BigTV English

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులు చిక్కడం ఖాయం, కొత్త చట్టమేంటి?

Phone Tapping Case: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు.. నిందితులు చిక్కడం ఖాయం, కొత్త చట్టమేంటి?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్‌ కేసుపై తెలంగాణ పోలీసులు సీరియస్‌గా దృష్టిపెట్టారు. అమెరికా ఉన్న నిందితులను ఎలాగైనా ఇండియాకు రప్పించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా నిందితులు ఏదో ఒక రూపంలో తప్పించుకుంటు న్నారు. ఈ క్రమంలో సరికొత్త అస్త్రాన్ని ప్రయోగించారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నివేదిక వెళ్లినట్టు సమాచారం.


తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది‌పైనే గడిచింది. తొలుత ఫోన్ ట్యాపింగ్ పై దృష్టి సారించారు పోలీసులు. ఈ క్రమంలో చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే పలువురు రిమాండ్‌లో ఉన్నారు. కేసు నమోదు తర్వాత అమెరికాకు వెళ్లిపోయారు కీలక నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు. వారిని రప్పించేందుకు పోలీసులు చేయని ప్రయత్నాలు లేవు. ఎప్పటికప్పుడు తిప్పుకొడుతూ వస్తున్నారు నిందితులు.

పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. అమెరికాలో ఉన్న ఇద్దరు నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులపై ఎక్స్‌ట్రడిషన్ అస్త్రాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకున్నారట పోలీసులు. కరుడుగట్టిన నేరస్తులను అప్పగించే విషయంలో భారత్-అమెరికా మధ్య ఉన్న ఒప్పందాన్ని తెరపై తెచ్చారు.


ఈ క్రమంలో సీఐడీ ద్వారా కేంద్ర హోంశాఖకు నివేదిక సైతం ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి విదేశాంగ శాఖ ద్వారా అమెరికాకు నివేదిక వెళ్లాల్సివుంది. అమెరికా ప్రభుత్వం దీన్ని పరిగణనలోకి తీసుకుంటే కచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితులు భారత్ రావడం ఖాయమన్నమాట.

ALSO READ: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి‌పై భూకబ్జా కేసు, ఎక్కడ? ఏం జరిగింది?

ఇద్దరు నిందితులపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు తెలంగాణ పోలీసులు. విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా ఇంటర్ పోల్‌కు సమాచారం పంపించారు. దీనిపై నిందితులు విదేశీ వ్యవహారాల శాఖలో అప్పీల్ చేశారు. ఓ వైపు ఈ తతంగం జరుగుతుండగా నేరస్తుల అప్పగింత ఒప్పందాన్ని తెరపైకి తెచ్చారు పోలీసులు.

నిందితులు ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావు‌లు అమెరికాలో అక్రమ వలసదారులుగా నివాసం ఉన్నారు. తమను రాజకీయ శరణార్ధిగా గుర్తించాలని మూడు నెలల కిందట ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆ అంశం అక్కడి ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

మంగళవారం నుంచి అమెరికాలో ట్రంప్ సర్కార్ అధికారంలోకి రానుంది. ఈ నేపథ్యంలో నిందితులు అప్పగింత సునాయాశమవుతుందని ఆలోచన చేస్తున్నారు పోలీసులు. ఈ వ్యవహారం వీలైనంత త్వరగా జరిగితే,  నిందితులు చిక్కడం ఖాయమని అంటున్నారు. వాళ్లు వస్తే.. తెరవెనుక సూత్రధారులు ఎవరన్నది తేలిపోనుంది. ఆపై కేసుకు ఓ ముగింపు రానుంది.

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×