Musk Reacts US Award To Soros| అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ని 19 మంతి ప్రముఖులకు ప్రదానం చేశారు. ఈ పురస్కారం అందుకున్న వారిలో ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త , సామాజిక కార్యకర్త జార్జి సొరోస్ కూడా ఉన్నారు. అయితే సొరోస్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం చేయడంపై టెస్లా సిఈఓ, ప్రపంచంలోనే ధనవంతుడైన ఎలన్ మస్క్ తప్పుబట్టారు. జార్జి సొరోస్ క అంత పెద్ద పురస్కారం ప్రదానం చేయడం.. ఆ పురస్కారాన్ని అపహాస్యం చేయడమేనని చెప్పారు.
“బైడెన్ మెడల్ ఆఫ్ ఫ్రీడంని సొరోస్ కు ప్రదానం చేయడం ఆపహాస్యమే ” అని మస్క్ ఎక్స్ లో ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన పదవికాలం చివరి రోజుల్లో రాజకీయాలు, క్రీడులు, సినిమా, కళ, సమాజసేవ లాంటి వివిధ రంగాలకు చెందిన మొత్తం 19 మంది ప్రముఖులకు మెడల్ ఆఫ్ ఫ్రీడం పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ 19 మందిలో జార్జి సొరోస్ కు పురస్కారం ప్రదానం చేయడంపై అమెరికాలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రముఖ బిలియనీర్ వ్యాపారవేత్త అయిన జార్జి సొరోస్.. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్స్ అనే సమాజసేవ స్థాపించారు. ఆయన ప్రజాస్వామ్యం, విద్యా, సామాజిక న్యాయం కోసం ఎంతో కృషి చేసినందుకుగాను ప్రెసిడెన్షియల్ ఫ్రీడం అవార్డుకు ఎంపికయ్యారని అమెరికా అధ్యక్ష భవనమైన వైట్ హౌస్ అధికారికంగా ప్రకటించింది. ఆయనతో పాటు డెమొక్రాట్స్ పార్టీ నాయకురాలు , మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ హిల్లరీ క్లింటన్, ఫుట్ బాల్ లెజెండ్ లయోనెల్ మెస్సీ, ప్రముఖ నటులు డెన్జెల్ వాషింగ్టన్, మెకెల్ జె. ఫాక్స్ లాంటి ప్రముఖలుకు కూడా ఈ అవార్డు ప్రదానం చేశారు.
Also Read : డబ్బుల కోసం వ్యభిచారం చేస్తున్న టీచర్లు, డాక్టర్లు.. ఆ దేశంలో దిక్కుతోచని స్థితిలో మహిళలు!
కానీ జార్జి సొరోస్ ఎప్పుడూ డెమొక్రాట్స్ పార్టీలకే భారీ విరాళాలు ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ నాయకులను ఆయన ఎప్పుడూ దూషించేవారు. దీంతో ప్రస్తుతం అమెరికా తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ నాయకులు సొరోస్ కు అవార్డ్ ప్రదానం చేయడాన్ని ఖండిస్తున్నారు. ఈ అవార్డు రాజకీయ ఉద్దేశంతో మాత్రమే ఇవ్వడం జరిగిందని ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఈ ఆరోపణలను ప్రెసిడెంట్ జైడెన్ తప్పుబట్టారు. అమెరికా విలువలకు, ప్రపంచంలో దేశ ఖ్యాతి కోసం పనిచేసిన వారికే ఈ అవార్డులు ప్రదానం చేస్తున్నామని తెలిపారు.
కానీ రిపబ్లికన్ పార్టీ నాయకులు మాత్రం అంతటితో ఆగలేదు. జారి సొరోస్ తన సంపదను అంతర్జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయడానికి ఉపయోగించారని విమర్శలు చేశారు.
ప్రస్తుతం ఇండియాలోని అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా జార్జి సొరోస్‌కు వ్యతిరేకం. డిసెంబరులో జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో బిజేపీ అధ్యక్షుడు జెపి నడ్డా.. జార్జి సోరోస్ తన సంస్థల ద్వారా కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ.. జార్జి సొరోస్ చేతిలో కీలు బొమ్మలని నడ్డా వ్యాఖ్యానించారు.
జార్జి సొరోస్‌కు చెందిన ఓపెన్ సొసైటీ ఫౌండేషన్‌ని హంగేరి, రష్యా దేశాల దేశాలు నిషేధించాయి. ఈ సంస్థ తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటోదని గతంలో ఆరోపణలు చేశాయి.