BigTV English

Formula E Race Scandal: కేటీఆర్‌కు మళ్లీ నోటీసు..! ఈసారి అరెస్ట్ ఖాయం?

Formula E Race Scandal: కేటీఆర్‌కు మళ్లీ నోటీసు..! ఈసారి అరెస్ట్ ఖాయం?

Formula E Race Scandal: ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఈ కేసులో ముగ్గురు నిందితుల ఇచ్చిన ఆధారాలేంటి? ఎవరి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోంది? ఎందుకు మళ్లీ నోటీసు ఇవ్వాలని ఏసీబీ భావిస్తోందా? ఈసారి కేటీఆర్‌కు నోటీసులిస్తే అరెస్టు ఖాయమా? అవుననే సంకేతాలు ప్రభుత్వ వర్గాల నుంచి బలంగా వినిపిస్తోంది.


హైదరాబాద్ ఫార్ములా ఈ రేసు కుంభకోణంలో మరో అంకం మొదలుకానుంది. నిందితులైన కేటీఆర్, ఐఏఎస్ అరవింద్ కుమార్, మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్‌రెడ్డి విచారించింది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా ఏస్ నెక్ట్స్ జెన్ కంపెనీ డైరెక్టర్ అనిల్‌కుమార్‌ను శనివారం కేవలం మూడున్నర గంటల సేపు మాత్రమే విచారించింది. వారిచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా విశ్లేషణ చేస్తున్నారు ఏసీబీ అధికారులు.

నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్ల పరిశీలిస్తున్న అధికారులకు కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురు వేళ్లు కేటీఆర్ వైపు చూపిస్తున్నాయి. దీంతో మరోసారి కేటీఆర్, అరవింద్ కుమార్, బీఎల్ఎన్‌రెడ్డిలను విచారించాలని భావిస్తోంది. దీనికి సంబంధించి రేపో మాపో నోటీసులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


రేసు నిర్వహణలో స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్ట్స్ జెన్ డైరెక్టర్ అనిల్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ల ఇప్పటికే పరిశీలించారు అధికారులు. ఆయన ఇచ్చిన ఆధారాలు, గతంలో లభించిన వివరాలతో మళ్లీ విచారించాలన్నది ఏసీబీ అధికారుల ఆలోచన. మంత్రిగా తాను ఆదేశాలు జారీ చేశానని, అయితే నిధుల చెల్లింపు వ్యవహారం పూర్తిగా అధికారుల వంతని పలుమార్లు కేటీఆర్ వెల్లడించిన విషయం తెల్సిందే.

ALSO READ: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులు చిక్కడం ఖాయం, కొత్త చట్టమేంటి?

ఫార్ములా ఈ రేసు కేసు విచారణ కోసం గవర్నర్ నుంచి అనుమతి రావడానికి చాలా సమయం పట్టింది. అందుకు కారణాలు లేకపోలేదు. దీనిపై గవర్నర్.. కేంద్ర సొలిసిటర్ జనరల్ నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ఆయన అన్నికోణాల్లో పరిశీలించిన తర్వాత ఉల్లంఘనలు జరిగినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఆయన ఓకే చెప్పడంతో విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్.

ఈ పరిణామాల నేపథ్యంలో గవర్నర్ విచారణకు పర్మిషన్ ఇవ్వడంతో వెంటనే ఈడీ రంగంలోకి దిగేసింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తులో నిమగ్నమైంది. వివరాలు సైతం తీసుకుంది. ప్రస్తుతం నిందితులు ఇచ్చిన వివరాలను క్రోడీకరిస్తున్నారు. త్వరలో కొంతమందిని ఈడీ పిలిచే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.

Related News

KTR: తెలంగాణ ప్రజలపై రూ.15వేల కోట్ల భారం.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

Hyderabad Rains: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. నార్శింగ్-హిమాయత్‌‌సాగర్ సర్వీస్ రోడ్డు క్లోజ్..

Weather News: మరో రెండు రోజుల భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన, బయటకు వెళ్తే అంతే సంగతులు

BC Reservations: స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు.. ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ

Hyderabad Musi River: మూసీ నదికి పోటెత్తిన వరద.. మునిగిన హైదరాబాద్.. హై అలర్ట్!

BRS KTR: నన్ను ఇప్పుడంటే ఇప్పుడు అరెస్ట్ చేసుకోండి.. నేను దేనికైనా రెడీ: కేటీఆర్

ED raids Hyderabad: లగ్జరీ కార్ల స్మగ్లింగ్ కేసు.. బసరత్ ఖాన్ ఇంట్లో ఈడీ సోదాలు

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

Big Stories

×