ACB Raids On Suryapet DSP: సూర్యాపేట DSP పార్థసారథి ACB కేసులో ఇప్పుడు కొత్త ట్వీస్ట్‌లు వెలుగులోకి వస్తున్నాయి. అయిన దగ్గర కొన్ని బుల్లెట్స్ ఉన్నట్లుగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. సూర్యాపేట DSP లంచం డిమాండ్ చేసి ACB అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత అయిన నివాసంతో పాటు అయన బంధువుల నివాసంలో కూడా సోదాలు చేశారు. హయత్ నగర్‌లోని దత్తాత్రేయ కాలనీలో అయిన నివాసంలో సోదాలు చేసిన ACB అధికారులు భారీగా ఆస్తుల డాక్యుమెంట్లు గుర్తించారు. ఆ తర్వాత అందులో కొన్ని బుల్లెట్స్ గుర్తించారు. దాదాపు అందులో 26 లైవ్ రౌండ్ బుల్లెట్స్, 60పైన వాడిన బుల్లెట్లు గుర్తించడం జరిగింది. మొత్తం మీద అయిన ఇంట్లో 96 బుల్లెట్లు గుర్తించడం జరిగింది.
అయితే ఈ బుల్లెట్లను పార్థసారథి ఎందుకు ఉంచుకున్నాడు అనే దాని పై హయత్ నగర్ పోలీసులు ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అయిన కానిస్టేబుల్ నుంచి కూడా పని చేశారు. అప్పటి నుంచి తన దగ్గర బుల్లెట్స్ పెట్టుకున్నాడు. కానీ ఎప్పటికప్పుడు తాను బుల్లెట్స్ తీసుకున్నా.. రిటర్న్ ఇచ్చిన లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇతను లెక్క లేకుండా ఇన్ని బుల్లెట్స్ ఇంట్లో ఎలా పెట్టుకున్నారు.. దీని సహకరించింది ఎవరు.. ఇవి పోలీస్ డిపార్ట్‌మెంట్ బుల్లెట్ సేనా.. లేదంటే వేరే దగ్గర నుంచి ఏమైనా కొనుగోలు చేశారా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడా జైలులో ఉన్న పార్థసారథి PT వారెంట్ పై తీసుకుని హయత్‌నగర్ పోలీసులు పూర్తి స్థాయిలో విచారించే అవకాశం ఉంది.
కాగా, ఓ మెడికల్ కేసు విషయంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ వీరరాఘవులు రూ.25 లక్షలు డిమాండ్ చేశారు. మొదటి విడతలో రూ.16 లక్షల చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. అయితే అనేక అవినీతి ఆరోపణలు పార్థసారథి.. అలాగే టౌన్ CI రాఘవులును ఇద్దిరిని ACB అధికారులు అరెస్ట్ చేశారు. అయితే ప్రస్తుతం హయత్‌నగర్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి లోతైన దర్యాప్తు చేస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఎవరైన పోలీసు అధికారులకు ఒక రివాల్వర్ ఇస్తే అందులో బుల్లెట్స్ మాత్రమే ఉంటాయి. అది వాడిన తర్వాత ఎప్పటికప్పుడు లెక్కలు చెప్పాల్సి ఉంటుంది. కానీ ఏకంగా ఇన్ని సంవత్సారల నుంచి వాటిని ఎందుకు రిటర్న్ ఇవ్వలేదు అనే దానిపై హయత్‌నగర్ పోలీసులు ఇన్వస్టిగేషన్ చేసే అవకాశం ఉంది అంటున్నారు.
అంతేకాకుండా పార్ధ సారధి ఇంట్లో దొరికిన బుల్లెట్లు ఎక్కడివి..? ఆయన ఇంట్లో ఎందుకు ఉన్నాయి..? యూజ్ చేసిన బుల్లెట్స్ ఎక్కడవి..? వాటిని ఎక్కడ ఉపయోగించారు..? అనే కోణంలో పోలీసులు, ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.