Intinti Ramayanam Today Episode January 20th : నిన్నటి ఎపిసోడ్ లో.. పల్లవి తన పంతాన్ని నెగ్గిచ్చుకుంది. అక్షయ్ పల్లవి తో పాటు చక్రధర్ కూడా సారీ చెప్పాడు.. అవని ఎందుకు మీ తప్పు లేకున్నా సారీ చెప్పారు అని అడుగుతుంది. తల్లి ఫీల్ అవుతుందని సారీ చెప్పారు మరి భార్య అంటే మీకు లెక్క లేదా భార్యకి ఇచ్చే గౌరవం ఇదేనా అని అవని అడుగుతుంది. నేను కేవలం అమ్మ మీద ఉన్న ప్రేమతోనే మనసు చంపుకొని పల్లవికి వాళ్ళ నాన్నకి క్షమాపణలు చెప్పాను. నేను తల్లిగా గుర్తించట్లేదని బాధపడుతుంది మా అమ్మ బాధపడుతుంది. ఇప్పటికే నేను తన కొడుకును కాదని ఆమె ఫీల్ అవుతుంది ఇప్పుడు ఇలా చేయడంతో మళ్లీ ఇంకా బాధ పడుతుందని నేను మనసు చంపుకొని క్షమాపణలు చెప్పానని నువ్వు అర్థం చేసుకుంటే మన మధ్య గొడవలు రావని అక్షయ్ అంటాడు.. పల్లవిని కమల్ దారుణంగా అరుస్తాడు.. కానీ పార్వతికి అవని పై ఇంకాస్త కోపం వచ్చేలా చేస్తుంది. అవని వల్లే అక్షయ్ ఇలా మారారు అని నమ్మేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. పల్లవి అవనిపై పార్వతికి లేని పోనివి చెబుతుంది. ఇదంతా నా తప్పే నన్ను క్షమించండి అంటుంది.. నీ తప్పేమి లేదమ్మా నువ్వు అన్నది నిజమే కదా అని అంటుంది. పల్లవిని గుడ్డిగా నమ్మేస్తుంది. ఇక పల్లవి ప్లాన్ వర్కౌట్ అయ్యిందని సంబర పడిపోతుంది. అత్తయ్య నా ప్లాన్ లో ఇరుక్కుందని అనుకుంటుంది. అవని అత్తయ్య అలా మాట్లాడటం పై బాధను వ్యక్తం చేసింది. కోడలి కోసమే ఇదంతా జరుగుతుందని పార్వతి తెలుసుకోలేక పోతుంది. అవని మొత్తం చేసిందని మనసులో కోపాన్ని పెంచుకుంటుంది. ఇక కమల్ ఇంట్లో జరుగుతున్న వాటిని చూసి బాధపడతాడు. అందరు ఇలా చేస్తున్నారని ఆలోచిస్తూ ఉంటాడు. అన్నయ్యకు అమ్మ మీరు ఎంత ప్రేమ ఉందో చూసాం అమ్మకు అన్నయ్య మీద ఎంత ప్రేమ ఉందో అన్నయ్య బర్త్డే రోజే అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు వీరిద్దరూ ఎవరికి వారే అన్నట్టు ఉంటే అందరూ ఇద్దరిని చూసి బాధపడుతున్నారని కమల్ ఏదో ఒకటి చేయాలని ప్లాన్ చేస్తాడు.. తల్లి బాధను చూడలేక పోయిన కమల్ తల్లిని, అన్నయ్యను ఏదొక విధంగా కలపాలని అనుకుంటాడు.
పార్వతిని భోజనానికి రమ్మని కమల్ బలవంతంగా తీసుకొచ్చి డైనింగ్ హాల్ దగ్గర కూర్చో పెడతాడు. నాకు ఆకలిగా లేదురా నాకు తినాలనిపించట్లేదు అని అంటున్న కూడా డైనింగ్ టేబుల్ కుర్చీపై కూర్చో పెడతాడు. ఇక కమల్ అక్షయ్ ని భోజనానికి రమ్మని బలవంతంగా తీసుకుని వస్తాడు. ఇక అందరూ భోజనానికి వస్తారు. పార్వతి, అక్షయ్ లు ఒకరినొకరు చూసుకొని బాధపడతారు. ఇక మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలని కమలంటాడు.. తన తల్లి ప్రేమ కోసం వెంపర్లాడతాడు అక్షయ్ . పార్వతి మాత్రం అవనీని చూసి అక్షయకి ముద్ద పెట్టలేక పోతుంది చివరకి తల్లి ప్రేమ పొంగిపోయి అక్షయ్ కు అన్నం కలిపి పెడుతుంది.. ఉదయం శ్రీకర్ ఇంట్లో బాధపడుతూ ఉంటాడు. ఇంట్లో పరిస్థితులు ఏం బాగాలేవు శ్రియ. మీకు హార్ట్ ఎటాక్ వచ్చినప్పటి నుంచి ఆయన మనసు మనసులో లేదు మావయ్య ఆయన రానని అంటుంటే నేనే బలవంతంగా తీసుకొచ్చాను అని శ్రియా అంటుంది.
రాజేంద్రప్రసాద్ మాత్రం తన కొడుకుని ఇంట్లోకి రానివ్వడానికి అస్సలు ఒప్పుకోడు. కొడుకు పై కోపంతో చాలానే అంటాడు. పార్వతి నా కొడుకు నా ఇంట్లో ఉండకుండా ఎక్కడుంటాడని రాజేంద్రప్రసాద్ ని ఎదిరిస్తుంది. కొడుకుని దగ్గర లేని లేకుండా చేయడం కోసమేనా మీరు బిడ్డల్ని కన్నారని అంటుంది. ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది.. అవని శ్రీకర్ నేను రావద్దని చెప్పాను కదా మరి ఎందుకు వచ్చావు అని అంటుంది. బలవంతంగా శ్రీకర్ని శ్రీయాను ఇంట్లోంచి బయటకు వెళ్లమని చెబుతుంది. ఇది మాత్రం టెన్షన్ పడుతుంది. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. ఎపిసోడ్లో పల్లవి పార్వతికి అవనిపై మళ్ళీ అనుమానం మొదలయ్యేలా చేస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..