుకున్న అనూహ్య రాజీనామా

Advertisement

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. హరీశ్ రావత్ తీసుకున్న అనూహ్య రాజీనామా నిర్ణయం.. కాంగ్రెస్ శ్రేణులను నైతికంగా ఇరుకున పెట్టింది. అధికార బీజేపీ దీనిని అస్త్రంగా మలుచుకుంటున్న వేళ.. హస్తం పార్టీ ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటుంది? రానున్న రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయన్నది ఆసక్తి రేపుతోంది.

Also Read: హారన్ కొట్టాడని బస్సెక్కి డ్రైవర్‌ను బాదేశాడు.. పెనుమాకలో బైకర్ దౌర్జన్యం!

Tags

Related News

భారత రాజకీయాలకు టర్నింగ్ పాయింట్ 1980.. ఇందిరా గ్రాండ్ రీఎంట్రీ, బీజేపీ ఆవిర్భావం!

1980sలో విశాఖ ఉక్కు ఎలా ఏర్పాటయ్యిందంటే.. కళ్లకు కట్టినట్లు చూపించిన ‘బిగ్ టీవీ’

పులిహోరను తిరుమలలో ఏమని పిలుస్తారో మీకు తెలుసా.. శ్రీవారి 45 రకాల ప్రసాదాలు ఇవే?

ఇది మా అసెంబ్లీ.. మాక్‌ అసెంబ్లీ.. ! బీఆర్‌ఎస్‌ మాక్‌ అసెంబ్లీ ఫుల్ కామెడీ…! సీరియస్ రచ్చ ఇలా నవ్వుల పాలు..

విశాఖ మున్సిపల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. ప్రజలు ఎక్కువగా కోరుతున్న కోరిక ఇదే?

తెలుగు దేశం పార్టీ ఆవిర్భావం.. 80’sలో ఎన్టీఆర్ సంచలనం, అంతలోనే సంక్షోభం!

లేటుగానైనా మధుయాష్కీకి మంచి గుర్తింపు.. ఢిల్లీ పెద్దలతో సత్సంబంధాలు.. కలిసివచ్చిన వేళ..!

Big Stories

Advertisement
×