అది 1960 s టైం.. విశాఖ ఉక్కు మన హక్కు అంటూ పల్లె, పట్నం తేడా లేకుండా ఏపీ అంతా ఒకే విప్లవ తీరంగా మారింది. అమృతరావు ఆమరణ నిరాహార దీక్ష, విద్యార్థుల రోడ్డెక్కడం, పోలీసుల కాల్పుల్లో 32 మంది ప్రాణాలు అర్పించడం.. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని గజగజ వణికించాయి. ‘మా ప్రాణాలైనా ఇస్తాం కానీ.. విశాఖ ఉక్కును సాధించి తీరుతాం’ అని తెలుగు జాతి నినదించింది. ఈ మాసివ్ పబ్లిక్ ప్రెజర్ తట్టుకోలేక, అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ పార్లమెంట్ లో విశాఖలోనే స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని అనౌన్స్ చేయాల్సి వచ్చింది!
అనౌన్స్‌మెంట్ ఐతే వచ్చింది కానీ, ఆ తర్వాత అసలు కథ స్టార్ట్ అయింది! ఫండ్స్ లేవని, టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అప్పటి కేంద్రం సాకులు చెబుతూ ప్లాంట్ పనులను డిలే చేస్తూ వచ్చింది. దాంతో పబ్లిక్‌లో మళ్ళీ ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరింది. నిరసనలు, పొలిటికల్ ప్రెజర్ పెరగడంతో.. ఇక లాభం లేదనుకుని 1980స్ స్ట్రార్టింగ్ లో కన్ స్ట్రక్షన్ పనుల్లో స్పీడ్ పెంచారు. రౌండ్ ది క్లాక్ వర్క్స్ తో విశాఖ తీరంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం ఒక మాసివ్ గేమ్‌చేంజర్‌లా ఊపందుకుంది.
ఈ మాస్ మొమెంటమ్ తోనే.. ప్లాంట్ మేనేజ్‌మెంట్ అండ్ ఆపరేషన్స్ కోసం ఒక సపరేట్ కార్పొరేట్ ఎంటిటీ అవసరమని గవర్నమెంట్ డిసైడ్ అయింది. దానికి రిజల్టే 1982, ఫిబ్రవరి 18న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ ఫార్మేషన్. పోరాటాల నుంచి పుట్టిన ఈ కార్పొరేట్ జెయింట్, కొద్దికాలంలోనే క్వాలిటీ స్టీల్ ప్రొడక్షన్ లో ఇండియాలోనే ఒక ల్యాండ్ మార్క్ బ్రాండ్ గా మారింది. వేలమందికి ఎంప్లాయ్‌మెంట్ ఇస్తూ, వైజాగ్ సిటీ ఫేస్ మార్చేసి, నార్త్ ఆంధ్రా ఎకానమీకి మెయిన్ బ్యాక్‌బోన్ గా నిలిచింది
విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనేది కేవలం ఒక ప్లాంట్ నిర్మాణం మాత్రమే కాదు.. అది తెలుగువారి ఆత్మగౌరవ పోరాటానికి ఒక సజీవ సాక్ష్యం! 32 మంది త్యాగాల పునాదుల మీద, ప్రజా ఆందోళనల పవర్ తో సాధించుకున్న ఈ ప్రైడ్ ఆఫ్ ఆంధ్రా.. ఈరోజు RINL గా నిలబడిందంటే దానికి కారణం నాటి ప్రజల ఉక్కు సంకల్పమే! హిస్టరీ పేజీల్లో ఎన్ని చాప్టర్లు మారినా.. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విక్టరీ స్టోరీ మాత్రం ఎప్పటికీ ఎవర్ గ్రీన్!
Also Read: అంతరిక్షం అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!
Also Read: 80ల్లో సైకిల్ ఉంటే అదో గొప్ప.. అప్పటి నిబ్బాలు చేసే విన్యాసాలకు నిబ్బీలు ఫిదా!