E-Paper
Advertisement

80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?

80ల్లో ఆటలు.. పెనవేసుకొనే బంధాలు.. ఇప్పుడవి ఏమైపోయాయ్?
Advertisement

అది 80’s కాలం. సాయంత్రం అయితే చాలు. ఇంటి ఆవరణలో ఓ చిన్న ప్రపంచం మొదలయ్యేది. అమ్మమ్మ ఓ మూల కూర్చునేది. పిల్లలంతా ఆమె చుట్టూ చేరేవాళ్లు. ఎవరికి ఏ ఆట రావాలో. ఎవరు ఎలా ఆడాలో. అన్నీ అమ్మమ్మే నేర్పించేది. అష్టాచమ్మా బోర్డు బయటకు వస్తే చాలు. ఇంట్లో చిన్న పండుగ వాతావరణం వచ్చేది. ఓ పావు ముందుకు కదిలితే ఆనందం. ఓ పావు వెనక్కి వెళ్తే చిన్న కోపం. “నేనే గెలుస్తా”. “నువ్వు ఓడిపోతావు”. అంటూ చిన్న చిన్న మాటలు. కానీ ఆ మాటల్లో కూడా ప్రేమే ఉండేది. ఎవరు గెలిచారన్నది గుర్తుండేది కాదు. ఆట ఆడిన వాళ్లు మాత్రం జీవితాంతం గుర్తుండిపోయేవారు.

వామన గుంటలు..

ఇక వామన గుంటలు. ఓ అందమైన ఆట. చిన్న చిన్న గింజలు. చిన్న చిన్న గుంటలు. కానీ వాటి చుట్టూ తిరిగిన జ్ఞాపకాలు మాత్రం ఎంతో పెద్దవి. గింజలు లెక్క పెడుతూ.. పిల్లలకు తెలియకుండానే లెక్కలు నేర్పిన ఆట. ఆడుతూ మధ్యలో అమ్మమ్మ చెప్పే కథలు. నవ్వుతూ గడిపిన ఆ క్షణాలు. ఇప్పటికీ చాలామంది మనసుల్లో అలాగే ఉన్నాయి. అప్పుడు ఇంట్లో అందరూ కలిసి ఉండేవారు. ఒకరు ఓడితే మరొకరు నవ్వించేవారు. ఒకరు అలిగితే మరొకరు బుజ్జగించేవారు. ఎందుకంటే… అప్పటి ఆటల్లో ఓడిపోయినా.. బంధాలు మాత్రం ఎప్పుడూ గెలిచేవి.

ఇప్పుడు ఆటలన్నీ మొబైల్‌లోనే..

Advertisement

ఇప్పుడు కాలం మారిపోయింది. అమ్మమ్మ చుట్టూ కూర్చునే పిల్లల స్థానంలో.. మొబైల్ స్క్రీన్ ముందు కూర్చున్న పిల్లలు కనిపిస్తున్నారు. అష్టాచమ్మా బోర్డు స్థానంలో… ఆన్‌లైన్ గేమ్స్ వచ్చాయి. వామన గుంటల స్థానంలో… వీడియో గేమ్స్ వచ్చాయి. అప్పుడు నవ్వులు ఇంట్లో వినిపించేవి… ఇప్పుడు నోటిఫికేషన్ శబ్దాలు వినిపిస్తున్నాయి. టెక్నాలజీ మారింది. కాలం మారింది. కానీ అమ్మమ్మ పక్కన కూర్చుని ఆడిన ఆ ఆటలు… కుటుంబం మొత్తం కలిసి నవ్వుకున్న ఆ సాయంత్రాలు… అవి మాత్రం ఏ గేమ్‌లోనూ దొరకవు. అందుకే 80’s ట్రెండ్. పాత ఆటలను మాత్రమే గుర్తు చేయడం కాదు. మనకు తెలియకుండానే దూరమైన ఓ ప్రేమను.. ఓ కుటుంబాన్ని ఓ అందమైన బాల్యాన్ని మళ్లీ మన దగ్గరకు తీసుకొస్తోంది.

Also Read: 80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

Advertisement

Also Read: 1980లో ప్రపంచ కప్.. రేడియోలోనే లైవ్, టీమిండియా సత్తాను ప్రపంచానికి చాటిన రోజులవి!

Tags

Related News

ఒక్క ఫోటో కోసం ఎన్నో రోజులు ఎదురుచూపులు.. 80s స్టూడియో అనుభూతే వేరు!

80’s లవ్ లెటర్.. కాగితంపై మనసులో మాట.. అక్షరాల్లో అంతులేని ప్రేమ!

స్త్రీలు కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజం.. PCOS – PCOD మధ్య అసలు తేడా ఇదే!

సైకిల్ బెల్ వినిపిస్తే చాలు.. ఉత్తరం వచ్చిందనే ఆనందం, అప్పుడు డబ్బాలు.. ఇప్పుడు ఫోన్లు!

80’s సోకులు.. ఏఐతో హంగులు.. జెన్ జీ ఫుల్ ఫిదా, ఎందుకంటే?

పొరపాటున కూడా..ఇలాంటి వినాయక విగ్రహాలు అసలు కొనొద్దు!

ఆస్తమా రోగుల కోసం సూపర్ మొక్క.. దీని ప్రత్యేకతలు తెలుసా

Big Stories

Advertisement
×